Home
Mobile

50MP సెల్ఫీ కెమెరా, 5500mAh బ్యాటరీ వివో 5G స్మార్ట్‌ఫోన్‌ సేల్ ప్రారంభం.. 10 శాతం క్యాష్‌బ్యాక్‌..!

వివో నుంచి ఇటీవల భారత్‌ (Vivo India) మార్కెట్లోకి వివో V40 సిరీస్‌ స్మార్ట్‌ ఫోన్‌ లు విడుదల అయ్యాయి. ఈ సిరీస్‌ లో భాగంగా వివో V40 (Vivo V40 5G Smartphone Sale), వివో V40 ప్రో స్మార్ట్‌ఫోన్‌ లు అందుబాటులోకి వచ్చాయి. ఇవాళ్టి నుంచి బేస్ వేరియంట్ సేల్‌ ప్రారంభం కానుంది. ఈ హ్యాండ్‌సెట్‌ క్వాల్‌ కామ్‌ స్నాప్‌ డ్రాగన్‌ 7 జెన్‌ 3 చిప్‌ సెట్‌ పైన పనిచేస్తుంది. 50MP సెల్ఫీ కెమెరా, 5500mAh బ్యాటరీని కలిగి ఉంది.

వివో V40 స్మార్ట్‌ఫోన్ ధర :
వివో V40 స్మార్ట్‌ఫోన్‌ 8GB ర్యామ్‌ + 128GB స్టోరేజీ వేరియంట్ ధర రూ.34,999 గా ఉంది. అదే 8GB ర్యామ్ + 256GB స్టోరేజీ వేరియంట్ ధర రూ.36,999, 12GB ర్యామ్ + 512GB స్టోరేజీ వేరియంట్ ధర రూ.41,999 గా ఉంది.

Vivo V40 5G Smartphone sale

ప్రారంభ ఆఫర్‌ లో భాగంగా వివో V40 స్మార్ట్‌ ఫోన్ 5G 10 శాతం డిస్కౌంట్‌ ను పొందవచ్చు. Ganges బ్లూ, లోటస్‌ పర్పుల్‌, టైటానియం గ్రే రంగుల్లో లభిస్తుంది. ఫ్లిప్‌ కార్ట్‌ ద్వారా కొనుగోలు చేయవచ్చు. వివో అధికారిక వెబ్‌సైట్‌ ద్వారా కొనుగోలు చేయవచ్చు.

వివో V40 స్మార్ట్‌ఫోన్‌ స్పెసిఫికేషన్‌లు :
వివో V40 స్మార్ట్‌ఫోన్‌ హ్యాండ్‌సెట్‌ 6.78 అంగుళాల పుల్‌ HD+ అమోలెడ్‌ డిస్‌ప్లే తో అందుబాటులో ఉంది. 1260*2800 పిక్సల్ రిజల్యూషన్‌, 120Hz రీఫ్రెష్‌ రేట్‌, 4500 నిట్స్‌ గరిష్ఠ బ్రైట్‌నెస్‌ను కలిగి ఉంది. ఆండ్రాయిడ్‌ 14 ఆధారిత FuntouchOS 14, 4nm క్వాల్‌కామ్‌ స్నాప్‌డ్రాగన్‌ 7 జెన్‌ 3 SoC చిప్‌సెట్‌ పైన పనిచేస్తుంది.

కెమెరా విభాగం పరంగా హ్యాండ్‌సెట్‌ Zeiss బ్రాండ్‌తో కెమెరాలను కలిగి ఉంది. ఆటోఫోకస్‌, OIS (ఆప్టికల్‌ ఇమేజ్ స్టెబిలైజేషన్‌) 50MP ప్రధాన కెమెరా, 50MP వైడ్‌ యాంగిల్‌ కెమెరాను కలిగి ఉంది. సెల్ఫీ, వీడియో కాల్స్‌ కోసం 50MP కెమెరాతో అందుబాటులోకి వచ్చింది.

వివో V40 స్మార్ట్‌ఫోన్‌ 80W వైర్‌ ఫాస్ట్‌ ఛార్జింగ్ సపోర్టుతో 5500mAh బ్యాటరీ పైన పనిచేస్తుంది. భద్రత కోసం ఇన్‌ డిస్‌ప్లే ఫింగర్ ప్రింట్‌ సెన్సార్‌ను కలిగి ఉంది. IP68 రేటింగ్‌తో డస్‌, వాటర్ రెసిస్టెంట్‌గా అందుబాటులోకి వచ్చాయి. కనెక్టివిటీ పరంగా 5G, బ్లూటూత్‌ 5.3, GPS, Beidou, Galileo, Glonass, వైఫై, USB-C చార్జింగ్ పోర్టు, యాక్సిలిరోమీటర్, యాంబియంట్‌ లైట్‌ సెన్సార్, ఈ-కంపాస్‌, గైరోస్కోప్‌, ప్రాక్సిమిటీ వంటి సెన్సార్‌లను కలిగి ఉన్నాయి.

గిజ్‌బాట్‌ తెలుగు వెబ్‌సైట్ గ్యాడ్జెట్లు సహా ఇతర టెక్‌ న్యూస్‌కు సంబంధించిన ఆసక్తికరమైన తాజా వార్తలను అందిస్తుంది. వివిధ సోషల్ మీడియాల ద్వారా సరికొత్త వార్తలను ఎప్పటికప్పుడు యూజర్లకు చేరవేస్తుంది. తాజా వార్తల కోసం సోషల్‌ మీడియా ఖాతాలతో కనెక్ట్ అవ్వండి. మీకు ఏదైనా వార్త నచ్చితే లైక్ చేయండి. కామెంట్ చేయడం మర్చిపోవద్దు. అలానే మీతోటి స్నేహితులతో ఈ వార్తను పంచుకోగలరు.

More from GizBot

Best Mobiles in India

English summary
Vivo V40 5G Smartphone sale is live specs features and sale deals
Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
X