Home
Mobile

6000mAh భారీ బ్యాటరీ, మూడు 50MP కెమెరాలు, క్వాడ్‌ కర్వడ్‌ డిస్‌ప్లేతో Vivo కొత్త 5G స్మార్ట్‌ఫోన్‌..!

Vivo V50 Elite Edition: ప్రముఖ స్మార్ట్‌ఫోన్‌ల తయారీ సంస్థ వివో ఈ సంవత్సరం ఇప్పటి వరకు అనేక స్మార్ట్‌ఫోన్‌లను లాంచ్‌ చేసింది. ఇందులో మిడ్‌ రేంజ్‌లో వివో V50 సిరీస్‌ ఫోన్‌లు అందుబాటులోకి వచ్చాయి. ఇందులో భాగంగా ఇప్పటి వరకు వివో V50, వివో V50e స్మార్ట్‌ఫోన్‌లు విడుదల అయ్యాయి. సేల్‌ కూడా ప్రారంభం అయింది. ఈ సిరీస్‌లో కెమెరా విభాగానికి అధిక ప్రాధాన్యత ఇచ్చారు. అయితే ఈ సిరీస్‌ నుంచి మరో స్మార్ట్‌ఫోన్‌ విడుదల కానుందని తెలుస్తోంది.

వివో V50 Elite ఎడిషన్‌ త్వరలో భారత్‌ మార్కెట్‌లో విడుదల కానుందని లీక్స్‌ వస్తున్నాయి. ఈ ఫోన్ విడుదలపై వివో సంస్థ ఎటువంటి ప్రకటన చేయలేదు. అయితే ఈ ఫోన్ గురించి అనేక వివరాలు లీక్‌ అవుతున్నాయి. స్టాండర్డ్ వేరియంట్‌తో పోలిస్తే ప్రత్యేక డిజైన్‌ను కలిగి ఉంటుందని తెలుస్తోంది.

Vivo V50 Elite Edition smartphone

ఎప్పుడు విడుదల కానుంది? :
వివో V50 ఇలైట్‌ ఎడిషన్‌ విడుదలపై 91మొబైల్స్‌ కీలక వివరాలు వెల్లడించింది. దీని ఆధారంగా ఈ ఫోన్‌ మే 15 వ తేదీన భారత్‌ మార్కెట్‌లో విడుదల కానుంది. అయితే స్టాండర్డ్‌ వేరియంట్‌ (Vivo V50) తరహా ఫీచర్‌లను అధికంగా కలిగి ఉండే అవకాశం ఉందని తెలుస్తోంది. ఈ ఫోన్‌కు సంబంధించిన కొన్ని స్పెసిఫికేషన్‌ల వివరాలు కూడా లీక్‌ అయ్యాయి.

స్పెసిఫికేషన్‌లు, ఫీచర్లు :
వివో V50 ఇలైట్‌ ఎడిషన్‌ స్మార్ట్‌ఫోన్‌ 6.77 అంగుళాల ఫుల్‌ HD+ క్వాడ్‌ కర్వడ్‌ అమోలెడ్‌ డిస్‌ప్లేను కలిగి ఉండే అవకాశం ఉంది. దీంతోపాటు ఈ ఫోన్‌ భారీ బ్యాటరీతో లాంచ్‌ కానుందని తెలుస్తోంది. ప్రస్తుతం ఉన్న వివరాల ఆధారంగా 90W వైర్‌ ఫాస్ట్‌ ఛార్జింగ్‌ సపోర్టుతో 6000mAh బ్యాటరీని కలిగి ఉంటుంది.

ఈ ఫోన్‌ స్నాప్‌డ్రాగన్‌ 7 జెన్‌ 3 SoC చిప్‌సెట్‌తో విడుదల అయ్యే అవకాశం ఉంది. ఈ చిప్‌సెట్‌ గరిష్ఠంగా 12GB LPDDR4X ర్యామ్, 512GB UFS 2.2 స్టోరేజీని సపోర్టు చేస్తుందని తెలుస్తోంది. కెమెరా విభాగంగా పరంగా వెనుక వైపు రెండు 50MP కెమెరాలు మరియు సెల్ఫీ, వీడియో కాల్స్‌ కోసం 50MP కెమెరాను కలిగి ఉంటుందని సమాచారం.

Vivo V50 స్మార్ట్‌ఫోన్‌ :
ప్రస్తుతం అందుబాటులో ఉన్న Vivo V50 స్మార్ట్‌ఫోన్‌ ప్రారంభ ధర రూ.34999 గా ఉంది. ఈ ఫోన్‌ 6.77 అంగుళాల క్వాడ్ కర్వడ్‌ అమోలెడ్‌ డిస్‌ప్లేను కలిగి ఉంది. క్వాల్‌కాం స్నాప్‌డ్రాగన్‌ 7 జెన్‌ 3 SoC చిప్‌సెట్‌, ఆండ్రాయిడ్ 15 ఆధారిత Funtouch OS 15 ను కలిగి ఉంది.

కెమెరా విభాగం పరంగా ZEISS భాగస్వా్మ్యంతో 50MP ప్రైమరీ కెమెరా (OIS), 50MP అల్ట్రావైడ్ లెన్స్‌, 50MP సెల్ఫీ కెమెరాలను కలిగి ఉంది. బ్యాటరీ పరంగా 90W వైర్‌ ఫాస్ట్‌ ఛార్జింగ్ సపోర్టుతో 6000mAh బ్యాటరీని కలిగి ఉంది. ఫోన్‌ IP68 + IP69 రేటింగ్‌తో డస్ట్, వాటర్ రెసిస్టెంట్‌గా ఉంది.

వివో V50e స్మార్ట్‌ఫోన్‌ :
వివో V50 తర్వాత విడుదల అయిన వివో V50e హ్యాండ్‌సెట్ ప్రారంభ ధర రూ.28999 గా ఉంది. ఈ ఫోన్ 6.77 అంగుళాల FHD+ క్వా్డ్‌ కర్వడ్‌ అమోలెడ్‌ డిస్‌ప్లేను కలిగి ఉంది. 4nm మీడియాటెక్‌ డైమెన్సిటీ 7300 SoC చిప్‌సెట్‌, ఆండ్రాయిడ్ 15 ఆధారిత FuntouchOS 15 ను కలిగి ఉంటుంది.

కెమెరా విభాగం పరంగా 50MP సోనీ IMX882 (OIS) కెమెరా, 8MP అల్ట్రావైడ్‌, 50MP సెల్ఫీ కెమెరాను కలిగి ఉంది. ఈ స్మా్ర్ట్‌ఫోన్‌ 90W వైర్‌ ఫాస్ట్‌ ఛార్జింగ్‌ సపోర్టుతో 5600mAh బ్యాటరీని కలిగి ఉంది. IP68 + IP69 రేటింగ్‌తో డస్ట్‌ మరియు వాటర్‌ రెసిస్టెంట్‌గా ఉంది.

More from GizBot

Best Mobiles in India

English summary
Vivo V50 Elite Edition smartphone launch date and specifications leaked in india
Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
X