మంచి కెమెరా ఫోన్ కోసం చూస్తున్నారా.. అయితే ఈ వివో స్మార్ట్‌ఫోన్ కోసం కొన్నిరోజులు వెయిట్ చేయండి..!
Vivo T4 Ultra Smartphone : వివో నుంచి ఈ సంవత్సరం T4 సిరీస్ లాంచ్ అయింది. ఇందులో భాగంగా వివో T4x, వివో T4 స్మార్ట్‌ఫోన్‌లు అందుబాటులోకి వచ్చాయి. అయితే ఈ సిరీస్‌లో భాగంగా మరో స్మార్ట్‌ఫోన్ త్వరలో విడుదల కానుంది. వివో T4 అల్ట్రా పేరుతో భారత్ మార్కెట్‌లో అందుబాటులోకి రానుంది. ఈ ఫోన్ గురించి ఇప్పటికే అనేక వివరాలు వెల్లడయ్యాయి.
ప్లాగ్‌షిప్ లెవల్ జూమ్ :
అయితే తాజాగా వివో T4 అల్ట్రా స్మార్ట్‌ఫోన్ కెమెరా వివరాలకు సంబంధించిన టీజర్‌ను షేర్ చేసింది. దీని ఆధారంగా ఫ్లాగ్‌షిప్ లెవల్ జూమ్ సామర్థ్యాలు ఉంటాయని తెలిపింది. ఈ ఫోన్ 100X జూమ్‌తో పెరిస్కోప్ టెలిఫోటో కెమెరాతో కూడిన ట్రిపుల్ కెమెరాలను కలిగి ఉంటుంది. మరియు LED ఫ్లాష్ రింగ్ ను కూడా కలిగి ఉంటుంది.

ఇతర కెమెరా వివరాలు :
ఇప్పటికే లీకైన వివరాల ఆధారంగా వివో T4 అల్ట్రా స్మార్ట్‌ఫోన్ 50MP సోనీ IMX921 ప్రైమరీ కెమెరాతోపాటు 50MP పెరిస్కోప్ లెన్స్‌ను కలిగి ఉంటుందని తెలుస్తోంది. సెల్ఫీ కెమెరాతోపాటు మరో కెమెరా వివరాలు తెలియాల్సి ఉంది. మొత్తంగా బెస్ట్ కెమెరా అనుభూతిని అందించే అవకాశం ఉందని తెలుస్తోంది.
స్పెసిఫికేషన్ల వివరాలు! :
దీంతోపాటు ఈ వివో హ్యాండ్‌సెట్ 90W ఛార్జింగ్ సపోర్టుతో 6000mAh బ్యాటరీతో లాంచ్ అయ్యే అవకాశం ఉంది. మరియు 120Hz రీఫ్రెష్ రేట్‌తో 6.67 అంగుళాల pOLED డిస్‌ప్లేతో అందుబాటులోకి వస్తుందని తెలుస్తోంది. మరియు మీడియాటెక్ డైమెన్సిటీ 9300 సిరీస్ చిప్‌సెట్‌తో పనిచేసే అవకాశం ఉంది. అయితే ఈ స్పెసిఫికేషన్‌లపై వివో ఎటువంటి అధికారిక ప్రకటన చేయలేదు.
Get in the zone with an Ultra-powerful zoom! You down to get those clear clicks?#T4Ultra #GetSetTurbo #TurboLife #ComingSoon pic.twitter.com/GR2QhBfCNp
— vivo India (@Vivo_India) May 30, 2025
ఫ్లిప్‌కార్ట్ ద్వారా :
వివో T4 అల్ట్రా స్మార్ట్‌ఫోన్ జూన్ నెలలోనే విడుదల కానుందని తెలుస్తోంది. ఈ ఫోన్ రూ.30 వేల ధర సెగ్మెంట్‌లో అందుబాటులోకి వచ్చే అవకాశం ఉందని అంచనా వేస్తున్నారు. ఈ హ్యాండ్‌సెట్ వివో ఇండియా ఆన్‌లైన్, ఆఫ్‌లైన్ స్టోర్‌లతోపాటు ప్రముఖ ఇ-కామర్స్ ప్లాట్‌ఫాం ఫ్లిప్‌కార్ట్ ద్వారా సేల్ ప్రారంభం కానుంది.
ఇటీవల విడుదల అయిన భారీ బ్యాటరీ వివో ఫోన్ :
వివో T4 సిరీస్‌లో భాగంగా ఇటీవల T4 స్మార్ట్‌ఫోన్ అందుబాటులోకి వచ్చింది. ఈ ఫోన్ 6.77 అంగుళాల FHD+ అమోలెడ్ క్వాడ్ కర్వడ్ డిస్‌ప్లేతో విడుదల అయింది. ఈ హ్యాండ్‌సెట్ స్నాప్‌డ్రాగన్ 7s జెన్ 3 SoC చిప్‌సెట్, ఆండ్రాయిడ్ 15 ఆధారిత Funtouch OS 15 తో పనిచేస్తోంది.
వివో T4 5G ఫోన్ వెనుక వైపు డ్యూయల్ కెమెరాలను కలిగి ఉంది. ఇందులో 50MP OIS (ఆప్టికల్ ఇమేజ్ స్టెబిలైజేషన్) ప్రైమరీ కెమెరా, 2MP సెకండరీ కెమెరాను కలిగి ఉంది. సెల్ఫీ, వీడియో కాల్స్ కోసం 32MP కెమెరాను అమర్చారు.
ఈ ఫోన్ 90W ఛార్జింగ్ సపోర్టుతో 7300mAh భారీ బ్యాటరీతో పనిచేస్తోంది. ఈ ఫోన్ 8GB ర్యామ్ + 128GB స్టోరేజీ వేరియంట్ ధర రూ.21,999, 8GB ర్యామ్ + 256GB స్టోరేజీ ధర రూ.23999, 12GB ర్యామ్ + 256GB స్టోరేజీ వేరియంట్ ధర రూ.25999 గా ఉంది.


Click it and Unblock the Notifications








