నాలుగు 50MP కెమెరాలు, 6.78 అంగుళాల FHD+ డిస్‌ప్లే Vivo స్మార్ట్‌ఫోన్‌పై భారీ డిస్కౌంట్.. పూర్తి వివరాలు..!
ఫ్లిప్‌కార్ట్ స్మార్ట్‌ఫోన్స్ ఫెస్టివ్ డేస్ సేల్ (Flipkart Smartphone Festive Days sale) ప్రస్తుతం జరుగుతోంది. ఈ సేల్‌లో భాగంగా అనేక స్మార్ట్‌ఫోన్‌లను డిస్కౌంట్ ధరకు అందుబాటులో ఉన్నాయి. ఈ సేల్ నవంబర్ 1 వ తేదీన ప్రారంభం అయింది. ఈ నెల 7 వరకు సేల్ జరుగుతుంది. ఈ ఫ్లిప్‌కార్ట్ ప్రత్యేక స్మార్ట్‌ఫోన్ సేల్‌లో భాగంగా వివో V30 ప్రో 5G స్మార్ట్‌ఫోన్ (Vivo V30 Pro Smartphone) ను రూ.7000 వరకు డిస్కౌంట్ ధరకు కొనుగోలు చేయవచ్చు. ఈ హ్యాండ్‌సెట్ 50MP సెల్ఫీ కెమెరాను కలిగి ఉంది. 80W ఫాస్ట్ ఛార్జింగ్ సపోర్టుతో పనిచేస్తుంది. ఈ స్మార్ట్‌ఫోన్ ఈ సంవత్సరం మార్చిలో భారత్ మార్కెట్‌లో అందుబాటులోకి వచ్చింది.
వివో V30 ప్రో 5G స్మార్ట్‌ఫోన్ ప్రస్తుతం రెండు స్టోరేజీ వేరియంట్‌లో అందుబాటులో ఉంది. 8GB ర్యామ్ + 256GB స్టోరేజీ, 12GB ర్యామ్ + 512GB స్టోరేజీ వేరియంట్‌లో అందుబాటులో ఉంది. విడుదల సమయంలో ఈ హ్యాండ్‌సెట్ ప్రారంభ ధర రూ.41999 గా ఉండేది. ప్రస్తుతం రూ.3000 ధర తగ్గింపుతో ఫ్లిప్‌కార్ట్‌లో రూ.38,999 కే కొనుగోలు చేయవచ్చు.

12GB ర్యామ్ వేరియంట్ విడుదల సమయంలో రూ.46,999 గా ఉండేది. ప్రస్తుతం ఫ్లిప్‌కార్ట్‌లో ధర రూ.43,999 గా ఉంది. అన్ని బ్యాంకు డెబిట్, క్రెడిట్ కార్డుల ద్వారా రూ.4000 వరకు డిస్కౌంట్‌ను పొందవచ్చు. విడుదల ధరతో పోలిస్తే రూ.7000 వరకు డిస్కౌంట్ లభిస్తుంది. దీంతోపాటు ఫ్లిప్‌కార్ట్ యాక్సెస్ క్రెడిట్ కార్డు ద్వారా 5 శాతం తగ్గింపును పొందవచ్చు. క్లాసిక్ బ్లాక్, అండమాన్ బ్లూ రంగుల్లో లభిస్తుంది.
వివో V30 ప్రో 5G స్మార్ట్‌ఫోన్ స్పెసిఫికేషన్‌లు, ఫీచర్‌లు :
వివో V30 ప్రో స్మార్ట్‌ఫోన్ 6.78 అంగుళాల FHD+ అమోలెడ్ డిస్‌ప్లేను కలిగి ఉంది. ఈ డిస్‌ప్లే 2800*1260 పిక్సల్స్ రిజల్యూషన్, 120Hz రీఫ్రెష్ రేట్, 2800 నిట్స్ గరిష్ఠ బ్రైట్‌నెస్‌ను కలిగి ఉంది. ఈ వివో ఫోన్ డిస్‌ప్లే HDR10+ సపోర్టు చేస్తుంది. 80W ఫాస్ట్ ఛార్జింగ్ సపోర్టుతో 5000mAh బ్యాటరీతో పనిచేస్తుంది.
వివో స్మార్ట్‌ఫోన్ 4nm మీడియాటెక్ డైమెన్సిటీ 8200 చిప్‌సెట్‌తో పనిచేస్తోంది. ఈ ప్రాసెసర్ గరిష్ఠంగా 12GB ర్యామ్, 512GB స్టోరేజీని కలిగి ఉంది. మరియు ఆండ్రాయిడ్ 14 ఆధారిత FuntouchOS 14 ను కలిగి ఉంది. ఈ హ్యాండ్‌సెట్ ప్రస్తుతం రెండు స్టోరేజీ వేరియంట్‌లో అందుబాటులో ఉంది.
కెమెరా విభాగం పరంగా ఈ వివో V30 ప్రో స్మార్ట్‌ఫోన్ ట్రిపుల్ కెమెరాను కలిగి ఉంది. OIS, ఆటోఫోకస్, f/1.88 అపేచర్‌తో 50MP సోనీ IMX920 కెమెరాను కలిగి ఉంది. f/1.85 అపేచర్, ఆటోఫోకస్ సామర్థ్యంతో 50MP సోనీ IMX816 పొర్ట్రెయిట్ కెమెరాతో అందుబాటులో ఉంది.
వీటితోపాటు f/2.0 అపేచర్, ఆటోఫోకస్ సామర్థ్యంతో 50MP వైడ్ యాంగిల్ కెమెరాను అమర్చి ఉంటుంది. హై రిజల్యూషన్, Pano, సూపర్ మూన్, టైమ్ ల్యాప్స్, నైట్ మోడ్, పొర్ట్రెయిట్ మోడ్, మైక్రో మూవ్‌ను సపోర్టు చేస్తుంది. ముందువైపు సెల్ఫీ, వీడియో కాల్స్ కోసం ఆటోఫోకస్, f/2.0 అపేచర్‌తో 50MP సెల్ఫీ కెమెరాను కలిగి ఉంది.


Click it and Unblock the Notifications








