Vivo V25 క‌ల‌ర్ మారే స్మార్ట్‌ఫోన్‌.. ఇండియా లాంచ్ తేదీ ఖరారైంది!

|

చైనాకు చెందిన ప్ర‌ముఖ మొబైల్ ఉత్ప‌త్తుల త‌యారీ సంస్థ Vivo, త్వ‌ర‌లోనే Vivo V25 5G మొబైల్‌ను భారతదేశంలో విడుద‌ల చేయ‌నుంది. సెప్టెంబరు 15న మధ్యాహ్నం 12 గంటలకు (మధ్యాహ్నం) IST Vivo V25 5G మొబైల్‌ను భార‌త మార్కెట్లో లాంచ్ చేయ‌నున్న‌ట్లు కంపెనీ వెల్ల‌డించింది. ఇటీవల, Flipkartలో ఈ ఫోన్ కు సంబంధించిన మైక్రోసైట్ కొన్ని స్పెసిఫికేషన్‌లతో పాటు దేశంలో హ్యాండ్‌సెట్‌ను లాంచ్ విష‌యాన్ని ధృవీకరించింది. Vivo V25 5G మొబైల్‌కు ఆటోఫోకస్‌తో 50-మెగాపిక్సెల్ సెల్ఫీ కెమెరాను అందిస్తున్న‌ట్లు నిర్ధారించబడింది. అంతేకాకుండా, ఇది బోకె ఫ్లేర్ పోర్ట్రెయిట్ కెమెరా మోడ్‌ను కూడా పొందుతుంది. మైక్రోసైట్ ప్రకారం, ఇది 8GB RAM మరియు 8GB 'ఎక్స్‌టెండెడ్ ర్యామ్' ఫీచర్‌ను కలిగి ఉంటుంది.

Vivo

లాంచ్ ఎప్పుడంటే!
Vivo V25 5G భారతదేశంలో సెప్టెంబర్ 15 మధ్యాహ్నం 12 గంటలకు (మధ్యాహ్నం) IST లాంచ్ అవుతుందని Dongguan ఆధారిత స్మార్ట్‌ఫోన్ బ్రాండ్ ట్విట్టర్ ద్వారా ప్రకటించింది. ఈ మొబైల్ ఎల్‌ఈడీ ఫ్లాష్‌తో ట్రిపుల్ రియర్ కెమెరా సెటప్‌ను కలిగి ఉంటుందని సూచించే టీజర్ వీడియోను కూడా సంస్థ షేర్ చేసింది. ఇది 5G నెట్‌వర్క్ కనెక్టివిటీని కూడా కలిగి ఉంటుంది. Vivo V25 5G యొక్క భారతదేశ ధర మరియు స్టోరేజీ కాన్ఫిగరేషన్‌లను కంపెనీ ఇంకా వెల్లడించలేదు. ఇది విడుద‌లైన త‌ర్వాత భారతదేశంలో ఫ్లిప్‌కార్ట్ ద్వారా కొనుగోలు చేయడానికి అందుబాటులో ఉంటుంది.

Vivo

Vivo V25 5G కోసం ఫ్లిప్‌కార్ట్‌లోని మైక్రోసైట్ ఇటీవల ఫోన్ యొక్క కొన్ని స్పెసిఫికేషన్‌లను వెల్ల‌డించింది. ఇది ఐ ఆటో ఫోకస్ ఫీచ‌ర్‌తో ముందు భాగంలో 50-మెగాపిక్సెల్ సెల్ఫీ కెమెరాను కలిగి ఉన్నట్లు నిర్ధారించబడింది. అంతేకాకుండా, ఇది డిస్‌ప్లేపై కేంద్రీకృత హోల్‌-పంచ్ కటౌట్ లో ప్లేస్ చేయ‌బ‌డిన‌ట్లు స‌మాచారం. కంపెనీ వెల్ల‌డించిన ప్రకారం, ఈ మొబైల్ బోకే ఫ్లేర్ పోర్ట్రెయిట్ కెమెరా మోడ్‌ను కూడా కలిగి ఉంటుంది.

