ఫిబ్రవరి 20న దిగ్గజాలకు ఝలక్ ఇవ్వనున్న వివో

ఇండియన్ స్మార్ట్‌ఫోన్ మార్కెట్లో తనకంటూ ప్రత్యేకమైన గుర్తింపును సొంతం చేసుకున్న వివో, బడ్జెట్ ఫ్రెండ్లీ ధర ట్యాగ్‌లలో ఫీచర్ రిచ్ స్మార్ట్‌ఫోన్‌లను మార్కెట్‌కు పరిచయం చేస్తోంది.

|

ఇండియన్ స్మార్ట్‌ఫోన్ మార్కెట్లో తనకంటూ ప్రత్యేకమైన గుర్తింపును సొంతం చేసుకున్న వివో, బడ్జెట్ ఫ్రెండ్లీ ధర ట్యాగ్‌లలో ఫీచర్ రిచ్ స్మార్ట్‌ఫోన్‌లను మార్కెట్‌కు పరిచయం చేస్తోంది.కాగా వివో ఇప్పుడు మరో సరికొత్త ఫోన్ ను లాంచ్ చేయబోతుంది.గతంలో విడుదల చేసిన Vivo V11 Pro కు సక్సెసర్ గా కొత్త ఫోన్ ను తీసుకరాబోతుంది.అయితే ఈ ఫోన్ పేరు వివో కంపెనీ ఇప్పటి వరకు ప్రకటించలేదు.కాగా ఈ కొత్త ఫోన్ ను Vivo V13 Pro లేదా Vivo V15 Pro తో విడుదల చేయబోతున్నట్టు పుకార్లు వినిపిస్తున్నాయి.గతంలో విడుదలైన Vivo V11 Pro పలు హైలైటెడ్ ఫీచర్స్ గురించి ఇప్పుడు తెలుసుకుందాం..

 

మూడు అదిరిపోయే ప్రీపెయిడ్ ప్లాన్స్ ను లాంచ్ చేసిన వోడాఫోన్మూడు అదిరిపోయే ప్రీపెయిడ్ ప్లాన్స్ ను లాంచ్ చేసిన వోడాఫోన్

ఫుల్‌వ్యూ డిస్‌ప్లే

ఫుల్‌వ్యూ డిస్‌ప్లే

వివో తన V11 Pro స్మార్ట్‌ఫోన్‌లో శక్తివంతమైన 6.4 ఇంచ్ ఫుల్ హైడెఫినిషన్ ప్లస్ హాలో ఫుల్‌వ్యూ సూపర్ అమోల్డ్ డిస్‌ప్లేను ఏర్పాటు చేసింది. స్లిమ్ బీజిల్స్‌తో వస్తోన్న ఈ డిస్‌ప్లే 91.27% హయ్యస్ట్ స్ర్కీన్ టు బాడీ రేషియోను కలిగి ఉంటుంది. డిస్‌ప్లే పై భాగంలో ఏర్పాటు చేసిన వాటర్ డ్రాప్ నాట్చ్ ఫ్రంట్ ఫేసింగ్ కెమెరాతో అటాచ్ అయి ఉంటుంది. 19:5:9 యాస్పెక్ట్ రేషియోను కలిగి ఉన్న ఈ డిస్‌ప్లే హై-క్వాలిటీ వ్యూవింగ్ ఎక్స్‌పీరియన్స్‌ను ఆఫర్ చేస్తుంది.

