4జీబి ర్యామ్, 20 ఎంపీ కెమెరా.. ధర మాత్రం అంతే!

వివో తన సరికొత్త వీ5 స్మార్ట్‌ఫోన్‌ను మంగళవారం ఇండియన్ మార్కెట్లో విడుదల చేసింది. ఇప్పటికే మార్కెట్లో అందబాటులో ఉన్న జియోనీ ఎస్6ఎస్, ఒప్పో ఎఫ్1ఎస్, లెనోవో జెడ్2 ప్లస్ వంటి శక్తివంతమైన స్మార్ట్‌ఫోన్‌లకు పోటీగా 20 మెగా పిక్సల్ ఫ్రంట్ ఫేసింగ్ కెమెరాతో లాంచ్ లాంచ్ అయిన, ఈ సెల్ఫీ సెంట్రిక్ ఫోన్ ధర రూ.17,980. నవంబర్ 15 నుంచి నవంబర్ 25 మధ్య ఈ ఫోన్‌ను ప్రీఆర్డర్ చేసుకోవచ్చు.

Read More : ఆన్‌లైన్ షాపింగ్‌తో జరభద్రం!

గిజ్‌బాట్ మరిన్ని అప్‌డేట్స్ ఇక్కడే

20 మెగా పిక్సల్ ఫ్రంట్ ఫేసింగ్ కెమెరా

20 మెగా పిక్సల్ ఫ్రంట్ ఫేసింగ్ కెమెరా ఈ ఫోన్‌కు ప్రధాన ఆకర్షణగా నిలుస్తుంది. సోనీ ఐఎమ్ఎక్స్ 376 (1/2.78-inch, f/2.0) సెన్సార్ ఫోన్ కెమెరా క్వాలిటీని మరింత రెట్టింపు చేస్తుంది. Moonlight flash సపోర్ట్‌తో వస్తోన్న ఈ కెమెరా తక్కువ వెళుతురులోను హైక్వాలిటీ సెల్ఫీలను ప్రొడ్యూస్ చేయగలదట.

మెటల్ యునిబాడీ డిజైన్‌

మెటల్ యునిబాడీ డిజైన్‌తో వస్తోన్న ఈ ఫోన్ 5.5 అంగుళాల ఫుల్ హైడెఫినిషన్ డిస్‌ప్లేను కలిగి ఉంటుంది. (రిసల్యూషన్ వచ్చేసరికి 1920 x 1080పిక్సల్స్). 2.5డీ కార్నింగ్ గొరిల్లా గ్లాస్ ప్రొటెక్షన్ డిస్‌ప్లేకు రక్షణ కవచంలా నిలుస్తుంది.

ఆక్టా కోర్ మీడియాటెక్ ప్రాసెసర్‌

1.5GHz ఆక్టా కోర్ మీడియాటెక్ ఎంటీ6750 ప్రాసెసర్‌ను ఈ ఫోన్‌లో ఏర్పాటు చేసారు. పొందుపరిచిన Mali T860 GPU ఫోన్ గ్రాఫిక్ విభాగాన్ని చూసుకుంటుంది.

లేటెస్ట్ స్మార్ట్‌ఫోన్స్ బెస్ట్ ఆన్‌లైన్ డీల్స్ కోసం ఇక్కడ క్లిక్ చేయండి

ర్యామ్ ఇంకా స్టోరేజ్

ర్యామ్ ఇంకా స్టోరేజ్ విషయానికి వచ్చేసరికి.. Vivo V5 ఫోన్ 4జీబి ర్యామ్ + 32 జీబి ఇంటర్నల్ స్టోరేజ్ కెపాసిటీతో వస్తోంది. మైక్రోఎస్డీ స్లాట్ ద్వారా ఫోన్ మెమరీని 128జీబి వరకు విస్తరించుకునే అవకాశాన్ని కల్పించారు.

రేర్ కెమెరా ఎంత..?

20 మెగా పిక్సల్ ఫ్రంట్ ఫేసింగ్ కెమెరాతో వస్తోన్న వివో వీ5 ఫోన్‌లో 13 మెగా పిక్సల్ రేర్ ఫేసింగ్ కెమెరాను కూడా మనం చూడొచ్చు.. 

ఆండ్రాయిడ్ 6.0

ఆండ్రాయిడ్ 6.0 మార్ష్‌మల్లో ఆపరేటింగ్ సిస్టం ఆధారంగా అభివృద్థి చేసిన Funtouch OS 2.5 ప్లాట్‌ఫామ్ పై ఫోన్ రన్ అవుతుంది.

ఫింగర్ ప్రింట్ స్కానర్‌

3000 ఎమ్ఏహెచ్ బ్యాటరీతో వస్తోన్న ఈ ఫోన్‌లో వాటర్-రెసిస్టెంట్ ఫింగర్ ప్రింట్ స్కానర్‌ను ఏర్పాటు చేయటం జరిగింది. ఫోన్ హోమ్ బటన్ భాగంలో ఈ సెన్సార్‌ను ఎంబెడెడ్ చేసినట్లు కంపెనీ చెబుతోంది.

కనెక్టువిటీ ఫీచర్లు..

ఫోన్ కనెక్టువిటీ ఫీచర్లు పరిశీలించినట్లయితే... హైబ్రీడ్ డ్యుయల్ సిమ్ సపోర్ట్, 4జీ విత్ VoLTE, వై-ఫై, బ్లుటూత్, యాక్సిలరోమీటర్, యాంబియంట్ లైట్ సెన్సార్, ప్రాక్సిమిటీ సెన్సార్, ఈ-కంపాస్, స్ప్లిట్ స్ర్కీన్ మల్టీ టాస్కింగ్.

మెరుగైన ఆడియో క్వాలిటీ

మెరుగైన ఆడియో క్వాలిటీని అందించే విధంగా Hi-Fi AK4376 చిప్‌సెట్‌ను ఈ ఫోన్‌లో నిక్షిప్తం చేయటం జరిగింది. 154 గ్రాముల బరువును మాత్రమే కలిగి ఉండే ఈ ఫోన్ పరిమాణం 153.8 x 75.5 x 7.55 మిల్లీ మీటర్లుగ ఉంది.

త్వరలో డ్యుయల్ సెల్ఫీ కెమెరా ఫోన్‌

వీ5 ప్లస్ పేరుతో ప్రపంచపు మొట్టమొదటి డ్యుయల్ సెల్ఫీ కెమెరా ఫోన్‌ను త్వరలో మార్కెట్లోకి తీసుకురాబోతున్నట్లు వివో ప్రకటించింది.

లేటెస్ట్ స్మార్ట్‌ఫోన్స్ బెస్ట్ ఆన్‌లైన్ డీల్స్ కోసం ఇక్కడ క్లిక్ చేయండి

గిజ్‌బాట్ మరిన్ని అప్‌డేట్స్ ఇక్కడే

English summary
Vivo V5 with 20MP front camera launched: Price, specifications and features. Read More in Telugu Gizbot..
Please Wait while comments are loading...
Opinion Poll

Social Counting

ఇన్స్టెంట్ న్యూస్ అప్డేట్స్ రోజుంతా పొందండి - Telugu Gizbot