ధర రూ.7,999 కే 5500mAh బ్యాటరీ, 6.74 అంగుళాల HD+ డిస్‌ప్లే, IP64 రేటింగ్ కలిగిన ఫోన్..!
వివో నుంచి ఇటీవల V50, T4x 5G స్మార్ట్‌ఫోన్ లు లాంచ్ అయ్యాయి. V50 మోడల్ మిడ్ రేంజ్ ధరలో అందుబాటులోకి వచ్చింది అదే వివో T4x 5G స్మార్ట్‌ఫోన్ బడ్జెట్ రేంజ్‌లో విడుదల అయింది. త్వరలో V50e స్మార్ట్‌ఫోన్ లాంచ్ కానుందని లీక్స్ వస్తున్నాయి. అయితే తాజాగా ఎంట్రీ లెవల్ ధరలో వివో కొత్త ఫోన్‌ను లాంచ్ చేసింది. వివో V19e హ్యాండ్‌సెట్ (Vivo V19e Smartphone) భారత్ మార్కెట్ లో తాజాగా విడుదల అయింది.
వివో V19e స్మార్ట్‌ఫోన్ స్పెసిఫికేషన్‌లు, ఫీచర్‌లు :
ఈ హ్యాండ్‌సెట్ 6.74 అంగుళాల HD+ LCD డిస్‌ప్లేతో లాంచ్ అయింది. ఈ డిస్‌ప్లే 720*1600 పిక్సల్స్ రిజల్యూషన్ ను కలిగి ఉంది. ఎక్కువ సమయం వినియోగించినా కళ్లకు హానికలగ కుండా ఉండేలా TUV లో బ్లూలైట్ టెక్నాలజీ ఫీచర్ ను కలిగి ఉంది. ఎక్కువ రోజులపాటు మన్నిక వచ్చేలా SGS, మిలిటరీ గ్రేడ్ సర్టిఫికేషన్ లను కలిగి ఉంది.

చిప్‌సెట్, OS వివరాలు :
ఈ వివో ఎంట్రీ లెవర్ సెగ్మెంట్ స్మార్ట్‌ఫోన్ ఆక్టాకోర్ Unisoc T7225 చిప్‌సెట్ తో పనిచేస్తుంది. ఈ చిప్‌సెట్ 4GB ర్యామ్, 64GB స్టోరేజీతో జతచేసి ఉంటుంది. మరియు ఈ ఫోన్ ఆండ్రాయిడ్ 14 ఆధారిత Funtouch OS 14 పైన పనిచేస్తుంది.
కెమెరా వివరాలు :
కెమెరా విభాగం పరంగా ఈ హ్యాండ్‌సెట్ AI డ్యూయల్ కెమెరాలను కలిగి ఉంది. f/2.2 అపేచర్ తో 13MP కెమెరా, f/3.0 అపేచర్‌తో 0.08 సెకండరీ కెమెరాను కలిగి ఉంది. సెల్ఫీ, వీడియో కాల్స్ కోసం f/2.2 అపేచర్‌తో 5MP సెల్ఫీ కెమెరాను అమర్చారు.

భారీ బ్యాటరీ :
ఈ ఫోన్ అనేక ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ (AI) ఫీచర్‌లను సపోర్టు చేస్తుంది. AI Photo Enhance, AI Erase, AI డాక్యుమెంట్ వంటి ఫీచర్‌లను కలిగి ఉంది. 15W ఫాస్ట్ ఛార్జింగ్ సపోర్టుతో 5500mAh బ్యాటరీతో పనిచేస్తుంది. ఒక్కసారి పూర్తిగా ఛార్జింగ్ చేసి 19 గంటల వరకు యూట్యూబ్ ప్లే టైమ్‌ను పొందవచ్చని వివో తెలిపింది.
కనెక్టివిటీ పరంగా ఈ వివో స్మార్ట్‌ఫోన్ బ్లూటూత్ 5.2, వైఫై, GPS, OTG, FM రేడియో, BeiDou, Glonass, Galileo వంటి ఫీచర్‌ను కలిగి ఉంది. వీటితోపాటు ప్రాక్సిమిటీ సెన్సార్, ఇ-కాంపాస్, యాక్సెలిరోమీటర్, యాంబియంట్ లైట్ సెన్సార్ లను అమర్చారు.
IP64 రేటింగ్ :
ఈ ఫోన్ భద్రత కోసం సైడ్ మౌంటెడ్ ఫింగర్ ప్రింట్ సెన్సార్ ను అమర్చారు. మరియు IP64 రేటింగ్ తో మెరుగైన డస్ట్ మరియు వాటర్ రెసిస్టెంట్‌గా అందుబాటులోకి వచ్చింది. ఎంట్రీ లెవల్ ధరలో మెరుగైన ఫోన్ కోసం చూస్తున్న వారికీ ఆ ఫోన్ మంచి ఆప్షన్ అయ్యే అవకాశం ఉంది.
వివో V19e స్మార్ట్‌ఫోన్ ధర, సేల్ వివరాలు :
వివో V19e స్మార్ట్‌ఫోన్ 4GB ర్యామ్ + 64GB స్టోరేజీ వేరియంట్ ధర రూ.7999 గా ఉంది. ఈ హ్యాండ్‌సెట్ టైటానియం సిల్వర్, మెజిస్టిక్ గ్రీన్ రంగుల్లో లభిస్తుంది. ఈ ఫోన్ ప్రస్తుతం వివో ఇండియా ఇ-స్టార్, ఫ్లి్ప్‌కార్ట్ సహా ఇతర రిటైల్ స్టోర్ ల ద్వారా కొనుగోలు చేయవచ్చు.


Click it and Unblock the Notifications








