ఇవాళ 50MP సెల్ఫీ కెమెరా, 5500mAh బ్యాటరీ స్మార్ట్‌ఫోన్ సేల్.. స్పెసిఫికేషన్‌లు, ధర వివరాలు..!
ప్రముఖ స్మార్ట్‌ఫోన్‌ల తయారీ సంస్థ వివో నుంచి ఇటీవల వివో V40e 5G హ్యాండ్‌సెట్ విడుదల అయింది. డిజైన్ పరంగా ఈ స్మార్ట్‌ఫోన్ ఆకట్టుకుంటుంది. ఈ హ్యాండ్‌సెట్ 6.77 అంగుళాల డిస్‌ప్లే, 5500mAh బ్యాటరీ, మీడియాటెక్ డైమెన్సిటీ 7300 చిప్‌సెట్ ను కలిగి ఉంది. వివో స్మార్ట్‌ఫోన్ సేల్ ఇవాళ్టి నుంచి ప్రారంభం కానుంది. ప్రముఖ ఇ-కామర్స్ ప్లాట్‌ఫాం ఫ్లిప్‌కార్ట్ ద్వారా కొనుగోలు చేయవచ్చు. ఈ హ్యాండ్‌సెట్ రెండు స్టోరేజీ, రెండు కలర్ వేరియంట్‌లో లభిస్తుంది.
వివో V40e 5G స్మార్ట్‌ఫోన్ ధర, సేల్ :
వివో V40e 5G స్మార్ట్‌ఫోన్ రెండు స్టోరేజీ వేరియంట్‌లలో అందుబాటులో ఉంది. 8GB ర్యామ్ + 128GB స్టోరేజీ ధర రూ.28,999 గా ఉంది. అదే 8GB ర్యామ్ + 256GB స్టోరేజీ వేరియంట్ ధర రూ.30,999 గా ఉంది. దీంతోపాటు SBI, HDFC బ్యాంకు కార్డుల ద్వారా 10 శాతం తగ్గింపు ధరకు కొనుగోలు చేయవచ్చు.

ప్రారంభ ఆఫర్‌లో భాగంగా 6 నెలలపాటు నో కాస్ట్ EMI సదుపాయం అందుబాటులో ఉంది. ఫ్లిప్‌కార్ట్, వివో అధికారిక స్టోర్‌లో కొనుగోలు చేయవచ్చు. ఈ వివో V40e స్మార్ట్‌ఫోన్ (Vivo V40e 5G Smartphone sale) మింట్ గ్రీన్, రాయల్ బ్రాంజ్ రంగుల్లో లభిస్తుంది.
వివో V40e 5G స్మార్ట్‌ఫోన్ స్పెసిఫికేషన్‌లు, ఫీచర్‌లు :
వివో V40e 5G స్మార్ట్‌ఫోన్ 6.77 అంగుళాల FHD+ (2392*1080 పిక్సల్స్) 3D కర్వ్ అమోలెడ్ డిస్‌ప్లేను కలిగి ఉంది. 120Hz రీప్రెష్ రేట్, HDR10+ సపోర్టుతో అందుబాటులో ఉంది. దీంతోపాటు వెట్ టచ్ ఫీచర్‌ను కలిగి ఉంది. ఈ ఫీచర్ ద్వారా తడి చేతులతోనూ వినియోగించుకోవచ్చు.
80W ఫాస్ట్ ఛార్జింగ్ సపోర్టు :
ఈ వివో స్మార్ట్‌ఫోన్ మీడియాటెక్ డైమెన్సిటీ 7300 చిప్‌సెట్‌తో పనిచేస్తుంది. 8GB LPDDR4X ర్యామ్ మరియు 256GB స్టోరేజీ వరకు UFS 2.2 తో జతచేయబడింది. ఈ V40e 5G హ్యాండ్‌సెట్ ఆండ్రాయిడ్ 14 ఆధారిత Funtouch OS 14 ను కలిగి ఉంది. ఈ వివో స్మార్ట్‌ఫోన్ 80W వైర్ ఫాస్ట్ ఛార్జింగ్ సపోర్టుతో 5500mAh బ్యాటరీ తో పనిచేస్తుంది.
50MP+ 2MP + 50MP సెల్ఫీ కెమెరాలు :
కెమెరా విభాగం పరంగా వివో V40e స్మార్ట్‌ఫోన్ ఆప్టికల్ ఇమేజ్ స్టెబిలైజేషన్ (OIS) సపోర్టుతో 50MP సోనీ IMX882 ప్రైమరీ కెమెరా, 8MP అల్ట్రావైడ్ కెమెరాను కలిగి ఉంది. ఈ కెమెరాల ద్వారా 4K నాణ్యతతో వీడియోలను రికార్డు చేయవచ్చు. సెల్ఫీ, వీడియో కాల్స్ కోసం ఈ హ్యాండ్‌సెట్ 50MP కెమెరాను అమర్చారు. AI ఎరేజర్, AI ఫొటో ఎన్‌హాన్స్ ఫీచర్లున్నాయి.
IP64 రేటింగ్‌తో :
కనెక్టివిటీ పరంగా డ్యూయల్ 5G, 4G LTE, వైఫై, GPS, OTG, బ్లూటూత్ 5.4, USB-C వంటి ఫీచర్లున్నాయి. భద్రత కోసం ఇన్ డిస్‌ప్లే ఫింగర్ ప్రింట్ సెన్సార్ ఉంది. IP64 రేటింగ్‌తో కూడిన డస్ట్ మరియు వాటర్ రెసిస్టెంట్‌గా ఉంది. ఈ హ్యాండ్‌సెట్ 183 గ్రాముుల బరువు ఉంటుంది.


Click it and Unblock the Notifications








