సెల్ఫీ లవర్స్‌కు గుడ్ న్యూస్ మార్కెట్లోకి వివో కొత్త ఫోన్లు వచ్చేస్తున్నాయి
స్మార్ట్‌ఫోన్ మార్కెట్లో ఈ ఏడాది అనేక సంచలనాలకు కేంద్రబిందువుగా మారబోతుంది.
స్మార్ట్‌ఫోన్ మార్కెట్లో ఈ ఏడాది అనేక సంచలనాలకు కేంద్రబిందువుగా మారబోతుంది.అన్ని కంపెనీలు వినియోగదారులను ఆకట్టుకునేందుకు సరికొత్త ఫీచర్లతో మార్కెట్లోకి స్మార్ట్‌ఫోన్లను దూసుకొస్తున్న నేపథ్యంలో వివో కంపెనీ కూడా యూజర్లకి అద్భుతమైన అనుభూతిని అందించేందుకు కొత్త స్మార్ట్ ఫోన్లతో రంగంలోకి దిగుతోంది. ఇందులో భాగంగానే కంపెనీ Vivo 15,Vivo 15 pro ని లాంచ్ చేయబోతుంది. ఈ నెల 20న ఇండియా మార్కెట్లో ఈ ఫోన్లు రాబోతున్నాయి .అయితే ముక్యంగా చెప్పుకోవాల్సింది Vivo 15 pro కెమెరా గురించి ఎందుకంటే వివో మొదటి సారి 32 మెగాపిక్సల్ సెల్ఫీ కెమెరా అలాగే 48 మెగా పిక్సెల్ బ్యాక్ కెమెరాతో ఫోన్ ను లాంచ్ చేయబోతుంది ఇది యూజర్లను అమితంగా అలరించనుంది.అయితే ఇప్పటికే మార్కెట్లోకి షియోమీ మరియు హానర్ 48 మెగా పిక్సెల్ కెమెరా స్మార్ట్ ఫోన్లను లాంచ్ చేసాయి అయితే ఫ్రంట్ కెమెరాతో పోలిస్తే వివో Vivo 15 pro 32 మెగాపిక్సల్ పాప్ అప్ కెమెరాతో హై లైట్ గా ఉండబోతుంది.

Vivo 15 pro
ధర: సుమారు రూ.33,000 ఉండవచ్చు
ఫీచర్లు(అంచనా)
6.3 అంగుళాల సూపర్ అమొలెడ్ ఫుల్‌వ్యూ డిస్‌ప్లే, 6 జీబీ ర్యామ్ ,128 జీబీ ఇంటర్నల్ స్టోరేజ్, స్నాప్‌డ్రాగన్ 675 ప్రాసెసర్, 48+8+5 మెగాపిక్సెల్ రియర్ కెమెరా , 32 మెగాపిక్సెల్ ఫ్రంట్ కెమెరా , ఆండ్రాయిడ్ 9.0 పై, డ్యుయల్ సిమ్,డ్యుయల్ 4జీ వీవోఎల్‌టీఈ, డ్యుయల్ బ్యాండ్ వైఫై, బ్లూటూత్ 5.0 ఎల్ఈ, ఎన్ఎఫ్‌సీ, 3,700 ఎంఏహెచ్ బ్యాటరీ,ఫాస్ట్ చార్జింగ్.

48 మెగా పిక్సెల్ తో మార్కెట్లోకి వచ్చిన ఫోన్ల ఫీచర్లు ఈ విధంగా ఉన్నాయి
Honor V20 ఫీచర్లు...
6.4 ఇంచ్ ఫుల్ హెచ్‌డీ ప్లస్ ఎల్‌సీడీ ఐపీఎస్ డిస్‌ప్లే, 1080 x 2310 పిక్సల్స్ స్క్రీన్ రిజల్యూషన్, హువావే కైరిన్ 980 ఆక్టాకోర్ ప్రాసెసర్, 6/8 జీబీ ర్యామ్, 128/256 జీబీ స్టోరేజ్, ఆండ్రాయిడ్ 9.0 పై, డ్యుయల్ సిమ్, 48 మెగాపిక్సల్ బ్యాక్ కెమెరా, 25 మెగాపిక్సల్ సెల్ఫీ కెమెరా, డ్యుయల్ 4జీ వీవోఎల్‌టీఈ, డ్యుయల్ బ్యాండ్ వైఫై, బ్లూటూత్ 5.0 ఎల్ఈ, ఎన్ఎఫ్‌సీ, యూఎస్‌బీ టైప్ సి, 4000 ఎంఏహెచ్ బ్యాటరీ, ఫాస్ట్ చార్జింగ్.

Redmi Note 7 ఫీచర్లు...
6.3 ఇంచ్ ఫుల్ హెచ్‌డీ ప్లస్ డిస్‌ప్లే, 2340 ×1080 పిక్సల్స్ స్క్రీన్ రిజల్యూషన్, గొరిల్లా గ్లాస్ ప్రొటెక్షన్, ఆక్టాకోర్ స్నాప్‌డ్రాగన్ 660 ప్రాసెసర్, 3/4/6 జీబీ ర్యామ్, 32/64 జీబీ స్టోరేజ్, 256 జీబీ ఎక్స్‌పాండబుల్ స్టోరేజ్, ఆండ్రాయిడ్ 9.0 పై, హైబ్రిడ్ డ్యుయల్ సిమ్, 48, 5 మెగాపిక్సల్ డ్యుయల్ బ్యాక్ కెమెరాలు, 13 మెగాపిక్సల్ సెల్ఫీ కెమెరా, ఫింగర్ ప్రింట్ సెన్సార్, ఐఆర్ సెన్సార్, డ్యుయల్ 4జీ వీవోఎల్‌టీఈ, బ్లూటూత్ 5.0, డ్యుయల్ బ్యాండ్ వైఫై, యూఎస్‌బీ టైప్ సి, 4000 ఎంఏహెచ్ బ్యాటరీ, క్విక్ చార్జ్ 4.0.


Click it and Unblock the Notifications








