Just In
- 2 hrs ago ఎలోన్ మస్క్ StarLink ఇంటర్నెట్ ఇండియా లాంచ్ త్వరలోనే! ప్రభుత్వం ఆమోదించింది
- 3 hrs ago వాట్సాప్‌లో Recently Online ఫీచర్.. ఎమర్జెన్సీ సమయంలో ఎలా పనిచేస్తుంది..?
- 4 hrs ago 100mbps అధిక వేగంతో Airtel Xstream AirFiber కొత్త ప్లాన్లు! ప్లాన్ల వివరాలు
- 5 hrs ago Galaxy Watch 7 శాంసంగ్ కొత్త వాచ్ సిరీస్ కీలక వివరాలు లీక్.. అన్ప్యాక్డ్ ఈవెంట్లో విడుదల?
Don't Miss
- News Sri Rama Navami: రాముడికి నైవేద్యంగా పానకం, వడపప్పు స్పెషల్.. ఎందుకంటే!!
- Sports KKR vs RR: అందుకే తుది జట్టులో మార్పులు చేశాం: సంజూ శాంసన్
- Automobiles ఆటో డ్రైవర్లకు గుడ్ న్యూస్.. ఇకపై ఓలా, ఉబర్, ర్యాపిడో యాప్‌ల్లో ఈ ఆప్షన్ ఉండదు.!!
- Lifestyle రామసేతు ఇక ఎప్పటికీ మిస్టరీగానే ఉంటుందా.. శాస్త్రవేత్తలు ఏమి చెబుతున్నారంటే..!
- Travel Ramanarayanam Temple: విజయనగరంలోని ఈ రాములవారి ఆలయ ప్రత్యేకతలెన్నో..!
- Movies Paayal Rajput: మెరుపుల డ్రెస్‌లో మంగళవారం బ్యూటీ మెస్మరైజింగ్ షో.. ఎంతందంగా ఉందో కదా!
- Finance Market Closing: సెన్సెక్స్-నిఫ్టీ ఢమాల్.. మూడోరోజూ కొనసాగిన అమ్మకాల ఒత్తిడి..
Vivo U20 : మార్కెట్లోకి మరో మిడ్-రేంజ్ స్మార్ట్‌ఫోన్... వివో యు 20 ఎలా ఉందో చూడండి
వివో సంస్థ ఈ రోజు ఇండియాలో వివో U20 ను విడుదల చేసింది. కొత్తగా లాంచ్ అయిన తాజా వివో ఫోన్ ట్రిపుల్ రియర్ కెమెరా సెటప్‌ను కలిగి ఉంది. న్యూ డిల్లీలో జరిగిన కార్యక్రమంలో ఈ పరికరాన్ని ప్రారంభించింది. వివో తన మొదటి ఆన్లైన్-సెంట్రిక్ స్మార్ట్‌ఫోన్‌గా U10 ను సెప్టెంబర్‌లో ప్రారంభించింది. ఇప్పుడు ఈ సిరీస్‌లో రెండవ స్మార్ట్‌ఫోన్‌గా వివో U20ను పరిచయం చేస్తోంది. వివో U20 మెరుగైన డిజైన్ మరియు వేగవంతమైన ప్రాసెసర్‌ను కలిగి ఉంది.
ధరలు మరియు ఆఫర్స్ వివరాలు
వివో U20 రెండు వేరు వేరు వేరియంట్లలో లభిస్తుంది. ఇండియాలో వీటి ధరల వివరాలు వరుసగా బేస్ మోడల్ 4 జిబి RAM + 64 జిబి స్టోరేజ్ వేరియంట్ ధర రూ.10,990. మరియు 6 జిబి RAM + 64 జిబి స్టోరేజ్ మోడల్ ధర రూ.11,990. వివో యొక్క తాజా ఫోన్ రేసింగ్ బ్లాక్ మరియు బ్లేజ్ బ్లూ కలర్ ఆప్షన్లలో వస్తుంది. ఈ ఫోన్ నవంబర్ 28 నుండి మధ్యాహ్నం 12 గంటల నుండి ఇండియాలో అమ్మకాలు మొదలు కానున్నాయి. ఇది అమెజాన్.ఇన్ మరియు అధికారిక వివో ఇ-షాప్ ద్వారా లభిస్తుంది. వివో యు 20 లో లాంచ్ ఆఫర్లలో ప్రీపెయిడ్ కొనుగోలుపై రూ.1,000 తగ్గింపు లభిస్తుంది.
