50MP సెల్ఫీ కెమెరా, 5500mAh బ్యాటరీ Vivo స్మార్ట్‌ఫోన్ సేల్ ప్రారంభం అయింది.. 10 శాతం డిస్కౌంట్..!
వివో సంస్థ ఇటీవల విడుదలైన వివో V30e స్మార్ట్‌ఫోన్ (Vivo V30e Smartphone Sale) కొనుగోలు చేసేందుకు అందుబాటులోకి వచ్చింది. ఈ హ్యాండ్‌సెట్ మెరుగైన ఫీచర్లు, స్పెసిఫికేషన్లను కలిగి ఉంది. 3D కర్వడ్ డిస్‌ప్లే, 5500mAh బ్యాటరీ, 50MP సోనీ కెమెరాను కలిగి ఉంది.
వివో V30e స్మార్ట్‌ఫోన్ 8GB ర్యామ్ + 128GB స్టోరేజీ వేరియంట్ ధర రూ.27,999 గా ఉంది. అదే 8GB ర్యామ్ +256GB అంతర్గత స్టోరేజీ వేరియంట్ ధర రూ.29,999 గా ఉంది. ఈ హ్యాండ్‌సెట్‌ను వివో ఇండియా ఆన్‌లైన్ స్టోర్, ప్రముఖ ఈ-కామర్స్ సంస్థ ఫ్లిప్‌కార్ట్, ఇతర స్టోర్‌ల నుంచి కొనుగోలు చేయవచ్చు.

ఈ వివో హ్యాండ్‌సెట్‌ను ఆన్‌లైన్ ద్వారా HDFC, SBI కార్డుల ద్వారా కొనుగోలు చేస్తే 10 శాతం తక్షణ డిస్కౌంట్‌ను పొందవచ్చు. అదే స్టోర్‌ల నుంచి కొనుగోలు చేస్తే.. ICICI, SBI, IDFC, సహా మరికొన్ని బ్యాంకులపై 10 శాతం డిస్కౌంట్‌ను పొందవచ్చు.
NBFC భాగస్వామ్య బ్యాంకుల ద్వారా కొనుగోలు చేస్తే 12 నెలల వడ్డీ లేని EMI ప్రయోజనాలను పొందవచ్చు. ఈ వివో V30e స్మార్ట్ ఫోన్ సిల్క్ బ్లూ, వెల్ వెట్ రెడ్ వంటి రెండు రంగుల్లో కొనుగోలు చేసేందుకు అందుబాటులో ఉంది.
వివో V30e స్మార్ట్‌ఫోన్ స్పెసిఫికేషన్లు :
వివో V30e స్మార్ట్‌ఫోన్ 6.78 అంగుళాల కర్వడ్ అమోలెడ్ FHD+ డిస్‌ప్లేను కలిగి ఉంది. 2400*1080 పిక్సల్ రిజల్యూషన్, 120Hz రీఫ్రెష్ రేట్‌ను కలిగి ఉంది. ఈ డిస్‌ప్లే ద్వారా మెరుగైన విజువల్ అనుభూతిని పొందవచ్చు. ఈ హ్యాండ్‌సెట్ IP64 రేటింగ్‌తో వాటర్, డస్ట్ రెసిస్టెంట్‌గా వస్తుంది.
ఈ హ్యాండ్‌సెట్ ఆండ్రాయిడ్ 14 ఆధారిత Funtouch OS 14 పైన పనిచేస్తుంది. మరియు ఆక్టాకోర్ స్నాప్ డ్రాగన్ 6 జెన్ 1 SoC చిప్‌సెట్‌ను కలిగి ఉంటుంది. అడెన్నో 710 GPU మరియు గరిష్ఠంగా 8GB LPDDR4x ర్యామ్ మరియు 256GB UFS 2.2 స్టోరేజీతో జతచేయబడి ఉంటుంది.
మైక్రో SD కార్డు ద్వారా స్టోరేజీని పెంచుకొనే అవకాశం ఉంది. ఈ వివో V30e స్మార్ట్‌ఫోన్ 3 సంవత్సరాలపాటు ఆండ్రాయిడ్ అప్‌డేట్‌లు, 4 సంవత్సరాలపాటు సెక్యూరిటీ అప్‌డేట్‌లు పొందనుంది. ఈ ఫోన్ 8GB ర్యామ్ + 128GB స్టోరేజీ మరియు 8GB ర్యామ్ +256GB అంతర్గత స్టోరేజీ వేరియంట్లలో అందుబాటులో ఉంది.
కెమెరా విభాగం పరంగా వెనుకవైపు డ్యూయల్ కెమెరాలను కలిగి ఉంది. OIS (ఆప్టికల్ ఇమేజ్ స్టెబిలైజేషన్) సపోర్టు, f/1.79 అపేచర్‌తో 50MP సోనీ IMX882 ప్రైమరీ కెమెరా, f/2.2 అపేచర్‌తో 8MP అల్ట్రావైడ్ కెమెరాను కలిగి ఉంది. సెల్ఫీ, వీడియో కాల్స్ కోసం f/2.45 అపేచర్‌తో 50MP కెమెరాను కలిగి ఉంది.
ఈ వివో ఫోన్ 44W ఛార్జింగ్ సపోర్టుతో 5500mAh బ్యాటరీ సామర్థ్యాన్ని కలిగి ఉంటుంది. కనెక్టివిటీ పరంగా బ్లూటూత్ 5.1, Wi-Fi 6, USB-C ఛార్జింగ్ పోర్టు సహా మరిన్ని సెన్సార్లు, కనెక్టివిటీ ఫీచర్లను కలిగి ఉంది. ఇవాళ్టి నుంచి ఫ్లిప్‌కార్టులో కొనుగోలుకు అందుబాటులో ఉంది.


Click it and Unblock the Notifications