ఫ్లిప్‌కార్ట్‌లోని మైక్రోసైట్ ప్రకారం, Vivo V25 5G యొక్క వెనుక ప్యానెల్ క‌ల‌ర్ ఛేంజింగ్ ఫ్లోరైట్ AG గ్లాస్ డిజైన్‌ను కలిగి ఉంటుంది. ఇది 8GB RAMని ప్యాక్ చేస్తుంది మరియు ఫోన్ 8GB 'ఎక్స్‌టెండెడ్ RAM' ఫీచర్‌ను కూడా పొందుతుంది. Vivo V25 5G USB టైప్-సి పోర్ట్, స్పీకర్ గ్రిల్, మైక్రోఫోన్ మరియు దిగువన SIM ట్రేని కలిగి ఉంటుందని మైక్రోసైట్ సూచిస్తుంది. Vivo V25 5G ఎడ‌మ‌వైపు వాల్యూమ్ రాకర్స్ మరియు కుడి వైపు పవర్ బటన్‌ను కలిగి ఉంటుంది. వనిల్లా Vivo V25 5G, Vivo V25 సిరీస్‌లో భాగం. ఇప్ప‌టికే ఈ సిరీస్‌ను Vivo V25 Pro మొబైల్ ఆగస్టులో భారతదేశంలో ప్రారంభించబడిన విష‌యం తెలిసిందే.

Vivo

Vivo V25 Pro స్పెసిఫికేషన్స్
Vivo V25 Pro స్మార్ట్‌ఫోన్ యొక్క స్పెసిఫికేషన్స్ విషయానికి వస్తే ఇది 5G నెట్‌వర్క్‌ మద్దతుతో డ్యూయల్ సిమ్ (నానో) నానో స్లాట్ ని కలిగి ఉంటుంది. ఇది ఫుల్-HD+ (2,376x1,080 పిక్సెల్‌లు) రిజల్యూషన్‌తో 6.56-అంగుళాల AMOLED డిస్‌ప్లేను కలిగి ఉంది. ఈ హ్యాండ్‌సెట్ Funtouch OS 12పై రన్ అవుతూ మీడియాటెక్ డైమెన్సిటీ 1300 SoCతో శక్తిని పొందుతూ 12GB వరకు RAMతో జతచేయబడి వస్తుంది.

Vivo V25 Pro స్మార్ట్‌ఫోన్ యొక్క ఆప్టిక్స్ విషయానికి వస్తే ఫోన్ వెనుక భాగంలో ట్రిపుల్ రియర్ కెమెరా సెటప్‌ను కలిగి ఉంటుంది. ఇందులో 64-మెగాపిక్సెల్ సెన్సార్ మెయిన్ కెమెరా f/1.89 ఎపర్చరు మరియు ఆప్టికల్ ఇమేజ్ స్టెబిలైజేషన్‌తో లభిస్తుంది. అలాగే f/2.2 ఎపర్చరుతో 8-మెగాపిక్సెల్ వైడ్-యాంగిల్ లెన్స్ మరియు f/2.4 ఎపర్చర్‌తో 2-మెగాపిక్సెల్ మాక్రో లెన్స్ కెమెరాలు కూడా ఉన్నాయి. సెల్ఫీలు మరియు వీడియో కాలింగ్ కోసం ముందు భాగంలో ఐ ఆటోఫోకస్ మరియు f/2.45 ఎపర్చర్‌తో 32-మెగాపిక్సెల్ సెల్ఫీ కెమెరాను కలిగి ఉంది.

Vivo V25 Pro స్మార్ట్‌ఫోన్ యొక్క కనెక్టివిటీ ఎంపికల విషయంలో స్మార్ట్‌ఫోన్‌లో డ్యూయల్-బ్యాండ్ Wi-Fi (2.4GHz మరియు 5GHz), బ్లూటూత్ v5.2, GPS మరియు USB టైప్-సి పోర్ట్ ఉన్నాయి.ఈ హ్యాండ్‌సెట్‌ను అన్‌లాక్ చేయడానికి ఫింగర్ ప్రింట్ స్కానర్‌ను కూడా కలిగి ఉంది. ఈ హ్యాండ్‌సెట్‌ 66W ఫాస్ట్ ఛార్జింగ్ సపోర్ట్‌తో 4,830mAh బ్యాటరీతో ప్యాక్ చేయబడి వస్తుంది. బాక్స్‌లో వివో ఛార్జింగ్ అడాప్టర్, USB టైప్-C కేబుల్, USB టైప్-C నుండి 3.5mm హెడ్‌ఫోన్ జాక్ అడాప్టర్ మరియు ఫోన్ కేస్‌ను చేర్చింది. ఈ ఫోన్ యొక్క ప్రత్యేకత ఏమిటంటే దీని వెనుక గ్లాస్ ప్యానెల్‌ కలర్ మారుతున్నట్లు ఉంటుంది. vivo v25 pro మొబైల్ 12జీబీ ర్యామ్ వేరియంట్ ప్ర‌స్తుతం ఫ్లిప్‌కార్ట్‌లో రూ.39,999 కు అందుబాటులో ఉంది.

Best Mobiles in India

English summary
Vivo V25 5G India Launch Set for September 15; Flipkart Availability Confirmed

ఉత్తమ ఫోన్లు

న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X
X