Home
Mobile

5,500mAh బ్యాటరీ, ఆండ్రాయిడ్‌ 14 సహా కీలక ఫీచర్లతో వివో స్మార్ట్‌ఫోన్... లాంచ్, స్పెసిఫికేషన్ల వివరాలు..!

ప్రముఖ స్మార్ట్‌ ఫోన్ల తయారీ సంస్థ వివో త్వరలో భారత్‌ మార్కెట్‌లో కొత్త హ్యాండ్‌సెట్‌ను విడుదల చేయనుంది. ఇటీవలే వివో నుంచి వివో T3X స్మార్ట్‌ఫోన్‌ లాంచ్ అయింది. త్వరలో వివో V30e స్మార్ట్‌ఫోన్ (Vivo V30e) మే నెల 2వ తేదీ 12 గంటలకు భారత్‌లో విడుదల కానుంది. ఈ హ్యాండ్‌సెట్‌కు సంబంధించిన కొన్ని ఫీచర్లు, స్పెసిఫికేషన్లు వివరాలు వెల్లడయ్యాయి.

వివో V30e స్మార్ట్‌ఫోన్‌ అంచనా స్పెసిఫికేషన్‌లు :
ఈ వివో 30e స్మార్ట్‌ ఫోన్‌ ఆకర్ణణీయమైన డిజైన్‌తో లాంచ్ కానుంది. మరియు వెనుకవైపు వృత్తాకార కెమెరా మాడ్యుల్‌ను కలిగి ఉంటుంది. డ్యూయల్‌ కెమెరాలు సహా ఫ్లాష్‌తో రానుంది. వివో V సిరీస్‌ లో ప్రధానంగా నాణ్యమైన కెమెరాలను కలిగి ఉంటుంది. తక్కువ వెలుతురులోనూ ఆకట్టుకొనేలా ఫోటోలను క్యాప్చర్ చేయవచ్చు.

Vivo V30e Smartphone launching on may 2 in india here are the expected specs

దీంతోపాటు ఈ వివో V30e హ్యాండ్‌సెట్ క్వాల్‌కాం స్నాప్‌ డ్రాగన్‌ 6 జెన్ 1 చిప్‌సెట్‌ను కలిగి ఉండే అవకాశం ఉంది. మరియు 8GB ర్యామ్‌తో జతచేయబడి ఉంది. ఆండ్రాయిడ్ 14 ఆధారిత FuntouchOS పైన పనిచేస్తుంది. మరియు 44w ఫాస్ట్ ఛా‌ర్జింగ్‌ సపోర్టుతో 5500mAh బ్యాటరీ సామర్థ్యాన్ని కలిగి ఉంటుందని తెలుస్తోంది.

అయితే ఇప్పటికే వచ్చిన కొన్ని లీక్‌ల ఆధారంగా ఈ వివో V30e హ్యాండ్‌సెట్‌ 3D కర్వడ్‌ డిస్‌ప్లేను కలిగి ఉంటుంది. మరియు సన్నని డిజైన్‌తో వస్తుంది. కొన్ని నివేదికల ప్రకారం సోనీ IMX882 కెమెరాను కలిగి ఉండే అవకాశం ఉంది. ఈ కెమెరా OIS (ఆప్టికల్‌ ఇమేజ్‌ స్టెబిలైజేషన్‌) సపోర్టును కలిగి ఉంటుంది. మరియు 50MP Ai AF సెల్ఫీ కెమెరాను కలిగి ఉంటుందని తెలుస్తోంది.

ఈ వివో నుంచి త్వరలో అందుబాటులోకి రానున్న హ్యాండ్‌సెట్ 8GB ర్యామ్ + 12GB స్టోరేజీ మరియు 8GB ర్యామ్ + 256GB స్టోరేజీ తో లాంచ్ కానుంది. మైక్రో SD కార్డు ద్వారా స్టోరేజీని పెంచుకోవచ్చు. ఇన్‌ డిస్‌ప్లే ఫింగర్‌ ప్రింట్‌ సెన్సార్ ను కలిగి ఉంటుంది. ఈ స్పెసిఫికేషన్లలో కొన్నింటిపై వివో అధికారిక ప్రకటన చేయాల్సి ఉంది.

వివో V30e 5G స్మార్ట్‌ఫోన్‌ IP64 డస్ట్‌ మరియు వాటర్‌ రెసిస్టెంత్‌తో లాంచ్ కానుంది. మరియు కనెక్టివిటీ పరంగా వైఫై, బ్లూటూత్‌ 5.1, GPS, USB-C ఛార్జింగ్ సపోర్టును పొందనుంది. ఈ వివో V30e హ్యాండ్‌సెట్‌ బ్లూ గ్రీన్‌, బ్రౌన్‌ రెడ్‌ రంగుల్లో అందుబాటులో ఉండే అవకాశం ఉంది. వివో V30e స్మార్ట్‌ఫోన్‌ Vivo.com మరియు ఫ్లిప్‌కార్ట్‌ ద్వారా మే 2వ తేదీ అనంతరం కొనుగోలు చేయవచ్చు.

గిజ్‌బాట్‌ తెలుగు వెబ్‌సైట్ గ్యాడ్జెట్లు సహా ఇతర టెక్‌ న్యూస్‌కు సంబంధించిన ఆసక్తికరమైన తాజా వార్తలను అందిస్తుంది. వివిధ సోషల్ మీడియాల ద్వారా సరికొత్త వార్తలను ఎప్పటికప్పుడు యూజర్లకు చేరవేస్తుంది. తాజా వార్తల కోసం సోషల్‌ మీడియా ఖాతాలతో కనెక్ట్ అవ్వండి. మీకు ఏదైనా వార్త నచ్చితే లైక్ చేయండి. కామెంట్ చేయడం మర్చిపోవద్దు. అలానే మీతోటి స్నేహితులతో ఈ వార్తను పంచుకోగలరు.

More from GizBot

Best Mobiles in India

English summary
Vivo V30e Smartphone launching on may 2 in india here are the expected specs
Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
X