భార‌త్‌లో Vivo v25 సిరీస్ ధ‌ర ఎంతంటే.. విడుద‌ల తేదీ ఖ‌రారైన‌ట్లేనా?

|

Vivo v25 సిరీస్ భార‌త మార్కెట్లో విడుద‌ల చేసేందుకు ఆ సంస్థ స‌న్నాహాలు ముమ్మ‌రం చేస్తోంది. వివో వీ25, వీ25 ప్రో జులై నెల‌లో విడుద‌ల‌య్యే అవ‌కాశం ఉన్నట్లు తెలుస్తోంది. Vivo నుంచి గ‌తేడాది మార్కెట్లోకి వ‌చ్చిన Vivo v23 సిరీస్‌కు ఫాలోఅప్ గా ఈ మోడ‌ల్ రానుంది. సంబంధిత టెక్ వ‌ర్గాల నుంచి ఈ కొత్త Vivo 25, v25 pro కి సంబంధించిన స్పెసిఫికేష‌న్స్, ఫీచ‌ర్ల స‌మాచారం లీక్ అయింది. కాబ‌ట్టి ఓ సారి వాటికి సంబంధించిన స్పెసిఫికేష‌న్‌ల‌పై ఓ లుక్ వేద్దాం.

 
భార‌త్‌లో  Vivo v25 సిరీస్  ధ‌ర ఎంతంటే.. విడుద‌ల తేదీ ఖ‌రారైన‌ట్లేనా?

Vivo v25 స్పెసిఫికేష‌న్స్, ఫీచ‌ర్లు ఇలా ఉన్నాయి:
ఈ మొబైల్ కు 6.62 అంగుళాల ఫుల్ HD+AMOLD డిస్‌ప్లేను అందిస్తున్నారు. దీనికి 90Hz రిఫ్రెష్ రేట్ తో రానుంది. ఈ హ్యాండ్ సెట్ ను అల్యూమినియం తో స్క్వేర్ షేప్‌లో రూపొందించారు. దీనికి క్వాల్‌కామ్ స్నాప్‌డ్రాగ‌న్ 778జీ ప్రాసెస‌ర్ అందిస్తున్నారు. వీ25 మొబైల్ కు 50 మెగా పిక్స‌ల్ గ‌ల సోనీ IMX766V కెమెరాను అందిస్తున్నారు. మెయిన్ సెన్సార్ 12మెగాపిక్సెల్ అల్ట్రా వైడ్ యాంగిల్ లెన్స్ క‌లిగి ఉంది. అంతేకాకుండా సెల్ఫీ మ‌రియు వీడియో కాలింగ్ కోసం ఫ్రంట్ సైడ్ 16 మెగా పిక్స‌ల్ కెమెరా సౌక‌ర్యం క‌ల్పించారు. ఇక ఛార్జ్‌ విష‌యానికొస్తే 4500mAh సామ‌ర్థ్యం గ‌ల బ్యాట‌రీని అందిస్తున్నారు. ఇది 44వాట్ లేదా 66 వాట్ ఫాస్ట్ ఛార్జింగ్ స‌పోర్ట్ క‌లిగి ఉంటుంది.

భార‌త్‌లో  Vivo v25 సిరీస్  ధ‌ర ఎంతంటే.. విడుద‌ల తేదీ ఖ‌రారైన‌ట్లేనా?

Vivo v25 pro స్పెసిఫికేష‌న్స్, ఫీచ‌ర్లు ఇలా ఉన్నాయి:
ఈ వివో వీ 25 ప్రో ని ఇటీవ‌ల చైనాలో విడుద‌లైన వివో ఎస్‌15 ప్రో కి రీబ్రాండెడ్ వ‌ర్ష‌న్‌గా కూడా చెప్ప‌వ‌చ్చు. దీనికి 6.56అంగుళాల ఫుల్ హెచ్‌డీ+అమోల్డ్ క‌ర్వ్‌డ్ డిస్‌ప్లే అందిస్తున్నారు. దీని స్క్రీన్ రీఫ్రెష్ రేటు 120 హెర్ట్జ్‌. దీనికి మీడియాటెక్ డైమెన్సిటి 8100 ప్రాసెస‌ర్ తో వ‌స్తోంది. టెక్ వ‌ర్గాల సమాచారం ప్ర‌కారం మ‌రిన్ని వివ‌రాలు ఇలా ఉన్నాయి. ఇది ర్యామ్‌, స్టోరేజీని బ‌ట్టి రెండు వేరియంట్ల‌లో మ‌న ముందుకు రానుంది. మొద‌టి వేరియంట్ 8GB + 128GB, ఇక రెండో వేరియంట్ 8GB + 256GB, లేదా 12GB + 256GB స్టోరేజీ క‌లిగి ఉంది. దీనికి ముందు వైపున 32MP ఫ్రంట్ కెమెరా సౌక‌ర్యం క‌ల్పించారు. ఇక ఛార్జింగ్ విష‌యానికి వ‌స్తే 4,500 mAh 80W ఫాస్ట్ ఛార్జింగ్ బ్యాట‌రీని అదిస్తున్నారు.

భార‌త్‌లో  Vivo v25 సిరీస్  ధ‌ర ఎంతంటే.. విడుద‌ల తేదీ ఖ‌రారైన‌ట్లేనా?

భార‌త్ లో ఈ మొబైల్ ధ‌ర‌లు:
భార‌త్‌లో ఈ వీ25 సిరీస్ విడుద‌ల తేదీని కంపెనీ ఇంకా నిర్ధారించ‌లేదు. జులై నెల మ‌ధ్య‌లో విడుద‌ల చేసే అవ‌కాశం ఉన్న‌ట్లు తెలుస్తోంది. ఇక ధ‌ర‌ల విష‌యానికి వ‌స్తే వీ25 దాదాపు రూ.30వేల వ‌ర‌కు, వీ25 ప్రో దాదాపు రూ.40వేల వ‌ర‌కు ఉండొచ్చ‌ని స‌మాచారం. ఇందుకు సంబంధించి త్వ‌ర‌లో మ‌రిన్ని వివ‌రాల‌ను కంపెనీ వెల్ల‌డించ‌నుంది.

ఇప్ప‌టికే భార‌త్‌లో Vivo v23 సిరీస్ అందుబాటులో ఉంది:
Vivo v23 సిరీస్‌కు సంబంధించి V23e, V23, మ‌రియు వీ23 ప్రో అందుబాటులో ఉన్నాయి. వీటిల్లో Vivo v23e చాలా అఫ‌ర్డ‌బుల్ మొబైల్‌. దీని స్టార్టింగ్ ధ‌ర రూ.25,990గా ఉంది. ఇక v23 రూ.29,990 కి అందుబాటులో ఉంది. v23pro హైఎండ్ మోడ‌ల్ రూ.38,990 ధ‌ర‌కు వినియోగాదారుల‌కు అందుబాటులో ఉంది.

Best Mobiles in India

English summary
Vivo V25 Series India Launch Set For July. Key Specs, Features Leaked

ఉత్తమ ఫోన్లు

న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X
X