Home
Mobile

Vivo V20SE స్మార్ట్‌ఫోన్ కొత్త వేరియంట్ లాంచ్!!! ఫీచర్స్ అదుర్స్

ప్రముఖ స్మార్ట్‌ఫోన్ తయారీ సంస్థ వివో ఇటీవల ఇండియాలో వివో V20 SEను విడుదల చేసింది. ఇప్పుడు ఈ ఫోన్ యొక్క కొత్త వేరియంట్ ఆక్వామారిన్ గ్రీన్ కలర్ ను విడుదల చేసింది. ఆక్టా-కోర్ క్వాల్కమ్ స్నాప్‌డ్రాగన్ 665 SoC మరియు 32 మెగాపిక్సెల్ ఫ్రంట్ కెమెరా వంటి ఫీచర్లను కలిగిన ఈ ఫోన్ యొక్క ఆక్వామారిన్ గ్రీన్ కలర్ వేరియంట్ ఈ రోజు నుండి వివో ఇండియా యొక్క ఇ-స్టోర్, ఇ-కామర్స్ వెబ్‌సైట్లు మరియు దేశవ్యాప్తంగా రిటైల్ దుకాణాల్లో కొనుగోలు చేయడానికి అందుబాటులో ఉంటుంది. ఈ ఫోన్ ఇప్పటికే గ్రావిటీ బ్లాక్ కలర్ వేరియంట్లో లభిస్తుంది. దీని గురించి మరిన్ని వివరాలు తెలుసుకోవడానికి ముందుకు చదవండి.

వివో V20SE స్మార్ట్‌ఫోన్ ధరల వివరాలు

వివో V20SE స్మార్ట్‌ఫోన్ ధరల వివరాలు

వివో V20SE స్మార్ట్‌ఫోన్ యొక్క ఆక్వామారిన్ గ్రీన్ వేరియంట్ 8GB ర్యామ్ + 128GB స్టోరేజ్ మోడల్‌ యొక్క ధర 20,999 రూపాయలు. ఇది వివో ఇండియా ఇ-స్టోర్‌తో పాటు అమెజాన్, ఫ్లిప్‌కార్ట్ వంటి ఇ-కామర్స్ ప్లాట్‌ఫామ్‌ల ద్వారాకూడా కొనుగోలు చేయడానికి అందుబాటులో ఉంది. దీని కొనుగోలు మీద ఐసిఐసిఐ బ్యాంక్‌ యొక్క EMI లావాదేవీలపై  10 శాతం క్యాష్‌బ్యాక్, కోటక్ మహీంద్రా బ్యాంక్‌ కార్డుల మీద 10 శాతం క్యాష్‌బ్యాక్ లభిస్తుంది.

వివో V20SE 48MP కెమెరా ఫీచర్స్

వివో V20SE 48MP కెమెరా ఫీచర్స్

వివో V20SE స్మార్ట్‌ఫోన్ యొక్క కెమెరా స్పెసిఫికేషన్స్ విషయానికి వస్తే ఫోటోలు మరియు వీడియోల కోసం ఫోన్ వెనుక భాగంలో ట్రిపుల్ రియర్ కెమెరా సెటప్ ను కలిగి ఉంటుంది. ఇందులో f/1.8 లెన్స్‌తో 48 మెగాపిక్సెల్ ప్రైమరీ సెన్సార్ కెమెరా, f/ 2.2 వైడ్ యాంగిల్ లెన్స్‌తో 8 మెగాపిక్సెల్ సెకండరీ సెన్సార్ కెమెరా మరియు 2 బోకే ప్రభావం కోసం ఎఫ్ / 2.4 లెన్స్‌తో 2-మెగాపిక్సెల్ సెన్సార్ కెమెరాలతో ప్యాక్ చేయబడి ఉంటుంది. సెల్ఫీలు మరియు వీడియో కాల్‌ల కోసం ముందుభాగంలో ఎఫ్ / 2.0 లెన్స్‌తో 32 మెగాపిక్సెల్ సెన్సార్‌తో సెల్ఫీ కెమెరాను కలిగి ఉంటుంది.

వివో V20SE అమోలేడ్ డిస్‌ప్లే స్పెసిఫికేషన్స్

వివో V20SE అమోలేడ్ డిస్‌ప్లే స్పెసిఫికేషన్స్

వివో V20SE స్మార్ట్‌ఫోన్ లో డ్యూయల్ సిమ్ (నానో) స్లాట్ కలిగి ఉంటుంది. ఇది ఆండ్రాయిడ్ 10 పైన ఫంటౌచ్ OS11 ద్వారా రన్ అవుతుంది. ఇది 6.44-అంగుళాల ఫుల్- HD+ అమోలేడ్ డిస్‌ప్లేను 1,080x2,400 పిక్సెల్స్ పరిమాణంలో మరియు 20:9 కారక నిష్పత్తితో కలిగి ఉంది. ఇది ఆక్టా-కోర్ క్వాల్కమ్ స్నాప్‌డ్రాగన్ 665 SoC చిప్ సెట్ ను కలిగి ఉండి 8GB ర్యామ్‌తో జతచేయబడి ఉంటుంది.

వివో V20SE 33W ఫ్లాష్ ఛార్జ్ ఫీచర్స్

వివో V20SE 33W ఫ్లాష్ ఛార్జ్ ఫీచర్స్

వివో V20SE స్మార్ట్‌ఫోన్ కేవలం 128GB ఒకే ఒక స్టోరేజ్ వేరియంట్ తో వస్తుంది. మైక్రో SD కార్డ్ స్లాట్ ద్వారా మెమొరీని 1TB వరకు విస్తరించడానికి అనుమతిని ఇస్తుంది. ఫోన్ యొక్క కనెక్టివిటీ ఎంపికలలో 4G ఎల్‌టిఇ, వై-ఫై, బ్లూటూత్ 5.0, జిపిఎస్ / ఎ-జిపిఎస్, FM రేడియో మరియు ఛార్జింగ్ కోసం యుఎస్‌బి టైప్-సి పోర్ట్ వంటివి ఉన్నాయి. అలాగే ఇది 4,100mAh పెద్ద బ్యాటరీని 33W ఫ్లాష్ ఛార్జ్  ఛార్జింగ్ మద్దతుతో అందిస్తుంది. బోర్డులోని సెన్సార్లలో యాక్సిలెరోమీటర్, యాంబియంట్ లైట్ సెన్సార్, మాగ్నెటోమీటర్ మరియు సామీప్య సెన్సార్ వంటివి ఉన్నాయి. అలాగే ఇది ఇన్-డిస్ప్లే ఫింగర్ ప్రింట్ సెన్సార్ ను కూడా కలిగి ఉంది. చివరగా ఈ ఫోన్ 161x74.08x7.83mm కొలతల పరిమాణంలో 171 గ్రాముల బరువును కలిగి ఉంటుంది.

Best Mobiles in India

English summary
Vivo V20 SE Aquamarine Green Colour Variant Released in India
Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
X