ఇన్-డిస్‌ప్లే ఫింగర్‌ప్రింట్ టెక్నాలజీ

ఇన్-డిస్‌ప్లే ఫింగర్‌ప్రింట్ టెక్నాలజీ

వివో తన V11 Pro డివైస్‌లో ఫోర్త్ జనరేషన్ ఇన్-డిస్‌ప్లే ఫింగర్‌ప్రింట్ స్కానర్‌ను ఏర్పాటు చేసింది. ఈ లేటెస్ట్ సెన్సార్ మునుపటి సెన్సార్స్‌తో పోలిస్తే సులువైన కాన్ఫిగరేషన్‌ను కలిగి 50 రెట్ల ఎక్కువ ఖచ్చితత్వంతో స్పందించగలుగుతుంది. ఈ ఫింగర్ ప్రింట్ సెన్సార్‌లో నిక్షిప్తం అధునాతన బయోమెట్రిక్ సెన్సార్ రెప్పపాటులో డివైస్‌ను అన్‌లాక్ చేసేస్తోంది. మునుపటి జనరేషన్ ఇన్-డిస్‌ప్లే ఫింగర్ ప్రింట్ స్కానర్స్‌తో పోలిస్తే ఈ స్కానర్ మరింత ఖచ్చితత్వంతో స్పందించగలుగుతంది. ఇదే సమయంలో ఫ్యూచరిస్టిక్ ఫిల్‌ను కూడా ఈ టెక్నాలజీ చేరువ చేస్తోంది. V11 Pro రూపకల్పనలో భాగంగా విజబుల్ ఫింగర్ ప్రింట్ ప్యాడ్‌కు స్వస్తి పలికిన వివో దాని స్థానంలో హై-ఎండ్ ఫింగర్ ప్రింట్ స్కానర్ వ్యవస్థను అందుబాటులోకి తీసుకువచ్చింది.

25 మెగా పిక్సల్ సూపర్-హై-రిసల్యూషన్ కెమెరా
 

25 మెగా పిక్సల్ సూపర్-హై-రిసల్యూషన్ కెమెరా

సెల్ఫీ ప్రియులను ఉద్దేశించి వివో తన V11 Pro డివైస్‌లో శక్తివంతమైన 25 మెగా పిక్సల్ సూపర్-హై-రిసల్యూషన్ కెమెరాను ఏర్పాటు చేసింది. ఈ కెమెరాలో లోడ్ చేసిన ఆర్టిఫీషియల్ ఇంటెలిజెన్స్ ఫేస్ షేపర్ టెక్నాలజీ సుపీరియర్ ఫోటో క్వాలిటీతో సహజసిద్థమైన క్లియర్ సెల్ఫీలను ప్రొవైడ్ చేస్తుంది.

 12 మెగా పిక్సల్ + 5 మెగా పిక్సల్ డ్యుయల్ రేర్ కెమెరా

12 మెగా పిక్సల్ + 5 మెగా పిక్సల్ డ్యుయల్ రేర్ కెమెరా

Vivo V11 Proలో ఎక్విప్ చేసిన 12 మెగా పిక్సల్ + 5 మెగా పిక్సల్ డ్యుయల్ రేర్ కెమెరా సెటప్ హైక్వాలిటీ ఫోటోగ్రఫీని ప్రొడ్యూస్ చేస్తుంది. ముఖ్యంగా నైట్ ఫోటోగ్రఫీకి ఈ కెమెరా బాగా ఉపయోగపడుతుంది. ప్రైమరీ కెమెరాలో ఎక్విప్ చేసిన f/1.8 అపెర్చుర్ ఇంకా 1.28μm పిక్సల్స్ ఫోటోసెన్సిటివిటీని మరింత యాంప్లిఫై చేస్తాయి.

ఆర్టిఫీషియల్ ఇంటెలిజెన్స్ గేమ్ మోడ్..

ఆర్టిఫీషియల్ ఇంటెలిజెన్స్ గేమ్ మోడ్..

Vivo V11 Pro స్మార్ట్‌ఫోన్‌కు ఏఐ గేమ్ మోడ్ మరో ప్రధానమైన హైలైట్‌గా నిలుస్తుంది. గేమ్ ఆడుతున్నపుడు ఈ మోడ్‌ను ఎనేబుల్ చేసుకున్నట్లయితే అంతరాయంలేని గేమింగ్‌ను యూజర్ ఆస్వాదించవచ్చు. ఇదే సమయంలో గేమ్ అసిస్ట్, గేమ్ పిక్షర్ ఇన్ పిక్షర్ వంటి ఫీచర్స్ ద్వారా గేమ్ ఆడుతూనే చాట్ చేసుకునే వీలుంటుంది.

జోవి అసిస్టెంట్

జోవి అసిస్టెంట్

వివో తన V11 Pro డివైస్ ద్వారా జోవి ఏఐ అసిస్టెంట్ వంటి విప్లవాత్మక టూల్‌ను ప్రపంచానికి పరిచయం చేసింది. యూజర్ ఎక్స్‌పీరియన్స్‌ను మరింతగా మెరుగుపరిచేందుకు ఈ టూల్ సహాయ పడుతుంది.

Best Mobiles in India

English summary
Vivo V11 Pro successor to feature pop-up selfie camera; confirmed to launch on February 20 in India.To Know More About Visit telugu.gizbot.com

ఉత్తమ ఫోన్లు

న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X
X