50MP సెల్ఫీ కెమెరా, 6.78 అంగుళాల డిస్‌ప్లేతో Vivo కొత్త స్మార్ట్‌ఫోన్లు.. లాంచ్ తేదీ, స్పెసిఫికేషన్ల వివరాలు.!
వివో సంస్థ త్వరలో తన V సిరీస్ స్మార్ట్‌ఫోన్లను భారత్‌లో విడుదల చేయనుంది. వివో V30 మరియు V30 ప్రో స్మార్ట్‌ఫోన్‌లు (Vivo V30 and V30 Pro Smartphones) మార్చి 7వ తేదీ మధ్యాహ్నం 12 గంటలకు భారత్ మార్కెట్‌లో విడుదల చేయనుంది. ఈ వివరాలను వివో ఇండియా అధికారికంగా ధ్రువీకరించింది.
కొన్ని నివేదికల ప్రకారం వివో V30 స్మార్ట్‌ఫోన్ 6.78 అంగుళాల కర్వడ్ అమోలెడ్ డిస్‌ప్లేను కలిగి ఉంటుంది. మరియు 2800 నిట్స్ గరిష్ఠ బ్రైట్‌నెస్ తో వస్తుంది. దీంతోపాటు ఈ హ్యాండ్‌సెట్ 50MP సెల్ఫీ కెమెరాను కలిగి ఉంటుందని తెలుస్తోంది. మరియు ముందువైపు రెండు LED లైట్లు ఉంటాయని సమాచారం.

దీంతోపాటు ఈ స్మార్ట్‌ఫోన్ ఆక్టా కోర్ క్వాల్‌కాం స్నాప్ డ్రాగన్ 7 జెన్ చిప్‌సెట్ ను కలిగి ఉండే అవకాశం ఉంది. మరియు వెనుకవైపు ట్రిపుల్ కెమెరాలను కలిగి ఉండే అవకాశం ఉంది. ఇందులో భాగంగా 50MP ప్రైమరీ కెమెరా, 50MP అల్ట్రావైడ్ కెమెరా, 2MP డెప్త్ సెన్సార్‌ను కలిగి ఉంటుందని తెలుస్తోంది.
దీంతోపాటు ఈ వివో V30 స్మార్ట్‌ఫోన్ 80W ఫాస్ట్ ఛార్జింగ్ సపోర్టుతో 5000mAh బ్యాటరీని కలిగి ఉండే అవకాశం ఉంది. మరియు IP54 రేటింగ్‌తో వాటర్ మరియు డస్ట్ రెసిస్టెన్స్‌ను వస్తుందని సమాచారం. అయితే ఈ స్పెసిఫికేషన్లు, ఫీచర్లపై సంస్థ అధికారిక ప్రకటన చేయాల్సి ఉంది.

అదే వివో V30 ప్రో స్మార్ట్‌ఫోన్ మీడియాటెక్ డైమెన్సిటీ 8200 చిప్‌సెట్ 12GB ర్యామ్‌తో వచ్చే అవకాశం ఉంది. దీంతోపాటు 50MP ట్రిపుల్ కెమెరా, 50MP సెల్ఫీ కెమెరాలను కలిగి ఉండే అవకాశం ఉంది. ఈ హ్యాండ్‌సెట్ అండమాన్ బ్లూ, క్లాసిక్ బ్లాక్ రంగుల్లో లభిస్తుందని సమాచారం.
* భారత్‌లో ఫిబ్రవరి 22న వివో Y200e 5G స్మార్ట్‌ఫోన్ లాంచ్ అయింది. 6.67 అంగుళాలు పుల్ HD+ అమోలెడ్ డిస్‌ప్లేను కలిగి ఉంటుంది. 1800 నిట్స్ గరిష్ఠ బ్రైట్‌నెస్, 120Hz రీఫ్రెష్ రేట్‌తో వస్తుంది. క్వాల్‌కాం స్నాప్ డ్రాగన్ 4 జెన్ 2 SoC ప్రాసెసర్ ద్వారా 8GB LPDDR4x ర్యామ్ మరియు 128GB UFS 2.2 తో జతచేయబడి ఉంటుంది. వర్చువల్‌గా 8GB వరకు ర్యామ్‌ను పెంచుకోవచ్చు.
ఈ ఫోన్ స్టోరేజీని మైక్రో SD కార్డు ద్వారా 1TB వరకు పెంచుకోవచ్చు. మరియు వివో Y200e 5G స్మార్ట్ ఫోన్ ఆండ్రాయిడ్ 14 ఆధారిత FuntouchOS 14 పైన పనిచేస్తుంది. మరియు 44W వైర్డ్ ఫాస్ట్ ఛార్జింగ్‌తో 5000mAh బ్యాటరీ ప్యాక్‌ను కలిగి ఉంటుంది. IP54 రేటింగ్ సహా ఇన్ డిస్‌ప్లే ఫింగర్ ప్రింట్ సెన్సార్‌ను కలిగి ఉంటుంది.
గిజ్‌బాట్ తెలుగు వెబ్‌సైట్ గ్యాడ్జెట్లు సహా ఇతర టెక్ న్యూస్‌కు సంబంధించిన ఆసక్తికరమైన తాజా వార్తలను అందిస్తుంది. వివిధ సోషల్ మీడియాల ద్వారా సరికొత్త వార్తలను ఎప్పటికప్పుడు యూజర్లకు చేరవేస్తుంది. తాజా వార్తల కోసం సోషల్ మీడియా ఖాతాలతో కనెక్ట్ అవ్వండి. మీకు ఏదైనా వార్త నచ్చితే లైక్ చేయండి. కామెంట్ చేయడం మర్చిపోవద్దు. అలానే మీతోటి స్నేహితులతో ఈ వార్తను పంచుకోగలరు.


Click it and Unblock the Notifications