50MP సెల్ఫీ కెమెరా, 8GB ర్యామ్ 5G స్మార్ట్‌ఫోన్ ధర తగ్గింపు.. స్పెసిఫికేషన్‌లు, సేల్ వివరాలు..!
వివో నుంచి ఇటీవల భారత్ మార్కెట్లో తొలి ఫోల్డబుల్ స్మార్ట్ ఫోన్ వివో X ఫోల్డ్ 3 ప్రో విడుదల అయింది. ఈ హ్యాండ్‌సెట్ ఆకట్టుకొనే డిజైన్ సహా మెరుగైన స్పెసిఫికేషన్‌లు, ఫీచర్‌లను కలిగి ఉంది. భారత్‌లో తొలి వివో ఫోల్డబుల్ స్మార్ట్‌ఫోన్ సేల్ అమెజాన్‌లో ప్రారంభం అయింది. ఈ స్మార్ట్‌ఫోన్ 8GB ర్యామ్ + 256GB స్టోరేజీ వేరియంట్ ధర రూ.1,59,999 గా ఉంది. అయితే వివో V29e 5G స్మార్ట్‌ఫోన్‌ను (Vivo V29e 5G Smartphone) ఫ్లిప్‌కార్ట్‌లో తగ్గింపు ధరకు కొనుగోలు చేయవచ్చు. ఫ్లిప్‌కార్ట్‌లో ప్రస్తుతం ఈ స్మార్ట్‌ఫోన్ అందుబాటులో ఉంది.
ఫ్లిప్‌కార్ట్‌లో వివో V29e స్మార్ట్ ఫోన్ 8GB ర్యామ్ + 128GB అంతర్గత స్టోరేజీ వేరియంట్‌ను రూ.25,999 గా ఉంది. దీంతోపాటు ఫ్లిప్ కార్ట్ యాక్సెస్ బ్యాంకు కార్డు ద్వారా 5 శాతం తగ్గింపును పొందవచ్చు. ఈ వివో స్మార్ట్‌ఫోన్ 50MP సెల్ఫీ కెమెరాను కలిగి ఉంటుంది.

వివో V29e 5G స్మార్ట్ ఫోన్ స్పెసిఫికేషన్‌లు, ఫీచర్‌లు :
ఈ వివో స్మార్ట్‌ఫోన్ 6.78 అంగుళాల పుల్ HD+ అమోలెడ్ డిస్‌ప్లేను కలిగి ఉంది. 1080*2400 రిజల్యూషన్, 120Hz రీఫ్రెష్ రేట్, 1300 నిట్స్ బ్రైట్‌నెస్‌తో అందుబాటులో ఉంది. డైమండ్ కట్ క్రిస్టల్ బ్యాక్ ప్యానల్ సహా పంచ్ హోల్ కటౌట్‌ను కలిగి ఉంది.
వివో V29e 5G స్మార్ట్ ఫోన్ ఆండ్రాయిడ్ 13 ఆధారిత Funtouch OS 13 పైన పనిచేస్తుంది. మరియు ఆక్టాకోర్ క్వాల్‌కాం స్నాప్ డ్రాగన్ 695 చిప్ సెట్‌ను కలిగి ఉంది. 8GB ర్యామ్ + 128GB స్టోరేజీ, 8GB ర్యామ్ + 256GB స్టోరేజీ వేరియంట్‌లో కొనుగోలు చేయవచ్చు.
వివో V29e 5G స్మార్ట్ ఫోన్ వెనుకవైపు డ్యూయల్ కెమెరాలను కలిగి ఉంది. OIS (ఆప్టికల్ ఇమేజ్ స్టెబిలైజేషన్) సపోర్టుతో 64MP కెమెరా మరియు 8MP కెమెరాను కలిగి ఉంది. సెల్ఫీ, వీడియో కాల్స్ కోసం 50MP కెమెరాను కలిగి ఉంది. పోర్ట్రెయిట్, మైక్రో మూవీ, హై రిజల్యూషన్, స్లో మోషన్, డబుల్ ఎక్స్‌పోజర్ వంటి ఎఫెక్ట్‌లను కలిగి ఉంది.
ఈ వివో స్మార్ట్‌ఫోన్ 44W ఫాస్ట్ ఛార్జింగ్ సపోర్టుతో 5000mAh బ్యాటరీని కలిగి ఉంటుంది. ఇన్ డిస్‌ప్లే ఫింగర్ ప్రింట్‌ను కలిగి ఉంటుంది. యాక్సిలిరోమీటర్, యాంబియంట్ లైట్ సెన్సార్, ప్రాక్సిమిటీ సెన్సార్, ఈ- కాంపాస్, గైరో స్కోప్ వంటి సెన్సార్‌లను కలిగి ఉండనుంది.
గిజ్ బాట్ తెలుగు వెబ్ సైట్ గ్యాడ్జెట్లు సహా ఇతర టెక్ న్యూస్ కు సంబంధించిన ఆసక్తికరమైన తాజా వార్తలను అందిస్తుంది. వివిధ సోషల్ మీడియాల ద్వారా సరికొత్త వార్తలను ఎప్పటికప్పుడు యూజర్లకు చేరవేస్తుంది. తాజా వార్తల కోసం సోషల్ మీడియా ఖాతాలతో కనెక్ట్ అవ్వండి. మీకు ఏదైనా వార్త నచ్చితే లైక్ చేయండి. కామెంట్ చేయడం మర్చిపోవద్దు. అలానే మీ తోటి స్నేహితులతో ఈ వార్తను పంచుకోగలరు.


Click it and Unblock the Notifications








