రూ.10499 ధరకే మిలిటరీ గ్రేడ్ ప్రొటెక్షన్, 5500mAh బ్యాటరీ 5G స్మార్ట్‌ఫోన్.. ఫ్లిప్‌కార్ట్‌లో సేల్ !
Vivo V19 5G Smartphone : ప్రముఖ స్మార్ట్‌ఫోన్ ల తయారీ సంస్థ వివో ఈ సంవత్సరం అనేక మోడల్స్ ను లాంచ్ చేసింది. ఎంట్రీ లెవల్, బడ్జెట్, మిడ్ రేంజ్ ధర సెగ్మెంట్స్ లో ఫోన్‌లను లాంచ్ చేసింది. ఈ సంవత్సరం మే నెలలో వివో V19 5G ఫోన్ విడుదల అయింది. ప్రస్తుతం ఈ సెగ్మెంట్ లో ఆకట్టుకొనే డిజైన్ సహా అనేక మెరుగైన స్పెసిఫికేషన్‌లు, ఫీచర్ లను కలిగి ఉంది. ఎంట్రీ లెవల్ ధరలోనే కొనుగోలు చేయవచ్చు.
ఈ కార్డులపై 5 శాతం క్యాష్‌బ్యాక్ :
వివో Y19 5G స్మార్ట్‌ఫోన్ ప్రస్తుతం ఫ్లిప్‌కార్ట్‌లో 4GB ర్యామ్ + 64GB స్టోరేజీ రూ.10,499, 4GB ర్యామ్ + 128GB స్టోరేజీ ధర రూ.11,499, 6GB ర్యామ్ + 128GB స్టోరేజీ ధర రూ.12,999 గా ఉంది. ఫ్లిప్‌కార్ట్ యాక్సెస్ బ్యాంకు క్రెడిట్ కార్డు, ఫ్లిప్‌కార్ట్ SBI క్రెడిట్ కార్డుల ద్వారా 5 శాతం క్యాష్‌బ్యాక్ ను పొందవచ్చు.

క్రిస్టల్ టెక్చర్ :
వివో Y19 5G స్మార్ట్‌ఫోన్ 8.19mm థిక్‌నెస్ తో ఆకట్టుకొనే డిజైన్‌ను కలిగి ఉంది. ఈ ఫోన్ క్రిస్టల్ టెక్చర్ తో కూడిన మెటాలిక్ మ్యాటీ ఫ్రేమ్ తో అందుబాటులో ఉంది. మిలిటరీ గ్రేడ్ షాక్ రెసిస్టెన్స్ ప్రొటెక్షన్ ను కూడా పొందుతోంది. టైటానియం సిల్వర్, మెజిస్టిక్ గ్రీన్ కలర్ వేరియంట్స్ లో లభిస్తుంది.
HD+ డిస్‌ప్లే :
ఈ హ్యాండ్‌సెట్ 6.74 అంగుళాల HD+ LCD డిస్‌ప్లేతో అందుబాటులో ఉంది. 90Hz రీఫ్రెష్ రేట్ ను కలిగి ఉంది. TUV Rheinland సర్టిఫికేషన్ ను కలిగి ఉంది. ఫలితంగా ఎక్కువ సమయం వినియోగించినా కళ్లకు హాని లేకుండా రక్షణ కల్పిస్తుంది.
5500mAh బ్యాటరీ :
ఈ వివో స్మార్ట్‌ఫోన్ మీడియాటెక్ డైమెన్సిటీ 6300 చిప్‌సెట్ తో పనిచేస్తోంది. ఈ చిప్‌సెట్ 6GB ర్యామ్, 128GB స్టోరేజీతో జతచేసి ఉంటుంది. ఈ ఫోన్ ఆండ్రాయిడ్ 15 ఆధారిత Funtouch OS 15 పైన పనిచేస్తోంది. ఈ హ్యాండ్‌సెట్ 15W ఛార్జింగ్ సపోర్టుతో 5500mAh బ్యాటరీతో పనిచేస్తోంది.
AI ఫీచర్లు :
కెమెరా విభాగం పరంగా వెనుక వైపు 13MP కెమెరాతోపాటు 0.08MP కెమెరాను కలిగి ఉంది. సెల్ఫీ, వీడియో కాల్స్ కోసం 5MP కెమెరాను అమర్చి ఉంది. ఈ ఫోన్ కెమెరాలు ప్రో, నైట్ మోడ్, పొర్ట్రెయిట్ మోడ్ ను కలిగి ఉన్నాయి. మరియు AI Photo Enhance, AI Erase, AI Document వంటి ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ ఆధారిత ఫీచర్లున్నాయి.
ఈ హ్యాండ్‌సెట్ IP64 రేటింగ్ తో డస్ట్ మరియు వాటర్ రెసిస్టెంట్ గా ఉంది. 5G, 4G, USB-C ఛార్జింగ్ పోర్టును కలిగి ఉంది. ఛార్జింగ్ పరంగానూ స్మార్ట్ ఛార్జింగ్ ఇంజిన్ 2.0 ఫీచర్‌ను కలిగి ఉంది. ఈ ఫోన్ SGS 5 స్టార్ డ్రాప్ రెసిస్టెన్స్ సర్టిఫికేషన్ లను కలిగి ఉంది.


Click it and Unblock the Notifications