4జిబి ర్యామ్ ఫోన్‌పై భారీ డిస్కౌంట్

Written By:

ప్రముఖ చైనా దిగ్గజం వివో తన 'వీ5 ప్లస్' స్మార్ట్‌ఫోన్ రేటును భారీగా తగ్గించింది. దాదాపు రూ.3వేల వరకు తగ్గించింది. ఈ ఫోన్ విడుదలైనప్పుడు రూ.27,980 ధరకు లభ్యం కాగా, ఇప్పటి వరకు రూ.25,990 ధర ఉండేది. అయితే తాజాగా ఈ ధర రూ.3వేలు తగ్గడంతో ఇప్పుడు ఈ ఫోన్‌ను రూ.22,990 ధరకు వినియోగదారులు కొనుగోలు చేయవచ్చు.

రెండు ఫ్రంట్ కెమెరాలతో.. (Vivo V5 Plus రివ్యూ)

గిజ్‌బాట్ మరిన్ని అప్‌డేట్స్ ఇక్కడే

డిస్ ప్లే

వివో వీ 5 ప్లస్ 5.5 ఇంచ్ పుల్ హెచ్ డి డిస్ ప్లేతో 1080 పిక్సల్ తో వచ్చింది. 2.5 కర్వ్డ్ గ్లాస్ తో పాటు కార్నింగ్ గొరిల్లా గ్లాస్ 5 అదనపు ఆకర్షణగా నిలవనుంది.

ర్యామ్

వివో వీ 5 ప్లస్ 4జిబి ర్యామ్ తో వచ్చింది. ఇంటర్నల్ స్టోరేజి విషయానికొస్తే 64 జిబి ఆన్ బోర్డ్ స్టోరేజి ఉంటుంది. క్వాల్ కామ్ స్నాప్ డ్రాగన్ 625 ఆక్టాకోర్ చిప్ సెట్ ని ఇందులో పొందుపరిచారు.

కెమెరా

కెమెరా విషయానికొస్తే డ్యూయెల్ సెల్పీ కెమెరాతో ఫోన్ వచ్చింది. ఫ్రంట్ సైడ్ ఒకటి 8 ఎంపీ మరొకటి 20 ఎంపీ Sony IMX376 1/2.78-inch sensor సెల్పీ కెమెరాలు ఉంటాయి. బ్యాక్ సైడ్ 16 మెగాపిక్సల్ రియర్ కెమెరా విత్ ఎల్‌ఈడీ ఫ్లాష్ ఉంటుంది. 4కె వీడియో రికార్డింగ్ చేయవచ్చు

బ్యాటరీ

ఈ ఫోన్ బ్యాటరీ విషయానికొస్తే 3,160 mAh బ్యాటరీ. ఇది వివో డ్యూయెల్ ఛార్జింగ్ ఇంజిన్ టెక్నాలజీ మీద పనిచేస్తుంది. దీని ద్వారా ఫోన్ ఫాస్ట్ గా ఛార్జింగ్ అయ్యే అవకాశం ఉంది.

అదనపు ఫీచర్లు

ఫింగర్‌ప్రింట్ సెన్సార్, 4జీ ఎల్‌టీఈ, వైఫై 802.11 ఏసీ డ్యుయల్ బ్యాండ్, బ్లూటూత్ 4.2,ఆండ్రాయిడ్ 6.0 మార్ష్ మల్లో వంటివి అదనపు ఫీచర్లు. దీని అమ్మకాలు ఫిబ్రవరి 1 నుంచి ప్రారంభమవుతాయి. రేపటి నుంచి ఫ్రీ బుకింగ్ ఆర్డర్లు స్వీకరిస్తామని కంపెనీ తెలిపింది.

Bokeh' ఎఫెక్ట్స్‌తో సెల్ఫీలు

ప్రత్యేకించి సెల్ఫీ ప్రేమికుల కోసం డిజైన్ చేయబడిన వీవో వీ5 ప్లస్ ఫోన్ ఇప్పటి వరకు మార్కెట్లో లాంచ్ అయిన బెస్ట్ సెల్ఫీ కెమెరా స్మార్ట్‌ఫోన్‌గా నిలిచింది. ఇందుకు కారణం, ఈ ఫోన్‌లో ఏర్పాటు చేసిన డ్యుయల్ సెల్ఫీ (20 మెగా పిక్సల్ + 8 మెగా పిక్సల్) కెమెరా సెటప్. ఈ కెమెరా ద్వారా 'Bokeh' ఎఫెక్ట్స్‌తో సెల్ఫీలను చిత్రీకరించు కోవచ్చు. 'Bokeh' ఎఫెక్ట్స్‌తో అనేవి డీఎస్‌ఎల్ఆర్ కెమెరాల ద్వారానే సాధమ్యవుతాయి. ఈ మధ్య మార్కెట్లో లాంచ్ అయిన కొన్ని డ్యుయల్ కెమెరా సెటప్ ఫోన్‌లు మాత్రమే 'Bokeh'ఎఫెక్ట్స్‌ను చేరువ చేయగలుగుతున్నాయి.

గిజ్‌బాట్ మరిన్ని అప్‌డేట్స్ ఇక్కడే


English summary
Vivo V5 Plus Price Cut in India, Now Available for as Low as Rs. 22,990 Read more at gizbot telugu
Opinion Poll

Social Counting

ఇన్స్టెంట్ న్యూస్ అప్డేట్స్ రోజుంతా పొందండి - Telugu Gizbot