Home
Mobile

50MP+ 50MP+ 50MP కెమెరాలు, 5500mAh బ్యాటరీతో స్మార్ట్‌ఫోన్‌ విడుదల.. ధర, ఫీచర్‌లు, సేల్‌ వివరాలు..!

ప్రముఖ స్మార్ట్‌ఫోన్‌ల తయారీ సంస్థ Vivo భారత్‌లో తన కొత్త V సిరీస్‌ ను విడుదల చేసింది. భారత్‌ మార్కెట్‌లో ఇవాళ వివో V40 సిరీస్‌ (Vivo V40 Series Smartphone Launched) విడుదల అయింది. ఈ సిరీస్‌లో భాగంగా వివో V40 మరియు V40 ప్రో స్మార్ట్‌ఫోన్‌లు ఉన్నాయి. ఈ హ్యాండ్‌సెట్‌లు Zeiss బ్రాండ్‌ కెమెరాలను కలిగి ఉంది. మరియు 5500mAh బ్యాటరీతో పనిచేస్తుంది. ఈ ఫోన్‌లు ఆకట్టుకొనే డిజైన్‌తో అందుబాటులోకి వచ్చాయి.

వివో V40 స్మార్ట్‌ఫోన్‌ స్పెసిఫికేషన్‌లు :
ఈ స్మార్ట్‌ ఫోన్‌ (Vivo V40 Smartphone) 6.78 అంగుళాల పుల్‌ HD+ (1260*2800 పిక్సల్‌ ) అమోలెడ్‌ డిస్‌ప్లేను కలిగి ఉంటుంది. 120Hz రీఫ్రెష్‌ రేట్‌, 4500 నిట్స్‌ గరిష్ఠ బ్రైట్‌నెస్‌తో లాంచ్‌ అయింది.

Vivo V40 Series Smartphones launched in india

ఈ హ్యాండ్‌ సెట్ ఆండ్రాయిడ్‌ 14 ఆధారిత Funtouch OS 14 పైన పనిచేస్తుంది. మరియు 4nm క్వాల్‌కామ్‌ స్నాప్‌డ్రాగన్‌ 7 జెన్‌ 3 SoC చిప్‌ సెట్‌ పైన పనిచేస్తుంది. 12GB ర్యామ్ మరియు 512GB స్టోరేజీ తో జతచేయబడుతుంది.

కెమెరా విభాగం పరంగా ఈ బేస్‌ వేరియంట్‌ వెనుక వైపు Zeiss బ్రాండ్‌ డ్యూయల్‌ కెమెరాలను కలిగి ఉంది. ఆటోఫోకస్‌, OIS (ఆప్టికల్‌ ఇమేజ్ స్టెబిలైజేషన్‌) 50MP ప్రధాన కెమెరా, 50MP వైడ్‌ యాంగిల్‌ కెమెరాను కలిగి ఉంది. సెల్ఫీ, వీడియో కాల్స్‌ కోసం 50MP కెమెరాను కలిగి ఉంది.

Vivo V40 Series Smartphones launched in india

వివో V40 ప్రో స్మార్ట్‌ఫోన్‌ స్పెసిఫికేషన్‌లు :
స్మార్ట్‌ఫోన్‌ 6.78 అంగుళాల పుల్‌ HD+ (1260*2800) అమోలెడ్‌ డిస్‌ప్లేను కలిగి ఉంటుంది. 120Hz రీఫ్రెష్‌ రేట్‌, 4500 నిట్స్‌ గరిష్ఠ బ్రైట్‌నెస్‌తో లాంచ్‌ అయింది. ఆండ్రాయిడ్‌ 14 ఆధారిత Funtouch OS 14 పైన పనిచేస్తుంది. మీడియాటెక్‌ డైమెన్సిటీ 9200+ చిప్‌సెట్‌ ను కలిగి ఉంది. 12GB ర్యామ్, గరిష్ఠంగా 512GB స్టోరేజీతో జతచేయబడింది.

