విరాట్ కోహ్లీ పోస్ట్ చేసిన Vivo V25 Pro లాంచ్ భార‌త్‌లో ఎప్పుడంటే!

|

భార‌త మార్కెట్లో Vivo V25 Pro లాంచ్‌కు రంగం సిద్ధ‌మైంది. భారతదేశంలో Vivo V25 ప్రో లాంచ్ ఆగష్టు 17 న లాంచ్ చేయ‌నున్న‌ట్లు కంపెనీ ధ్రువీక‌రించింది. ఈ స్మార్ట్‌ఫోన్ Vivo V25 సిరీస్‌లో భాగం.. కాగా ఇది రంగు రంగుల‌ బ్యాక్ ప్యానెల్‌తో వస్తోంది. ఈ సిరీస్‌లో Vivo V25 మరియు Vivo V25e స్మార్ట్‌ఫోన్‌లను కూడా కలిగి ఉంటుందని ఊహించబడింది. ఇప్ప‌టికే ఈ Vivo V25 ప్రో మొబైల్‌ను భార‌త క్రికెట‌ర్ విరాట్ కోహ్లీ త‌న ఇన్‌స్టా వేదిక‌గా పోస్ట్ చేసిన విష‌యం అంద‌రికీ తెలిసిందే. గ‌తంలో విడుద‌లైన చిత్రాల‌ను చూస్తే.. ఈ స్మార్ట్‌ఫోన్ ట్రిపుల్ రియర్ కెమెరా సెటప్ మరియు LED ఫ్లాష్‌తో కూడా కనిపిస్తుంది.

 
విరాట్ కోహ్లీ పోస్ట్ చేసిన Vivo V25 Pro లాంచ్ భార‌త్‌లో ఎప్పుడంటే!

Vivo V25 ప్రో భారతదేశంలో ఆగస్టు 17 మధ్యాహ్నం 12 గంటలకు ఆవిష్క‌రించ‌బ‌డుతుంద‌ని వివో ప్రకటించింది. ఫోన్ రంగు మార్చే బ్యాక్ ప్యానెల్ మరియు 3D కర్వ్డ్ స్క్రీన్‌ను పొందుతుందని కంపెనీ ఇప్పటికే ధృవీకరించింది. ఫోన్ 120Hz రిఫ్రెష్ రేట్‌తో డిస్‌ప్లేను పొందుతుంది, హుడ్ కింద మీడియాటెక్ డైమెన్సిటీ 1300 SoC, 64-మెగాపిక్సెల్ ప్రధాన కెమెరా సెన్సార్. ఇది 66W ఫ్లాష్ ఛార్జ్‌కు మద్దతుతో 4,830mAh బ్యాటరీని ప్యాక్ చేస్తుంది.

విరాట్ కోహ్లీ పోస్ట్ చేసిన Vivo V25 Pro లాంచ్ భార‌త్‌లో ఎప్పుడంటే!

Vivo V25 ప్రో టీజర్‌:
Vivo ఇండియా తన అధికారిక ట్విట్టర్ ఖాతాలో Vivo V25 ప్రో లాంచ్ ని సూచిస్తూ ఉన్న టీజర్‌ను ఇప్ప‌టికే షేర్ చేసింది. అంతేకాకుండా, ప్రో మోడల్ V25 సిరీస్‌లో మొదటి ఫోన్ కావచ్చు. ఇప్పటికే V25 ప్రో ఇటీవల అనేక లీక్‌లకు గురైంది. ఈ లీకయిన సమాచారాన్ని ఒకసారి గుర్తుకు తెచ్చుకుంటే, Vivo V25 Pro ఇండియా ధర, స్టోరేజ్ వేరియంట్‌లు మరియు ఇతర వివరాలు ఈ నెల ప్రారంభంలో ఆన్‌లైన్‌లో కనిపించాయి. అలాగే, క్రికెటర్ విరాట్ కోహ్లీ ఇటీవల హ్యాండ్‌సెట్‌ను అధికారికంగా ఆవిష్కరించడానికి ముందు వాడుతున్నట్లు లీక్ అయిన ఫోటోలు కూడా ఇంటర్నెట్ లో వైరల్ అయిన సంగతి మీకు తెలిసిందే.

ప‌లు నివేదిక‌ల ద్వారా లీకైన వివ‌రాల ప్ర‌కారం Vivo V25 Pro ఫీచ‌ర్లు, స్పెసిఫికేష‌న్లు:
ఈ మోడ‌ల్‌కు సంబంధించి ఇటీవ‌ల లీకైన స్పెసిఫిష‌న్ల‌ను చూస్తే.. ఈ మొబైల్ కు 6.56 అంగుళాల full-HD + AMOLED డిస్‌ప్లే ను అందిస్తున్నారు. ఈ హ్యాండ్‌సెట్ డిస్‌ప్లే అత్య‌ధికంగా 120Hz రిఫ్రెష్ రేటును క‌లిగి ఉంది. ఈ మొబైల్ ఆండ్రాయిడ్ 12 ఆధారిత ఓఎస్‌పై ప‌ని చేస్తుంది. ఈ ఫోన్ Mediatek Dimensity 8100 SoC ప్రాసెస‌ర్ ను క‌లిగి ఉంది. ఈ మొబైల్ 8GB RAM| 128GB స్టోరేజీ కెపాసిటీలో అందుబాటులో ఉంది. ఇక కెమెరాల విష‌యానికొస్తే.. ఈ మొబైల్ ట్రిపుల్ కెమెరా సెట‌ప్ మ‌రియు ఎల్ఈడీ ఫ్లాష్‌ క‌లిగి ఉంది

విరాట్ కోహ్లీ పోస్ట్ చేసిన Vivo V25 Pro లాంచ్ భార‌త్‌లో ఎప్పుడంటే!

V25 ప్రో ఫోన్ 3D కర్వ్డ్ స్క్రీన్‌ను కలిగి ఉంటుంది. ఫోటోగ్రఫీ విభాగంలో, పరికరం మూడు వెనుకవైపున అమర్చబడిన కెమెరాలు కలిగి ఉంది. వెనుక వైపు 64MP ప్రైమరీ సెన్సార్‌ను కలిగి ఉంటుంది. ఈ ప్రధాన కెమెరా OIS (ఆప్టికల్ ఇమేజ్ స్టెబిలైజేషన్)కు మద్దతు ఇస్తుంది. ఇంకా, ఇది Vlog మోడ్‌తో సహా అనేక ఫీచర్లతో వస్తుందని చెప్పబడింది. ఇందులో ప్రధాన కెమెరా హైబ్రిడ్ ఇమేజ్ స్టెబిలైజేషన్‌కు కూడా మద్దతు ఇస్తుంది. ఇది MediaTek డైమెన్సిటీ 1300 ప్రాసెసర్‌ను తీసుకువస్తుంది. ఇక ఛార్జ్‌ విష‌యానికొస్తే 4500mAh సామ‌ర్థ్యం గ‌ల బ్యాట‌రీని అందిస్తున్నారు. భారతదేశంలో Vivo V25 Pro 5G ధర సుమారు 40,000 రూపాయలు ఉంటుందని గత లీక్‌లు పేర్కొన్నాయి.

Best Mobiles in India

English summary
Vivo V25 Pro India Launch Set on August 17, Vivo V25 Leaked Image Suggests Triple Rear Camera Setup

ఉత్తమ ఫోన్లు

న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X
X