స్పెసిఫికేషన్స్
డ్యూయల్ సిమ్ స్లాట్ గల వివో U20 ఆండ్రాయిడ్ పై మరియు ఫన్‌టచ్ OS 9 కస్టమ్ స్కిన్‌తో రన్ అవుతుంది. ఈ ఫోన్లో 6.53-అంగుళాల ఫుల్-హెచ్డి + (1080 x 2340 పిక్సెల్స్) డిస్ప్లే 90.3 శాతం స్క్రీన్-టు-బాడీ రేషియోతో వస్తుంది. ఈ ఫోన్ వైడ్విన్ L1 ధృవీకరణను పొందినట్లు వివో పేర్కొంది. అంటే వినియోగదారులు నెట్‌ఫ్లిక్స్ మరియు అమెజాన్ ప్రైమ్ వీడియో వంటి స్ట్రీమింగ్ సేవలను అధిక రిజల్యూషన్ కంటెంట్‌తో ఆస్వాదించవచ్చు. వివో U20 ఆక్టా-కోర్ క్వాల్కమ్ స్నాప్‌డ్రాగన్ 675 SoCను కలిగి ఉండి 6GB వరకు గల RAM తో జతచేయబడి ఉంటుంది.
Vodafone Long Term Plans ధరల పెంపుపై వోడాఫోన్ యూజర్లకు కొంత కాలం ఊరట
ఫోన్ యొక్క ట్రిపుల్ రియర్ కెమెరా సెటప్ విషయానికి వస్తే ఇది సోనీ IMX499 సెన్సార్ మరియు f / 1.8 ఎపర్చర్‌తో 16 మెగాపిక్సెల్ గల మెయిన్ కెమెరా ద్వారా హైలైట్ చేయబడుతుంది. దీనితో పాటు 8 మెగాపిక్సెల్ కెమెరా వైడ్-యాంగిల్ సెన్సార్, ఎఫ్ / 2.2 ఎపర్చరు మరియు 120-డిగ్రీల వీక్షణ క్షేత్రంతో వస్తుంది. దీనితో పాటు 2 మెగాపిక్సెల్ మాక్రో కెమెరా ఎఫ్ / 2.4 ఎపర్చరుతో వస్తుంది. అలాగే ముందు భాగంలో ఎఫ్ / 2.0 ఎపర్చర్‌తో సెల్ఫీల కోసం 16 మెగాపిక్సెల్ కెమెరా కూడా ఉంది.
వివో U 20 స్మార్ట్ ఫోన్ 64 జిబి వరకు ఇంటర్నల్ స్టోరేజీతో ప్యాక్ చేయబడి వస్తుంది. ప్రత్యేకమైన మైక్రో SD కార్డ్ స్లాట్ ద్వారా మెమొరీను 256 జిబి వరకు ద్వారా విస్తరించే సదుపాయం కూడా ఉంది. వివో U20 లోని కనెక్టివిటీ ఎంపికలలో 4G LTE, వై-ఫై, బ్లూటూత్ 5.0, GPS , BeiDou, GLONASS మరియు గెలీలియో ఉన్నాయి. ఫోన్ లోపల ప్యాక్ చేయబడిన సెన్సార్లు యాక్సిలెరోమీటర్, యాంబియంట్ లైట్ సెన్సార్, సామీప్య సెన్సార్, మాగ్నెటోమీటర్, గైరోస్కోప్ మరియు యాక్సిస్ కోసం వెనుక-మౌంటెడ్ ఫింగర్ ప్రింట్ సెన్సార్ కూడా ఉన్నాయి.
వివో యు 20 ఆక్టా-కోర్ క్వాల్కమ్ స్నాప్‌డ్రాగన్ 675 SoC చేత రన్ అవుతుంది. ఇది దాని ముందుతరం స్మార్ట్ ఫోన్లలో వున్న స్నాప్‌డ్రాగన్ 665 SoC కంటే 25 శాతం అధిక వేగంతో పనిచేస్తుంది అని పేర్కొంది. ఇది యాజమాన్య 18W డ్యూయల్-ఇంజిన్ ఫాస్ట్ ఛార్జింగ్ టెక్నాలజీకి మద్దతు ఇచ్చే 5,000 ఎమ్ఏహెచ్ బ్యాటరీని కలిగి ఉంది.
-
54,999
-
36,599
-
39,999
-
38,990
-
1,29,900
-
79,990
-
38,900
-
18,999
-
19,300
-
69,999
-
79,900
-
1,09,999
-
1,19,900
-
21,999
-
1,29,900
-
12,999
-
44,999
-
15,999
-
7,332
-
17,091
-
29,999
-
7,999
-
8,999
-
45,835
-
77,935
-
48,030
-
29,616
-
57,999
-
12,670
-
79,470