20 మెగా పిక్సల్ ఫ్రంట్ కెమెరాతో Vivo ఫోన్‌లు

రెండవ అతిపెద్ద స్మార్ట్‌ఫోన్ బ్రాండ్ Vivo రెండు సరికొత్త కెమెరా సెంట్రిక్ స్మార్ట్‌ఫోన్‌లను ఇండియన్ మార్కెట్లోకి తీసుకువచ్చేందుకు సిద్ధమవుతోంది. వివో వీ5, వివో వీ5 ప్లస్ మోడల్స్‌లో లాంచ్ కాబోతున్న ఈ ఫోన్‌లు ఏకంగా 20 మెగా పిక్సల్ ఫ్రంట్ ఫేసింగ్ కెమెరాలను కలిగి ఉండటం విశేషం. ఈ ఫోన్‌లకు సంబంధించిన మరిన్ని ఆసక్తికర విషయాలు..

Read More : 24 గంటల్లో 10 లక్షల ఫోన్‌లు అమ్మారు!

గిజ్‌బాట్ మరిన్ని అప్‌డేట్స్ ఇక్కడే

20 మెగా పిక్సల్ ఫ్రంట్ ఫేసింగ్ కెమెరా

ఫోన్ రాడార్ వెల్లడించిన వివరాల ప్రకారం.. వివో వీ5, వివో వీ5 ప్లస్ స్మార్ట్‌ఫోన్‌లు 20 మెగా పిక్సల్ ఫ్రంట్ ఫేసింగ్ కెమెరాలతో రాబోతున్నాయి. Moonlight flash సపోర్ట్‌తో వస్తోన్న ఈ కెమెరాలు పర్‌ఫెక్ట్ క్వాలిటీ సెల్ఫీలను ఆఫర్ చేయగలవట.

స్పెసిఫికేషన్స్ పరంగా చూస్తే ...

స్పెసిఫికేషన్స్ పరంగా చూస్తే వివో వీ5 స్మార్ట్ ఫోన్ 1.8గిగాహెర్ట్జ్ క్వాల్కమ్ స్నాప్‌డ్రాగన్ 652 ప్రాసెసర్, 4జీబి ర్యామ్, 32జీబి ఇంటర్నల్ స్టోరేజ్, అడ్రినో 505 జీపీయూ వంటి శక్తివంతమైన స్పెసిఫికేషన్‌లతో రాబోతోంది. వీ5 ప్లస్ వేరియంట్‌కు సంబంధించి స్పెసిఫికేషన్స్ వెల్లడికావల్సి ఉంది.

13 మెగా పిక్సల్ రేర్ ఫేసింగ్ కెమెరా

ఈ రెండు ఫోన్‌లు 13 మెగా పిక్సల్ రేర్ ఫేసింగ్ కెమెరాలతో వచ్చే అవకాశముందని తెలుస్తోంది. పీడీఏఎఫ్, ఎల్ఈడి ఫ్లాష్ వంటి ప్రత్యేకతలతో వస్తోన్న ఈ కెమెరాల ద్వారా లో-లైట్ ఫోటోలను హైక్వాలిటీలో చిత్రీకరించుకోచ్చు.

డిస్‌ప్లే విషయానికి వచ్చేసరికి ..

డిస్‌ప్లే విషయానికి వచ్చేసరికి వివో వీ5 ఫోన్ 5.5 అంగుళాల 720 పిక్సల్ ప్యానల్‌తో వచ్చే అవకాశముందని తెలుస్తోంది. ఇదే సమయంలో వివో వీ5 ప్లస్ 5.5 అంగుళాల 1080 పిక్సల్ ప్యానల్‌తో వచ్చే అవకాశముందని తెలుస్తోంది. ‌

నేడే విడుదల

ఈ రెండు ఫోన్‌లను నవంబర్ 15న ఇండియన్ మార్కెట్లో విడుదల చేసే అవకాశముంది. ధరకు సంబంధించిన పూర్తి వివరాలు మరికొద్ది గంటల్లో వెల్లడవుతాయి.

లేటెస్ట్ స్మార్ట్‌ఫోన్స్ బెస్ట్ ఆన్‌లైన్ డీల్స్ కోసం ఇక్కడ క్లిక్ చేయండి

గిజ్‌బాట్ మరిన్ని అప్‌డేట్స్ ఇక్కడే

English summary
Vivo V5 and V5 Max to Sport a 20MP Front-Facing Camera: 5 Things You Should Know. Read More in Telugu Gizbot..
Please Wait while comments are loading...
Opinion Poll

Social Counting