Home
Mobile

50MP సెల్ఫీ కెమెరా తో Vivo V30e ఇండియా లో లాంచ్! ధర, స్పెసిఫికేషన్లు,సేల్ ఆఫర్లు

Vivo సంస్థ ప్రకటించినట్లుగానే V సిరీస్‌ లో కంపెనీ యొక్క తాజా ఫోన్ V30e ని భారతదేశంలో లాంచ్ చేసింది. ఇది పంచ్-హోల్ లోపల 50MP eye AF కెమెరాతో 6.78-అంగుళాల పూర్తి HD+ 120Hz కర్వ్డ్ అమోలెడ్ స్క్రీన్‌ తో వస్తుంది.

ఇది Android 14-ఆధారిత Funtouch OS 14ని తీసుకు వస్తుంది మరియు 3 తరాల ఆండ్రాయిడ్ అప్డేట్ లు మరియు 4 సంవత్సరాల సెక్యూరిటీ అప్డేట్ లను అందించనున్నట్లు సంస్థ ప్రకటించింది.

Vivo V30e With 50MP eye AF Selfie Camera

ఈ ఫోన్ సిల్క్ బ్లూ కలర్‌లో వస్తుంది, ఇది ఒక విలాసవంతమైన అనుభూతిని అందిస్తుంది మరియు వెల్వెట్ రెడ్ వెల్వెట్ కలర్‌ ఒక ప్రత్యేకమైన స్పర్శ అనుభూతిని కలిగి ఉంది, ఇది హై-క్లాస్ ఫీలింగ్‌తో అద్భుతమైన డిజైన్ కలిగి ఉంటుందని కంపెనీ తెలిపింది.

Vivo V30e స్పెసిఫికేషన్ల వివరాలు
ఈ స్మార్ట్‌ఫోన్‌ 6.78-అంగుళాల (2400 × 1080 పిక్సెల్‌లు) పూర్తి HD+ 120Hz రిఫ్రెష్ రేట్‌తో కర్వ్ అమోలెడ్ స్క్రీన్ ని కలిగి ఉంటుంది. ఇది ఆక్టా కోర్ స్నాప్‌డ్రాగన్ 6 Gen 1 4nm ప్రాసెసర్ మొబైల్ ప్లాట్‌ఫారమ్‌తో అడ్రెనో 710 GPU ను కలిగి ఉంటుంది. 8GB LPDDR4x RAM, 128GB / 256GB (UFS 2.2) స్టోరేజీ, మైక్రో SDతో విస్తరించదగిన మెమరీ ఫీచర్ కూడా ఉంది. ఇంకా, ఇది హైబ్రిడ్ డ్యూయల్ సిమ్ (నానో + నానో / మైక్రో SD) తో వస్తుంది.

ఇక కెమెరా వివరాలు గమనిస్తే, f/1.78 ఎపర్చరుతో 50MP వెనుక కెమెరా, Sony IMX882 సెన్సార్, OIS, f/2.2 ఎపర్చరుతో 8MP అల్ట్రా-వైడ్ కెమెరా, 120° FoV, ఆరా లైట్, 4K వీడియో రికార్డింగ్ ఉంది. ఇంకా, f/2.45 ఎపర్చరు, 82° FoV, 4K వీడియో రికార్డింగ్‌తో 50MP eye AF ఫ్రంట్ ఫేసింగ్ సెల్ఫీ కెమెరా ఉంది.

ఇన్-డిస్ప్లే ఫింగర్ ప్రింట్ సెన్సార్, USB టైప్-సి ఆడియో పోర్ట్, డస్ట్ మరియు వాటర్ రెసిస్టెంట్ (IP64) రేటింగ్, 5G, డ్యూయల్ 4G VoLTE, Wi-Fi 6 802.11 ax (2.4GHz + 5GHz), బ్లూటూత్ 5.1, GPS/ GLONASS/ Beidou, USB టైప్-C USB 2.0 వంటి కనెక్టివిటీ ఫీచర్ లు ఉన్నాయి.

ఈ స్మార్ట్‌ఫోన్‌ 44W ఫాస్ట్ ఛార్జింగ్‌తో 5500mAh బ్యాటరీ కలిగి ఉంది. 164.36×74.75×7.75mm (వెల్వెట్ రెడ్) / 7.65mm (సిల్క్ బ్లూ) కొలతలతో, 188g (వెల్వెట్ రెడ్), 179 గ్రా (సిల్క్ బ్లూ) బరువు తో వస్తుంది.

ధర మరియు లభ్యత వివరాలు
vivo V30e స్మార్ట్‌ఫోన్‌ ధర 8GB + 128GB మోడల్‌కు రూ. 27,999 మరియు 8GB + 256GB మోడల్ ధర రూ. 29,999 గా ఉంది.

ఈ ఫోన్ ఇప్పుడు ప్రీ ఆర్డర్ చేయడానికి అందుబాటులో ఉంది మరియు మే 9 నుండి vivo ఇండియా ఇ-స్టోర్, ఫ్లిప్‌కార్ట్ మరియు అన్ని భాగస్వామి రిటైల్ స్టోర్‌ల నుండి ఆఫ్‌లైన్‌లో అందుబాటులో ఉంటుంది.

ఆఫర్ల వివరాలు
ఆఫ్‌లైన్ ఆఫర్లు గమనిస్తే, ICICI, SBI, IndusInd, IDFC మరియు ఇతర బ్యాంకులతో ఫ్లాట్ 10% తక్షణ తగ్గింపు ఆఫర్ ఉంది. ఎంచుకున్న NBFC భాగస్వాములతో 12 నెలల వరకు జీరో డౌన్ పేమెంట్ ఆప్షన్ కూడా ఉంది.

ఇక ఆన్‌లైన్ ఆఫర్లు గమనిస్తే, HDFC మరియు SBI బ్యాంకులతో ఫ్లాట్ 10% తక్షణ తగ్గింపు ఉంటుంది.

More from GizBot

Best Mobiles in India

English summary
Vivo V30e With 50MP eye AF Selfie Camera,Snapdragon 6 Gen 1 SoC Processor Launched In India. Price And Specifications
Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
X