ఆఫర్లతో పాటు ఆకట్టుకునే ఫీచర్లు, ఇండియాకి వచ్చేసిన Vivo V11
చైనా మొబైల్స్ తయారీదారు వివో తన నూతన స్మార్ట్‌ఫోన్ వి11 ను భారత మార్కెట్‌లో విడుదల చేసింది.
చైనా మొబైల్స్ తయారీదారు వివో తన నూతన స్మార్ట్‌ఫోన్ వి11 ను భారత మార్కెట్‌లో విడుదల చేసింది. వివో విసిరీస్‌కు కొనసాగింపుగా ఈ స్మార్ట్‌ఫోన్‌ను తీసుకొచ్చింది. స్టారీ నైట్ బ్లాక్, నెబ్యులా పర్పుల్ కలర్ వేరియెంట్లలో ఈ డివైస్‌ను కంపెనీ విడుదల చేసింది. దీని ధరను రూ.22,900గా నిర్ణయించింది. వివో ఇ-స్టోర్, ఫ్లిప్‌కార్ట్ సైట్‌లో ప్రత్యేకంగా ఈ నెల 27 నుంచి ఈ ఫోన్ విక్రయానికి రానుంది.ఈ ఫోన్‌లో 6.3 ఇంచుల భారీ డిస్‌ప్లేను ఏర్పాటు చేశారు. 6జీబీ పవర్‌ఫుల్ ర్యామ్‌ను ఇందులో అమర్చారు. 16, 5 మెగాపిక్సల్ డ్యుయల్ బ్యాక్ కెమెరాలు, 25 మెగాపిక్సల్ సెల్ఫీ కెమెరా ఇందులో ఉన్నాయి. ఇందులో మెమొరీ కార్డు కోసం డెడికేటెడ్ స్లాట్‌ను ఏర్పాటు చేశారు. వివో వి11 స్మార్ట్‌ఫోన్ స్టారీ నైట్ బ్లాక్, నెబ్యులా పర్పుల్ కలర్ వేరియెంట్లలో రూ.22,900 ధరకు వినియోగదారులకు ఫ్లిప్‌కార్ట్ సైట్‌లో ప్రత్యేకంగా లభ్యం కానుంది.

వివో వి11 ఫీచర్లు
6.3 ఇంచ్ ఫుల్ హెచ్‌డీ ప్లస్ డిస్‌ప్లే, 2280 x 1080 పిక్సల్స్ స్క్రీన్ రిజల్యూషన్, ఆక్టాకోర్ ప్రాసెసర్, 6 జీబీ ర్యామ్, 64 జీబీ స్టోరేజ్, 256 జీబీ ఎక్స్‌పాండబుల్ స్టోరేజ్, డ్యుయల్ సిమ్, ఆండ్రాయిడ్ 8.1 ఓరియో, 16, 5 మెగాపిక్సల్ డ్యుయల్ బ్యాక్ కెమెరాలు, 25 మెగాపిక్సల్ సెల్ఫీ కెమెరా, ఫింగర్‌ప్రింట్ సెన్సార్, డ్యుయల్ 4జీ వీవోఎల్‌టీఈ, డ్యుయల్ బ్యాండ్ వైఫై, బ్లూటూత్ 4.2, 3315 ఎంఏహెచ్ బ్యాటరీ, ఫాస్ట్ చార్జింగ్.

ఆఫర్ల విషయానికి వస్తే..
ఈ స్మార్ట్‌ఫోన కొనుగోలుపై ఆఫర్ల విషయానికి వస్తే హెచ్‌డీఎఫ్‌సీ క్రెడిట్, డెబిట్‌కార్డ్ కొనుగోళ్లపై 2వేల రూపాయల క్యాష్ బ్యాక్ ఆఫర్ అందిస్తోంది. అలాగే ఫ్లిప్‌కార్ట్‌లో బై బ్యాక్‌గ్యారంటీతోపాటు ఆరునెలల్లో వన్‌టైం స్క్రీన్ రీప్లేస్ మెంట్ ఆఫర్ ఉంది.

జియో, వోడాఫోన్ ఐడియా..
అంతేకాదు జియో, వోడాఫోన్ ఐడియా, మింత్రా, పేటీఎం, స్విగ్గీ ఆఫర్లను కూడా అందిస్తోంది. పేటీఎం మాల్‌తో కొనుగోలు చేస్తే రూ.2వేల క్యాష్‌బ్యాక్ లభిస్తుంది. రిలయన్స్ జియో ద్వారా రూ.4050 విలువైన ఆఫర్లను వినియోగదార్లు పొందవచ్చు.

రీచార్జ్‌లపై డ్యామేజ్ ఆఫర్..
వొడాఫోన్ ఐడియా భాగస్వామ్యంతో ప్రీపెయిడ్ కస్టమర్లకు రూ. 499పైన రీచార్జ్‌లపై డ్యామేజ్ ఆఫర్ అందివ్వనుంది. 198, 399 రూపాయల ప్లాన్లపై ప్రీపెయిడ్ కస్టమర్లకు 820జీబీ డేటా, ప్రీపెయిడ్ వినియోగదారులకు 600జీబీ డేటా ఆఫర్ అందివ్వనుంది.

మింత్రా, స్విగ్గీ, పేటీఎం కూపన్లు..
వీటితోపాటు రూ. 2,100 రూపాయల విలువైన మింత్రా, స్విగ్గీ, పేటీఎం కూపన్లు కూడా అందిస్తోంది. క్యాపిటల్ ఫస్ట్ ఈఎంఐతో ఫోన్‌ను కొనుగోలు చేస్తే 5 శాతం క్యాష్‌బ్యాక్ ఇస్తారు.ఈ ఆఫర్లు సెప్టెంబరు 30న ముగుస్తాయి.


Click it and Unblock the Notifications








