Home
Mobile

50MP సెల్ఫీ కెమెరా, 6.78 అంగుళాల డిస్‌ప్లే, 5000mAh బ్యాటరీతో Vivo స్మార్ట్‌ఫోన్లు విడుదల.. ధర, సేల్‌ వివరాలు.

వివో సంస్థ తన వివో V30 సిరీస్‌ (Vivo V30 Smartphone) స్మార్ట్‌ఫోన్లను భారత్‌లో లాంచ్‌ చేసింది. ఈ సిరీస్‌లో భాగంగా వివో V30 మరియు వివో V30 pro హ్యాండ్‌సెట్లు విడుదల అయ్యాయి. V సిరీస్‌ ఫోన్‌లో తొలిసారిగా వివో Zeiss కెమెరాలను అందించింది. ఈ రెండు స్మార్ట్‌ఫోన్లు 50MP సెల్ఫీ కెమెరాలను కలిగి ఉంటుంది.

వివో V30 స్పెసిఫికేషన్లు :
వివో V30 స్మార్ట్‌ఫోన్‌ (Vivo V30 Smartphone) 6.78 అంగుళాల పుల్‌ HD+ అమోలెడ్‌ డిస్‌ప్లేను కలిగి ఉంటుంది. ఈ ఫోన్‌ 2800*1260 పిక్సల్‌ రిజల్యూషన్‌, 120Hz రీఫ్రెష్‌ రేట్‌, 2800 గరిష్ఠ బ్రైట్‌నెస్‌తో వచ్చింది. ఈ హ్యాండ్‌సెట్‌ ఫాస్ట్‌ ఛార్జింగ్‌ సపోర్టుతో 5000mAh బ్యాటరీ సామర్థ్యాన్ని కలిగి ఉంటుంది.

Vivo V30 and V30 Pro Smartphone launched

ఈ వివో V30 స్మార్ట్‌ఫోన్‌ ఆండ్రాయిడ్‌ 14 ఆధారిత FuntouchOS 14 పైన పనిచేస్తుంది. మరియు స్నాప్‌డ్రాగన్‌ 7 జెన్‌ 3 చిప్‌సెట్‌ను కలిగి ఉంటుంది. ఈ చిప్‌ గరిష్ఠంగా 12GB ర్యామ్‌ మరియు 256GB UFS 3.1 తో జతచేయబడి ఉంటుంది.

ఈ వివో హ్యాండ్‌సెట్‌ ట్రిపుల్‌ కెమెరాలను కలిగి ఉంటుంది. OIS (ఆప్టికల్‌ ఇమేజ్ స్టెబిలైజేషన్‌) సపోర్టుతో 50MP కెమెరా, 50MP అల్ట్రావైడ్‌ కెమెరా, 2MP బోకేష్‌ కెమెరాలను కలిగి ఉంటుంది. ఈ ఫోన్ సెల్ఫీ, వీడియో కాల్స్‌ కోసం 50MP సెల్ఫీ కెమెరాను కలిగి ఉంటుంది. సెల్ఫీ లవర్స్‌కు ఈ ఫోన్‌ ఆకట్టుకొనే అవకాశం ఉంది.

Vivo V30 and V30 Pro Smartphone launched

వివో V30 స్మార్ట్‌ఫోన్‌ మూడు వేరియంట్లలో లభిస్తుంది. 8GB ర్యామ్‌ + 128GB స్టోరేజీ ధర రూ.33999గా ఉంది. అదే 8GB ర్యామ్‌ +256GB స్టోరేజీ వేరియంట్ ధర రూ.35,999, 12GB ర్యామ్‌ +256GB స్టోరేజీ వేరియంట్‌ ధర రూ.37,999 గా ఉంది.

వివో V30 ప్రో స్పెసిఫికేషన్లు :
వివో V30 ప్రో హ్యాండ్‌సెట్‌ (Vivo V30 Pro Smartphone) 2800*1260 పిక్సల్‌తో 6.78 అంగుళాల పుల్ HD+ అమోలెడ్‌ డిస్‌ప్లేను కలిగి ఉంటుంది. మరియు 120Hz రీఫ్రెష్‌ రేట్‌, 2800 నిట్స్‌ గరిష్ఠ బ్రైట్‌నెస్‌ను కలిగి ఉంటుంది. మరియు ఈ డిస్‌ప్లే HDR10+ సపోర్టుతో వస్తుంది.

Vivo V30 and V30 Pro Smartphone launched

ఈ వివో ప్రో మోడల్ ఆండ్రాయిడ్‌ ఆధారిత FuntouchOS 14పైన పనిచేస్తుంది. మరియు మీడియాటెక్‌ డైమెన్సిటీ 8200 ప్రాసెసర్‌ను కలిగి ఉంటుంది. ఈ చిప్‌సెట్‌ గరిష్ఠంగా 12GB ర్యామ్‌ మరియు 512GB స్టోరేజీతో జతచేయబడుతుంది. ఈ V30 ప్రో మోడల్‌ 80W ఫాస్ట్‌ ఛార్జింగ్ సపోర్టుతో 5000mAh బ్యాటరీని కలిగి ఉంది.

కెమెరా విభాగం పరంగా ఈ వివో V30 ప్రో స్మార్ట్‌ ఫోన్‌ 50MP సోనీ IMX920 ప్రైమరీ కెమెరా, 50MP పొర్ట్రెయిట్‌ లెన్స్‌, 50MP అల్ట్రావైడ్‌ యాంగిల్‌ లెన్స్‌ను కలిగి ఉంది. సెల్ఫీ, వీడియో కాల్‌ కోసం ముందు వైపు 50MP కెమెరాను కలిగి ఉంది.

Vivo V30 and V30 Pro Smartphone launched

వివో V30 ప్రో మోడల్‌ 8GB ర్యామ్ + 256GB స్టోరేజీ ధర రూ.41,999, 12GB ర్యామ్‌ + 512GB స్టోరేజీ వేరియంట్‌ ధర రూ.46,999గా ఉంది. ఈ వివో V30 సిరీస్‌ స్మార్ట్‌ఫోన్‌ సేల్ (Vivo V30 Smartphones Sale) మార్చి 14 నుంచి వివో స్టోర్‌, ఫ్లిప్‌కార్ట్‌ ద్వారా కొనుగోలు చేయవచ్చు.

ఈ వివో V30, వివో V30 ప్రో స్మార్ట్‌ఫోన్లను (Vivo V30 and V30 Pro Smartphones) SBI, HDFC కార్డుల ద్వారా కొనుగోలు చేస్తే 10 శాతం తక్షణ డిస్కౌంట్‌ను పొందవచ్చని సంస్థ వెల్లడించింది. దీంతోపాటు నో కాస్ట్‌ EMI ఆప్షన్‌ సహా ఎక్స్చేంజీ బోనస్‌ ద్వారా రూ.4000 వరకు ప్రయోజనాలు పొందవచ్చని పేర్కొంది.

More from GizBot

Best Mobiles in India

English summary
Vivo V30 and V30 Pro Smartphones launched in india with 50MP selfie cameras
Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
X