Home
Mobile

వివో V27 ప్రో మొదటి సేల్ ఈ రోజే! ఫోన్ ధర, సేల్ వివరాలు చూడండి

By Maheswara

వివో సంస్థ ఇటీవలే ఇండియాలో వివో V27 ప్రో స్మార్ట్ ఫోన్ ను లాంచ్ చేసింది. ఇప్పుడు ఈ వివో V27 ప్రో ఫోన్ యొక్క మొదటి సేల్ ఈరోజు మొదలవుతుంది. ఈ ఫోన్ గత వారం లాంచ్ చేయబడింది. ఇది వివో V25 ప్రో కి సక్సెసర్‌గా వస్తుంది మరియు వివో V25 ప్రో ఇప్పటికీ అవుట్‌డోర్ లైట్‌కి రంగు మార్చే బ్యాక్ ప్యానెల్‌తో వస్తుంది.

ఈ ఫోన్ పక్కకు వంగిన అంచులు, ఇరుకైన బెజెల్‌లు, మెరుస్తున్న LED ఫ్లాష్‌తో వెనుకవైపు ట్రిపుల్ కెమెరాలు, భద్రత కోసం ఇన్-డిస్‌ప్లే ఫింగర్‌ప్రింట్ సెన్సార్ మరియు ప్రీమియం గ్లాస్ బ్యాక్ డిజైన్‌ ఫీచర్లతో వస్తుంది.ఇప్పుడు వివో V27 ప్రో ఫోన్ యొక్క పూర్తి స్పెసిఫికేషన్ల వివరాలను ఇక్కడ తెలుసుకుందాం.

Vivo V27 Pro First Sale Starts Today In India. Price, Specifications And Offers Details In Telugu.

వివో V27 ప్రో యొక్క ముఖ్యమైన స్పెసిఫికేషన్ల ను పరిశీలిస్తే, ఈ ఫోన్ 6.78 అంగుళాల FHD+ అమోలెడ్ డిస్ప్లే, మీడియా టెక్ డైమెన్సిటీ 8200 SoC ప్రాసెసర్, 66W ఫాస్ట్ ఛార్జింగ్ సపోర్ట్ మరియు 50MP ఫ్రంట్ కెమెరా ఉన్నాయి. పూర్తి స్పెసిఫికేషన్‌లు, భారతదేశం యొక్క ధర మరియు మీరు ఈ పరికరాన్ని కొనుగోలు చేయాలా వద్దా అనే వివరాలను ఇక్కడ చూద్దాం.

భారతదేశంలో వివో V27 ప్రో స్మార్ట్ ఫోన్ ధర వివరాలు
భారతదేశంలో వివో V27 ప్రో ఫోన్ ధర 8GB + 128GB వేరియంట్ మోడల్‌ కు రూ. 37,999, 8GB/256GB వేరియంట్ మోడల్‌ కు రూ. 39,999 మరియు 12GB + 256GB మోడల్‌కు రూ. 42,999 గా ఉంది. నోబుల్ బ్లాక్ మరియు మ్యాజిక్ బ్లూ కలర్ ఆప్షన్లలో ఈ ఫోన్ వస్తుంది. ఈ ఫోన్ ఈరోజు నుండి అంటే మార్చి 6వ తేదీ నుండి సేల్ కు అందుబాటులో ఉంటుంది.

Vivo V27 Pro First Sale Starts Today In India. Price, Specifications And Offers Details In Telugu.

వివో V27 ప్రో స్పెసిఫికేషన్లు, ఫీచర్ల వివరాలు
వివో V27 ప్రో స్మార్ట్ ఫోన్ 120Hz రిఫ్రెష్ రేట్, 2400 X 1080 పిక్సెల్‌ల రిజల్యూషన్ మరియు పంచ్-హోల్ కటౌట్‌తో 6.78 అంగుళాల FHD+ అమోలెడ్ డిస్‌ప్లేను కలిగి ఉంది. మీడియా టెక్ డైమెన్సిటీ 8200 SoC ప్రాసెసర్ తో 8GB/12GB RAM మరియు 128GB/256GB స్టోరేజ్‌తో లాంచ్ అయింది.ఈ స్మార్ట్ ఫోన్ ఆండ్రాయిడ్ 13 ఆధారంగా పనిచేసే ఫన్ టచ్ OS కస్టమ్ స్కిన్ తో అవుట్ ఆఫ్ ది బాక్స్‌ ఫీచర్ గా వస్తుంది.

ఇంకా, వివో V27 ప్రో స్మార్ట్ ఫోన్ 66W ఫాస్ట్ ఛార్జింగ్ సపోర్ట్‌తో 4,600mAh బ్యాటరీని కలిగి ఉంది. భద్రత, డ్యూయల్ సిమ్ సపోర్ట్ మరియు కర్వ్ అంచుల తో ఇన్-డిస్‌ప్లే ఫింగర్ ప్రింట్ సెన్సార్ కలిగి ఉంది. ఇక కనెక్టివిటీ ఆప్షన్లను పరిశీలిస్తే, 5G, 4G LTE, డ్యూయల్ బ్యాండ్ Wi-Fi, బ్లూటూత్, GPS మరియు USB టైప్-C పోర్ట్ లు ఉన్నాయి. వివో V27 ప్రో ఫోన్ యొక్క కొలతలు వివరాలు చూస్తే, ఇది 164.1 X 74.8 X 7.36 mm మరియు బరువు 182 గ్రాములు బరువు ఉంది.

Vivo V27 Pro First Sale Starts Today In India. Price, Specifications And Offers Details In Telugu.

కెమెరా వివరాలు గమనిస్తే, వివో V27 ప్రో వెనుకవైపు ట్రిపుల్ కెమెరాలను కలిగి ఉంది. OIS మరియు LED ఫ్లాష్‌తో కూడిన 50MP సోనీ IMX766V ప్రైమరీ సెన్సార్, 8MP వైడ్-యాంగిల్ లెన్స్ మరియు 2MP మాక్రో షూటర్‌తో. సెల్ఫీలు మరియు వీడియో చాట్‌ల కోసం 50MP ఫ్రంట్ కెమెరా లను కలిగి ఉంది.

మీరు ఈ వివో V27 ప్రో ని కొనుగోలు చేయాలా?వద్దా?
ఈ ఫోన్ ను రూ. 40,000 కి కొనుగోలు చేయడం సబబేనా అని అర్థం చేసుకోవడానికి దీని ఫీచర్లు పరిశీలిస్తే డిజైన్ కలర్-ఛార్జింగ్ బ్యాక్ ప్యానెల్‌తో చాలా ఆకట్టుకుంటుంది మరియు కెమెరాలు కూడా చాలా గొప్పగా ఉన్నాయి.

అయితే, ఈ ఫోన్ పనితీరు దీని ధర కంటే మెరుగ్గా ఉండవచ్చు. ఫోన్‌లో స్టీరియో స్పీకర్‌లు కూడా లేవు మరియు సాఫ్ట్‌వేర్ బ్లోట్‌వేర్‌తో వస్తుంది. ఇది ఈ ధర లో ఇది ఉత్తమమైన ఎంపిక కాకపోవచ్చు. ఈ లోపాలు నిజంగా మిమ్మల్ని పెద్దగా ఇబ్బంది పెట్టకపోతే, వివో V27 ప్రో ఒక మంచి ఫోన్ అవుతుంది.

More from GizBot

Best Mobiles in India

English summary
Vivo V27 Pro First Sale Starts Today In India. Price, Specifications And Offers Details In Telugu.
Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
X