Home
Mobile

7200mAh భారీ బ్యాటరీ, 50MP సోనీ కెమెరా, HD+ డిస్‌ప్లేతో Vivo 5G స్మార్ట్‌ఫోన్‌ విడుదల..!

భారత్‌లో వివో నుంచి కొత్తగా T సిరీస్‌ ఫోన్‌ లాంచ్ అయింది. వివో T5x 5G పేరుతో (Vivo T5x 5G Smartphone) అందుబాటులోకి వచ్చింది. ఈ ఫోన్ 7200mAh భారీ బ్యాటరీ, 50MP సోనీ కెమెరాను కలిగి ఉంది. 4 సంవత్సరాల వరకు సెక్యూరిటీ అప్‌డేట్స్‌ ను పొందుతుంది. తొలిసేల్‌ లో భాగంగా రూ.2 వేల డిస్కౌంట్‌ ను పొందవచ్చు. ఈ ఫోన్‌ పూర్తి స్పెసిఫికేషన్లు, ఫీచర్ల వివరాలు.

వివో T5x 5G స్పెసిఫికేషన్లు, ఫీచర్లు :
ఈ ఫోన్‌ 6.76 అంగుళాల HD+ LCD డిస్‌ప్లేతో విడుదల అయింది. ఈ డిస్‌ప్లే 120Hz రీఫ్రెష్‌ రేట్‌, 1200 నిట్స్‌ గరిష్ఠ బ్రైట్‌నెస్‌ను కలిగి ఉంది. ఐ కంఫర్ట్‌ మోడ్ సహా TUV Rheinland Low బ్లూ లైట్‌ సర్టిఫికేషన్‌, మిలిటరీ గ్రేడ్‌ షాక్‌ రెసిస్టెన్స్‌ సర్టిఫికేషన్‌లు ఉన్నాయి.

Vivo T5x 5G smartphone launched in india

4 సంవత్సరాల వరకు అప్‌డేట్స్‌ :
ఈ వివో స్మార్ట్‌ఫోన్‌ మీడియాటెక్‌ డైమెన్సిటీ 7400 టర్బో చిప్‌ను కలిగి ఉంది. 8GB ర్యామ్ + 256GB స్టోరేజీతో జతచేసి ఉంటుంది. ఆండ్రాయిడ్ 16 ఆధారిత OriginOS 6 పైన పనిచేస్తుంది. 2 ఆండ్రాయిడ్ OS అప్‌డేట్స్‌, 4 సంవత్సరాల వరకు సెక్యూరిటీ అప్‌డేట్స్‌ను పొందుతుంది.

50MP ప్రైమరీ, 32MP సెల్ఫీ కెమెరాలు :
కెమెరా విభాగం పరంగా వెనుక వైపు రెండు కెమెరాలు ఉన్నాయి. ఇందులో 50MP సోనీ IMX852 ప్రైమరీ కెమెరా, 2MP బొకేష్‌ లెన్స్‌ ఉన్నాయి. సెల్ఫీ, వీడియో కాల్స్‌ కోసం ముందు వైపు 32MP సెల్ఫీ కెమెరా ఉంది.

7200mAh బ్యాటరీ :
వివో T5x 5G ఫోన్‌ 44W వైర్‌ ఛార్జింగ్‌ సపోర్టుతో 7200mAh బ్యాటరీని కలిగి ఉంది. ఒక్కసారి పూర్తిగా ఛార్జింగ్ చేసి 40 గంటల వీడియో ప్లేబ్యాక్‌ లేదా 93 గంటల మ్యూజిక్‌ ప్లేబ్యాక్‌ లేదా 14.5 గంటల నేవిగేషన్‌ టైమ్‌ను అందిస్తుందని వివో చెబుతోంది.

కనెక్టివిటీ పరంగా 5G, 4G, బ్లూటూత్‌ 5.4, వైఫై, GPS, USB-C ఛార్జింగ్‌ పోర్టు ఉంది. IP68 + IP69 రేటింగ్‌తో డస్ట్‌, వాటర్‌ రెసిస్టెంట్‌గా ఉంది. యాక్సెలిరోమీటర్‌, యాంబియంట్‌ లైట్‌, ఇ-కంపాస్‌, గైరోస్కోప్‌, ప్రాక్సిమిటీ సెన్సార్‌లు ఉన్నాయి.

Vivo T5x 5G smartphone launched in india

వివో T5x 5G స్మార్ట్‌ఫోన్‌ ధర, సేల్‌ :
ఈ ఫోన్ 6GB ర్యామ్ + 128GB స్టోరేజీ ధర రూ.18999, 8GB ర్యామ్ + 128GB స్టోరేజీ ధర రూ.20999, 8GB ర్యామ్ + 256GB స్టోరేజీ వేరియంట్ ధర రూ.22999 గా ఉంది. తొలిసేల్‌ మార్చి 24 వ తేదీ నుంచి ప్రారంభం కానుంది.

ఈ ఫోన్‌ను వివో ఇండియా ఇ-స్టోర్‌, ఫ్లిప్‌కార్ట్‌, ఇతర రిటైల్‌ స్టోర్‌ల ద్వారా కొనుగోలు చేయవచ్చు. తొలిసేల్‌లో భాగంగా HDFC, SBI, Axis బ్యాంకుల కార్డులపై గరిష్ఠంగా రూ.2000 డిస్కౌంట్‌ను పొందవచ్చు. 6 నెలల వరకు నోకాస్ట్‌ EMI ఆప్షన్‌ అందుబాటులో ఉంటుంది.

More from GizBot

Best Mobiles in India

English summary
Vivo T5x 5G smartphone with 7200mAh Battery, MediaTek dimensity 7400 Turbo Chip in india
Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
X