50MP సెల్ఫీ కెమెరాతో Vivo V30 సిరీస్ స్మార్ట్‌ఫోన్‌లు విడుదల.. స్పెసిఫికేషన్ల వివరాలు..!
వివో V30 మరియు V30 ప్రో స్మార్ట్‌ఫోన్లు విడుదల (Vivo V30 And Vivo V30 Pro Smartphones) అయ్యాయి. ఈ రెండు హ్యాండ్‌సెట్లు 1.5k కర్వడ్ డిస్‌ప్లే మరియు 50MP సెల్ఫీ కెమెరాలను కలిగి ఉంటాయి. ఈ బేస్ వేరియంట్ 8GB ర్యామ్ + 256GB స్టోరేజీ, 12GB ర్యామ్ +512GB స్టోరేజీ వేరియంట్‌లో అందుబాటులో ఉంటుంది.
వివో V30 మరియు V30 ప్రో స్మార్ట్‌ఫోన్ల స్పెసిఫికేషన్లు :
ఈ రెండు స్మార్ట్‌ఫోన్లు 6.78 అంగుళాల కర్వడ్ 1.5k అమోలెడ్ డిస్‌ప్లేను కలిగి ఉంటాయి. 2800*1260 పిక్సల్ రిజల్యూషన్, 120Hz రీఫ్రెష్ రేట్, 300Hz టచ్ శాంప్లింగ్ రేట్, 2800 నిట్స్ గరిష్ఠ బ్రైట్‌నెట్‌తో రానున్నాయి.

వివో V30 5G స్మార్ట్‌ఫోన్ క్వాల్‌కాం స్నాప్ డ్రాగన్ 7 జెన్ 3 SoC చిప్‌తో అడెన్నో 720 GPU పైన పనిచేస్తుంది. అదే ప్రో మోడల్ మీడియాటెక్ డైమెన్సిటీ 8200 చిప్‌సెట్‌తో Mail G610 GPU పైన పనిచేస్తుంది. ఈ రెండు స్మార్ట్‌ఫోన్లు ఆండ్రాయిడ్ 14 ఆధారిత FunTouchOS 14 పైన పనిచేస్తాయి.
వివో V30 స్మార్ట్‌ఫోన్ 12GB LPDDR4X ర్యామ్, 512GB UFS 2.2 అంతర్గత స్టోరేజీతో వస్తుంది. అదనంగా 12GB వరకు ర్యామ్‌ను విస్తరించవచ్చు. అదే విధంగా ప్రో మోడల్ 12GB LPDDR5X ర్యామ్ మరియు 512GB UFS 3.1 అంతర్గత స్టోరేజీని కలిగి ఉంటుంది. మరియు అదనంగా 12GB ర్యామ్‌ను విస్తరించుకోవచ్చు.

వివో V30 5G స్మార్ట్‌ఫోన్ వెనుకవైపు డ్యూయల్ కెమెరాలను కలిగి ఉంటుంది. ఆప్టికల్ ఇమేజ్ స్టెబిలైజేషన్ (OIS) సపోర్టుతో 50MP ప్రైమరీ కెమెరా, 50MP అల్ట్రావైడ్ యాంగిల్ కెమెరాలను కలిగి ఉంది. మరియు అరా లైట్ ఫ్లాష్‌తో వచ్చింది. ముందువైపు 50MP సెల్ఫీ కెమెరాలను కలిగి ఉంటుంది. ప్రో మోడల్ కూడా ఇదే తరహా కెమెరాలను కలిగి ఉంటుంది. అయితే వెనుకవైపు అదనంగా 50MP పోర్ట్రెయిట్ కెమెరాను కలిగి ఉంటుంది.
ఈ రెండు వివో స్మార్ట్‌ఫోన్లు 80W వైరడ్ ఫాస్ట్ ఛార్జింగ్ సపోర్టుతో 5000mAh బ్యాటరీని కలిగి ఉంది. IP54 రేటింగ్‌తో డస్ట్ మరియు స్లాష్ రిసిస్టెన్స్‌తో వస్తుంది. దీంతోపాటు ఇన్- డిస్‌ప్లే ఫింగర్ ప్రింట్ స్కానర్‌ను కలిగి ఉంటుంది. మరియు ఈ హ్యాండ్‌సెట్‌లు 5G, వైఫై, బ్లూటూత్, NFC, GPS మరియు USB 2.0 వంటి కనెక్టివిటీ ఫీచర్లను కలిగి ఉంటుంది.
వివో V30 మరియు V30 ప్రో స్మార్ట్‌ఫోన్లు ప్రస్తుతం ఇండోనేషియాలోనే విడుదల అయ్యాయి. వివో V30 5G స్మార్ట్‌ఫోన్ 8GB ర్యామ్ + 256GB అంతర్గత స్టోరేజీ ధర IDR 5,999,000 (భారత కరెన్సీలో రూ.31,700), 12GB ర్యామ్ +512GB అంతర్గత స్టోరేజీ వేరియంట్ ధర IDR 6,999,000 (భారత కరెన్సీలో రూ.37,000) గా ఉంది.
మరియు ప్రో మోడల్ కేవలం 12GB ర్యామ్ +512GB అంతర్గత స్టోరేజీ వేరియంట్‌లోనే అందుబాటులో ఉంటుంది. ధర IDR 8,999,000 (భారత కరెన్సీలో రూ.47,000) గా ఉంది. ఇండోనేషియాలో ఈ ఫోన్లు ఈక్విటోరియల్ గ్రీన్, పుష్ప వైట్, వాల్కనిక్ బ్లాక్ రంగుల్లో లభించనున్నాయి. భారత్‌లో ఈ సిరీస్ స్మార్ట్‌ఫోన్లు మార్చి 7న విడుదల కానున్నాయి.
వివో V30 మరియు V30 ప్రో స్మార్ట్‌ఫోన్లు ప్రస్తుతం ఇండోనేషియాలో మాత్రమే విడుదల అయ్యాయి. భారత్ మార్కెట్‌లో ఈ రెండు హ్యాండ్‌సెట్‌లు మార్చి 7న లాంచ్ కానున్నాయి. అయితే ఇండోనేషియాలో లాంచ్ అయిన మోడళ్ల తరహా స్సెసిఫికేషన్లు, ఫీచర్లను కలిగి ఉండే అవకాశం ఉంది.


Click it and Unblock the Notifications