6.78 అంగుళాల డిస్‌ప్లే, 5500mAh బ్యాటరీతో వివో కొత్త హ్యాండ్‌సెట్.. మే 2న విడుదల..??
వివో నుంచి మే 2వ తేదీన భారత్ మార్కెట్‌లో వివో V30e (Vivo V30e Smartphone) స్మార్ట్ ఫోన్ విడుదల కానుంది. అయితే ఈ హ్యాండ్ సెట్ కు సంబంధించిన అనేక ఫీచర్లు, స్పెసిఫికేషన్లు లీక్ అయ్యాయి. మే రెండో వారం నుంచి ఈ హ్యాండ్ సెట్ కొనుగోలుకు అందుబాటులోకి వచ్చే అవకాశం ఉంది.
వివో V30e స్మార్ట్ ఫోన్ అంచనా స్పెసిఫికేషన్లు :
ఈ వివో V30e స్మార్ట్ ఫోన్ 6.78 అంగుళాల పుల్ HD + కర్వడ్ అమోలెడ్ డిస్‌ప్లేను కలిగి ఉంటుందని తెలుస్తోంది. 120Hz రీఫ్రెష్ రేట్‌తో లాంచ్ అయ్యే అవకాశం ఉంది.
స్నాప్ డ్రాగన్ చిప్‌సెట్ : ఆండ్రాయిడ్ 14 ఆధారిత Funtouch OS 14 పైన పనిచేస్తుందని తెలుస్తోంది. దీంతోపాటు ఈ వివో V30e హ్యాండ్ సెట్ స్నాప్ డ్రాగన్ 6 జెన్ 1 ప్రాసెసర్ ను కలిగి ఉంటుందని సమాచారం. అయితే సంస్థ ఎటువంటి అధికారిక ప్రకటన చేయలేదు.

50MP ప్రైమరీ కెమెరా, 32MP సెల్ఫీ కెమెరా..! :
కెమెరా విభాగం పరంగా ఈ వివో కొత్త హ్యాండ్ సెట్ వృత్తాకార కెమెరా మాడ్యుల్‌ను కలిగి ఉంటుంది. వెనుక వైపు డ్యూయల్ కెమెరాలు సహా ఫ్లాష్ లైట్‌తో లాంచ్ కానుంది. 50MP ప్రైమరీ కెమెరా, 8MP అల్ట్రావైడ్ యాంగిల్ కెమెరా కలిగి ఉండే అవకాశం ఉంది. మరియు సెల్ఫీ, వీడియోల కోసం 32MP కెమెరాతో లాంచ్ కానుందని తెలుస్తోంది.
5500mAh బ్యాటరీ సామర్థ్యం! :
వివో V30e స్మార్ట్ ఫోన్ 44W వైర్ ఫాస్ట్ ఛార్జింగ్ సపోర్టుతో 5500mAh బ్యాటరీని కలిగి ఉంటుందని తెలుస్తోంది. ఫలితంగా వేగంగా ఛార్జింగ్ చేయవచ్చని తెలుస్తోంది. Velvet రెడ్ మరియు సిల్కీ బ్లూ రంగుల్లో కొనుగోలుకు అందుబాటులో ఉంటుందని తెలుస్తోంది.

వివో కొత్త ఫోన్ ధర ఎంతంటే? :
ఈ వివో V30e హ్యాండ్ సెట్ 8GB ర్యామ్‌తో 128GB లేదా 256GB స్టోరేజీ వేరియంట్‌లలో అందుబాటులోకి వచ్చే అవకాశం ఉంది. మరియు ధర రూ.25,000 నుంచి రూ.30,000 మధ్యన ఉంటుందని తెలుస్తోంది. విడుదల రోజున ధరపై స్పష్టత రానుంది.
దీంతోపాటు ఈ వివో కొత్త హ్యాండ్ సెట్ సరికొత్త ఫీచర్‌ను కలిగి ఉంటుందని తెలుస్తోంది. తడి చేతులతో కూడా సౌకర్యవంతంగా వినియోగించుకొనే అవకాశం ఉంటుందని సమాచారం. ఈ హ్యాండ్ సెట్ 7.65 అంగుళాల థిక్ నెస్‌ను కలిగి ఉంటుంది. అయితే స్పెసిఫికేషన్లు కొన్నింటిపై అధికారిక ప్రకటన రావాల్సి ఉంది.
గిజ్‌బాట్ తెలుగు వెబ్ సైట్ గ్యాడ్జెట్లు సహా ఇతర టెక్ న్యూస్‌కు సంబంధించిన ఆసక్తికరమైన తాజా వార్తలను అందిస్తుంది. వివిధ సోషల్ మీడియాల ద్వారా సరి కొత్త వార్తలను ఎప్పటికప్పుడు యూజర్లకు చేరవేస్తుంది. తాజా వార్తల కోసం సోషల్ మీడియా ఖాతాలతో కనెక్ట్ అవ్వండి. మీకు ఏదైనా వార్త నచ్చితే లైక్ చేయండి. కామెంట్ చేయడం మర్చిపోవద్దు. అలానే మీతోటి స్నేహితులతో ఈ వార్తను పంచుకోగలరు.


Click it and Unblock the Notifications