6.67 అంగుళాల డిస్‌ప్లే, ట్రిపుల్ కెమెరాతో వివో కొత్త ఫోన్... లాంచ్, స్పెసిఫికేషన్ల వివరాలు..!
వివో నుంచి త్వరలో కొత్త స్మార్ట్‌ఫోన్ విడుదల కానుందని తెలుస్తోంది. తాజాగా వివో V40 SE 5G స్మార్ట్‌ఫోన్ వెబ్‌సైట్‌లో లిస్టింగ్ అయింది. ఈ ఫోన్ మెరుగైన ఫీచర్లను కలిగి ఉంటుందని తెలుస్తోంది. ఫాస్ట్ ఛార్జింగ్ సపోర్టుతో 5000mAh బ్యాటరీ, క్వాల్‌కాం స్నాప్ డ్రాగన్ 4 జెన్ 2 చిప్‌సెట్ పైన పనిచేస్తుందని తెలుస్తోంది. దీంతోపాటు సింగిల్ ఛార్జింగ్‌తో 16 గంటలపాటు యూట్యూబ్‌ను వినియోగించవచ్చని సంస్థ చెబుతోంది.
వివో V40 SE 5G స్పెసిఫికేషన్లు :
వివో V40 SE 5G స్మార్ట్‌ఫోన్ (Vivo V40 SE 5G Smartphone Specifications) 2400*1080 పిక్సల్ రిజల్యూషన్‌తో 6.67 అంగుళాల పుల్ HD+ అమోలెడ్ డిస్‌ప్లేను కలిగి ఉంటుంది. మరియు 120Hz రీఫ్రెష్ రేట్, 1800 నిట్స్ గరిష్ఠ బ్రైట్‌నెస్, 394ppi పిక్సల్ డెన్సిటితో లాంచ్ కానుంది.

ఈ ఫోన్ ఆండ్రాయిడ్ 14 ఆధారిత FuntouchOS 14 పైన పనిచేస్తుంది. మరియు 4nm ఆక్టాకోర్ స్నాప్ డ్రాగన్ 4 జెన్ 2 SoC చిప్‌సెట్‌ను కలిగి ఉంటుంది. 8GB LPDDR4X తో జతచేయబడుతుంది. వర్చువల్‌గా అదనంగా 8GB వరకు విస్తరించుకోవచ్చు. ఈ ఫోన్ 256GB UFS 2.2 గరిష్ఠ స్టోరేజీని కలిగి ఉంటుంది. 1TB వరకు స్టోరేజీని పెంచుకోవచ్చు.
ఈ వివో V40 SE 5G స్మార్ట్‌ఫోన్ వెనుకవైపు ట్రిపుల్ కెమెరాలను కలిగి ఉంటుంది. 50MP ప్రైమరీ కెమెరా, 8MP అల్ట్రావైడ్ యాంగిల్ కెమెరా, 2MP మ్యాక్రో కెమెరాలు సహా LED ఫ్లాష్ లైట్‌ను కలిగి ఉంటుంది. సెల్ఫీ, వీడియో కాల్స్ కోసం ఈ హ్యాండ్‌సెట్ 16MP కెమెరాను అమర్చారు. ఇందుకోసం పంచ్ హోల్ డిజైన్‌ను కలిగి ఉంటుంది. స్టోరేజీ వేరియంట్ల వివరాలు వెల్లడి కాలేదు.
ఈ వివో కొత్త ఫోన్ 44W ఫాస్ట్ ఛార్జింగ్ సపోర్టుతో 5000mAh బ్యాటరీని కలిగి ఉంటుంది. కేవలం 25 నిమిషాల్లో 50 శాతం ఛార్జింగ్‌ను పూర్తి చేస్తుందని సంస్థ చెబుతోంది. ఈ స్మార్ట్‌ఫోన్ IP54 రేటింగ్‌తో డస్ట్ మరియు స్ప్లాష్ రెసిస్టెన్స్‌తో వస్తుంది.
భద్రత కోసం ఈ హ్యాండ్‌సెట్ ఇన్ డిస్‌ప్లే ఫింగర్ ప్రింట్ సెన్సార్‌ను కలిగి ఉంటుంది. దీంతోపాటు 5G, వైఫై, బ్లూటూత్ 5.0, GPS, NFC మరియు USB-C ఛార్జింగ్ పోర్టును కలిగి ఉంటుంది. ర్యామ్, స్టోరేజీ వేరియంట్లపై వివరాలు వెల్లడి కాలేదు.
వివో V40 SE 5G స్మార్ట్‌ఫోన్ వివో EU వెబ్‌సైట్ మరియు వివో ఆస్ట్రేలియా వెబ్‌సైట్‌లో కనిపించింది. ఆయా దేశాల్లో ఈ హ్యాండ్‌సెట్ క్రిస్టల్ బ్లాక్ మరియు లెదర్ పర్పల్ రంగుల్లో అందుబాటులో ఉంటుంది. అయితే ఈ ఫోన్ భారత్ మార్కెట్‌లో లాంచ్ కానుందా లేదా అనే సమాచారాన్ని సంస్థ వెల్లడించలేదు.
గిజ్‌బాట్ తెలుగు వెబ్‌సైట్ గ్యాడ్జెట్లు సహా ఇతర టెక్ న్యూస్‌కు సంబంధించిన ఆసక్తికరమైన తాజా వార్తలను అందిస్తుంది. వివిధ సోషల్ మీడియాల ద్వారా సరికొత్త వార్తలను ఎప్పటికప్పుడు యూజర్లకు చేరవేస్తుంది. తాజా వార్తల కోసం సోషల్ మీడియా ఖాతాలతో కనెక్ట్ అవ్వండి. మీకు ఏదైనా వార్త నచ్చితే లైక్ చేయండి. కామెంట్ చేయడం మర్చిపోవద్దు. అలానే మీతోటి స్నేహితులతో ఈ వార్తను పంచుకోగలరు.


Click it and Unblock the Notifications








