Home
Mobile

హైఎండ్ డ్యూయల్ ఫిక్సల్ కెమెరాలతో vivo v11 pro

స్మార్ట్‌ఫోన్ మార్కెట్లో 2018 సంవత్సరం అనేక సంచలనాలకు కేంద్రబిందువుగా మారింది.

By Anil

స్మార్ట్‌ఫోన్ మార్కెట్లో 2018 సంవత్సరం అనేక సంచలనాలకు కేంద్రబిందువుగా మారింది. ఈ ఏడాది టాప్ కంపెనీల బెజిల్ లెస్ స్మార్ట్ ఫోన్లు ఎడ్జ్ టూ ఎడ్జ్ డిస్ ప్లేతో పాటు ఆకట్టుకునే స్క్రీన్ బాడీ రేషియోతో మొబైల్ మార్కెట్లోకి దూసుకువచ్చాయి. యూజర్ల చేతిలో ఫోన్ ఇట్టే ఇమిడిపోయిన ఈ ఫోన్లు వినియోగదారులకు అదిరిపోయే మల్టీ మీడియా అనుభవాన్ని అందిస్తున్నాయి. అన్ని కంపెనీలు వినియోగదారులను ఆకట్టుకునేందుకు సరికొత్త ఫీచర్లతో మార్కెట్లోకి స్మార్ట్‌ఫోన్లను దూసుకొస్తున్న నేపథ్యంలో వివో కంపెనీ కూడా యూజర్లకి అద్భుతమైన అనుభూతిని అందించేందుకు కొత్త స్మార్ట్ ఫోన్లతో రంగంలోకి దిగుతోంది. ఇందులో భాగంగానే కంపెనీ Vivo 11 pro ని లాంచ్ చేయబోతుంది .వచ్చే నెల సెప్టెంబర్ 6న Vivo 11 pro ఇండియా మార్కెట్లోకి లాంచ్ కాబోతుంది .ఈ Vivo V11 Pro డ్యూయల్-ఇంజిన్ ఫాస్ట్ చార్జింగ్ ను కలిగి ఉంటుంది . అలాగే ఈ ఫోన్ లో In display fingerprint scanning technology ప్రధాన ఆకర్షణగా నిలవనుంది . కెమెరా విషయానికి వస్తే 2pd అనే సరికొత్త టెక్నాలజీ ని ఈ Vivo 11 proలో ప్రవేశపెట్టబోతున్నారు అది యూజర్లను అమితంగా అలరించనుంది .

సెప్టెంబర్ 6వ తేదీన ....

సెప్టెంబర్ 6వ తేదీన ....

ఈ ఫోన్ ను వచ్చే నెల సెప్టెంబర్ 6వ తేదీన భారత్‌లో విడుదల చేయనుంది.అయితే ఈ ఫోన్ ధర సుమారు రూ.25వేలు నుంచి రూ.30వేలలో ఉండవచ్చు అని పుకార్లు వినిపిస్తున్నాయి .

ఫీచర్లు ....

ఫీచర్లు ....

6.4 ఇంచ్ ఫుల్ హెచ్‌డీ ప్లస్ సూపర్ అమోలెడ్ డిస్‌ప్లే, గొరిల్లా గ్లాస్ ప్రొటెక్షన్, 2340 x 1080 పిక్సల్స్ స్క్రీన్ రిజల్యూషన్, ఆక్టాకోర్ స్నాప్ డ్రాగన్ 660 ప్రాసెసర్, 6 జీబీ ర్యామ్, 128 జీబీ స్టోరేజ్, 256 జీబీ ఎక్స్‌పాండబుల్ స్టోరేజ్, హైబ్రిడ్ డ్యుయల్ సిమ్, ఆండ్రాయిడ్ 8.1 ఓరియో, 12, 5 మెగాపిక్సల్ డ్యుయల్ బ్యాక్ కెమెరాలు, 25 మెగాపిక్సల్ సెల్ఫీ కెమెరా, ఇన్ డిస్‌ప్లే ఫింగర్‌ప్రింట్ సెన్సార్, 4జీ వీవోఎల్‌టీఈ, డ్యుయల్ బ్యాండ్ వైఫై, బ్లూటూత్ 5.0, 3400 ఎంఏహెచ్ బ్యాటరీ,ఫాస్ట్ చార్జింగ్.

డ్యూయెల్ రేర్ కెమెరా.....

డ్యూయెల్ రేర్ కెమెరా.....

Vivo 11 pro డ్యూయెల్ రేర్ కెమెరాతో రాబోతుంది .2PD కెమెరా అనే సరికొత్త టెక్నాలజీని ఈ Vivo 11 Pro లో ప్రవేశపెట్టబోతున్నారు . 12MP+5MP rear cameraతో అదిరిపోయే ఫోటోలను షూట్ చేయవచ్చు. అంతే కాకుండా సెట్టింగ్స్ అడ్జెటమెంట్లో కొన్ని మార్పులను తీసుకువచ్చింది. షార్ప్ నెస్, బ్రైట్ నెస్ విభాగంలో ఈ ఫోన్ ఇతర ఫోన్లకు ధీటుగా తయారు చేయబడింది.

25 మెగా పిక్సెల్ సెల్ఫీ కెమెరా....

25 మెగా పిక్సెల్ సెల్ఫీ కెమెరా....

సెల్ఫీ కెమెరాలతో మార్కెట్లో టాప్ కంపెనీల ఫోన్లు హల్‌చల్ చేస్తున్న నేపథ్యంలో వివో కంపెనీ కూడా ఈ ఫీచర్ మీద కొంచెం ఎక్కువగానే శ్రద్ధపెట్టింది. Vivo 11 pro 25 మెగా పిక్సెల్ సెల్పీ కెమెరాలో అధునాతన ఫీచర్లను ప్రవేశపెట్టింది. వీడియోలు, సెల్ఫీ షూట్లు ఆకర్షణీయంగా, అందంగా తీర్చిదిద్దుకునే విధంగా దీన్ని మార్కెట్లోకి తీసుకోరాబోతున్నారు.

In-display Fingerprint Scanner....

In-display Fingerprint Scanner....

వివో తీసుకువచ్చిన ఫోన్లో in display fingerprint scanning technology ప్రధాన ఆకర్షణ నిలవనుంది. ఈ ఫీచర్ యూజర్లను అమితంగా ఆకట్టుకుంటోంది. ఈ ఫీచర్ ద్వారీ మీరు ఫోన్ అన్ లాక్ అలాగే ఫోటోలు లాంటి వాటిని చాలా తేలిగ్గా తీసుకునే అవకాశం ఉంది.

హార్డ్‌వేర్, సాఫ్ట్‌వేర్....

హార్డ్‌వేర్, సాఫ్ట్‌వేర్....

Snapdragon 660 CPUతో పాటు 6జిబి ర్యామ్ 128జిబి ఇంటర్నల్ స్టోరేజ్ తో ఈ ఫోన్ రాబోతుంది . ఆండ్రాయిడ్ ఓరియతో పాటు లేటెస్ట్ అప్ డేట్ తో ఈ ఫోన్ యూజర్లను అలరించనుంది.

Best Mobiles in India

English summary
Vivo V11 Pro with the high-end Dual-Pixel Camera will be a Delight to Shutterbugs.To Know More About Visit telugu.gizbot.com
Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
X