కెమెరా విభాగం పరంగా zeiss బ్రాండ్‌తో ట్రిపుల్ కెమెరా, Aura లైట్‌ ఫ్లాష్‌ను కలిగి ఉంది. OIS (ఆప్టికల్‌ ఇమేజ్ స్టెబిలైజేషన్‌), ఆటోఫోకస్‌ సామర్థ్యంతో 50MP సోనీ IMX921 ప్రైమరీ కెమెరాను కలిగి ఉంది. మరియు 50MP వైడ్‌ యాంగిల్ కెమెరా, 2x ఆప్టికల్‌ జూమ్, 50MP డిజిటల్‌ జూమ్‌ సామర్థ్యంతో 50MP సోనీ IMX816 టెలిఫోటో పొర్ట్రెయిట్‌ కెమరాను కలిగి ఉంది. మరియు 50MP సెల్ఫీ కెమెరాను అమర్చారు.

ఈ రెండు స్మార్ట్‌ఫోన్‌లు 80W వైర్‌ ఫాస్ట్‌ ఛార్జింగ్ సపోర్టుతో 5500mAh బ్యాటరీని కలిగి ఉన్నాయి. భద్రత కోసం ఈ వివో V40 సిరీస్‌ హ్యాండ్‌సెట్‌లు ఇన్‌ డిస్‌ప్లే ఫింగర్ ప్రింట్‌ సెన్సార్‌ను కలిగి ఉంది. మరియు IP68 రేటింగ్‌తో డస్‌, వాటర్ రెసిస్టెంట్‌గా అందుబాటులోకి వచ్చాయి.

ఈ స్మార్ట్‌ఫోన్లు కనెక్టివిటీ పరంగా 5G, బ్లూటూత్‌ 5.3, GPS, Beidou, Galileo, Glonass, వైఫై, USB-C చార్జింగ్ పోర్టును కలిగి ఉన్నాయి. యాక్సిలిరోమీటర్, యాంబియంట్‌ లైట్‌ సెన్సార్, ఈ కంపాస్‌, గైరోస్కోప్‌, ప్రాక్సిమిటీ వంటి సెన్సార్‌లను కలిగి ఉన్నాయి.

వివో V40 సిరీస్‌ స్మార్ట్‌ఫోన్‌ ధర, సేల్‌ :
వివో V40 స్మార్ట్‌ఫోన్‌ 8GB ర్యామ్‌ + 128GB స్టోరేజీ వేరియంట్ ధర రూ.34,999 గా ఉంది. అదే 8GB ర్యామ్ + 256GB స్టోరేజీ వేరియంట్ ధర రూ.36,999 గా ఉంది.

అదే 12GB ర్యామ్ + 512GB స్టోరేజీ వేరియంట్ ధర రూ.41,999 గా ఉంది. ఇవాళ్టి నుంచే ముందస్తు బుకింగ్‌ (Pre Order) చేసుకోవచ్చు. ఆగస్టు 19 నుంచి సేల్‌ ప్రారంభం కానుంది. Ganges బ్లూ, లోటస్‌ పర్పుల్‌, టైటానియం గ్రే రంగుల్లో లభిస్తుంది.

వివో V40 ప్రో స్మార్ట్‌ఫోన్‌ 8GB ర్యామ్ + 256GB స్టోరేజీ వేరియంట్ ధర రూ.49,999, 12GB ర్యామ్ + 512GB స్టోరేజీ వేరియంట్ ధర రూ.55,999 గా ఉంది. Ganges బ్లూ, టైటానియం గ్రే రంగుల్లో లభించనుంది. ఈ స్మార్ట్‌ఫోన్‌ ఆగస్టు 13 నుంచి సేల్‌ ప్రారంభం కానుంది.

More from GizBot

Best Mobiles in India

English summary
Vivo V40 Series Smartphones launched in india Zeiss branded cameras features sale details
Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
X