50MP సెల్ఫీ కెమెరా, 512GB స్టోరేజీతో Vivo స్మార్ట్‌ఫోన్.. స్పెసిఫికేషన్ల వివరాలు
వివో సంస్థ తాజాగా కొత్త స్మార్ట్‌ఫోన్ వివో V30 (Vivo V30) ను ఆవిష్కరించింది. ఈ హ్యాండ్‌సెట్ వివో S18 రీబ్రాండెడ్ వెర్షన్‌గా తెలుస్తుంది. ఈ స్మార్ట్‌ఫోన్ 3D కర్వడ్ అమోలెడ్ డిస్‌ప్లేను కలిగి ఉంది. మరియు స్నాప్ డ్రాగన్ 7 జెన్ 3 SoC చిప్‌సెట్‌ను కలిగి ఉంది. 50MP ప్రధాన కెమెరా సహా 5000mAh బ్యాటరీని కలిగి ఉంది.
త్వరలోనే ఈ వివో V30 స్మార్ట్‌ఫోన్ భారత్, ఇండోనేషియా, మలేషియా, థాయ్‌లాండ్, హాంకాంగ్, యూఏఈ వంటి 30 దేశాల్లో అందుబాటులోకి రానుంది. ఈ ఫోన్ ధరపై సంస్థ ఎటువంటి ప్రకటన చేయలేదు. ఈ హ్యాండ్‌సెట్ బ్లూమ్ వైట్, లష్ గ్రీన్, నోబెల్ బ్లాక్, వేవింగ్ అక్వా వంటి రంగుల్లో కొనుగోలు చేయవచ్చు.

వివో V30 స్మార్ట్‌ఫోన్ స్పెసిఫికేషన్లు :
వివో వి30 స్మార్ట్‌ఫోన్ ఆండ్రాయిడ్ 14 ఆధారిత FuntouchOS 14 పైన పనిచేస్తుంది. ఈ హ్యాండ్‌సెట్ 6.78 అంగుళాల పుల్ HD 3D కర్వడ్ అమోలెడ్ డిస్‌ప్లేను కలిగి ఉంటుంది. 1260*2800 పిక్సల్ రిజల్యూషన్, 20:9 ఆస్పెక్ట్ రేషియో, 120Hz రీఫ్రెష్ రేట్‌తో వస్తుంది. ఈ డిస్‌ప్లే HDR10+ సపోర్టు చేస్తుంది. మరియు 2800 నిట్స్ గరిష్ఠ బ్రైట్‌నెస్‌ను కలిగి ఉంటుంది.
ఈ వివో V30 స్మార్ట్‌ఫోన్ అండర్ ది హుడ్ 4nm స్నాప్ డ్రాగన్ 7 జెన్ 3 SoC చిప్‌తో అడెన్నో 720 GPU జతచేయబడుతుంది. ఈ హ్యాండ్‌సెట్ 8GB ర్యామ్+ 128GB స్టోరేజీ, 8GB ర్యామ్+ 256GB అంతర్గత స్టోరేజీ, 12GB ర్యామ్+ 256GB స్టోరేజీ మరియు 12GB ర్యామ్ +512GB స్టోరేజీ వేరియంట్లలో అందుబాటులో ఉంది.

వివో కొత్త స్మార్ట్‌ఫోన్ వెనుకవైపు ట్రిపుల్ కెమెరాలను కలిగి ఉంటుంది. 50MP OmniVision OV50E ప్రధాన కెమెరాను కలిగి ఉంటుంది. ఈ కెమెరా OIS ( ఆప్టికల్ ఇమేజ్ స్టెబిలైజేషన్ ) ఫీచర్‌తో వస్తుంది. మరియు 50MP అల్ట్రా వైడ్ యాంగిల్ కెమెరా, పోర్ట్రెయిట్ సెన్సార్‌లను కలిగి ఉంటుంది. మరియు ముందువైపు సెల్ఫీ, వీడియో కాల్స్ కోసం 50MP కెమెరాను అమర్చారు.
80W ఫాస్ట్ ఛార్జింగ్ సపోర్టుతో : ఈ వివో V30 స్మార్ట్‌ఫోన్ 80W ఫాస్ట్ ఛార్జింగ్ సపోర్టుతో 5000mAh బ్యాటరీ సామర్థ్యంతో వస్తుంది. ఈ ఫోన్ భారత్ సహా 30 దేశాల్లో త్వరలోనే అందుబాటులోకి రానుంది. అయితే ఈ స్మార్ట్‌ఫోన్ ధరలపై ఆవిష్కరణ సమయంలో వివో ఎటువంటి ప్రకటన చేయలేదు. త్వరలో ధర, సేల్ వివరాలు అందుబాటులోకి వచ్చే అవకాశం ఉంది.

గిజ్‌బాట్ తెలుగు వెబ్‌సైట్ గ్యాడ్జెట్లు సహా ఇతర టెక్ న్యూస్‌కు సంబంధించిన ఆసక్తికరమైన తాజా వార్తలను అందిస్తుంది. వివిధ సోషల్ మీడియాల ద్వారా సరికొత్త వార్తలను ఎప్పటికప్పుడు యూజర్లకు చేరవేస్తుంది. తాజా వార్తల కోసం సోషల్ మీడియా ఖాతాలతో కనెక్ట్ అవ్వండి. మీకు ఏదైనా వార్త నచ్చితే లైక్ చేయండి. కామెంట్ చేయడం మర్చిపోవద్దు. అలానే మీతోటి స్నేహితులతో ఈ వార్తను పంచుకోగలరు.


Click it and Unblock the Notifications