Home
Mobile

వివో V50 Elite ఎడిషన్‌ స్మార్ట్‌ఫోన్ విడుదల.. ఇవాళ్టి నుంచే సేల్‌.. రూ.3000 డిస్కౌంట్‌..!

Vivo V50 Elite Smartphone : ప్రముఖ స్మార్ట్‌ఫోన్‌ల తయారీ సంస్థ వివో నుంచి భారత్‌ మార్కెట్‌లోకి ఇవాళ వివో V50 Elite ఎడిషన్‌ స్మార్ట్‌ఫోన్‌ విడుదల అయింది. ఇప్పటికే వివో నుంచి వివో V50, వివో V50e స్మార్ట్‌ఫోన్‌లు ఇప్పటికే భారత్‌లో అందుబాటులోకి వచ్చాయి. అయితే ఈ ఫోన్‌తో పాటు వివో TWS 3e డార్క్‌ ఇండిగో ఇయర్‌బడ్స్‌ను కూడా అందిస్తోంది. ఈ ఫోన్‌ చాలా వరకు స్టాండర్డ్‌ వేరియంట్ స్పెసిఫికేషన్‌లు, ఫీచర్‌లను కలిగి ఉంది.

వివో V50 ఇలైట్‌ ఎడిషన్‌ స్పెసిఫికేషన్‌లు, ఫీచర్‌లు :
డిజైన్ పరంగా వివో V50 ఇలైట్‌ ఎడిషన్‌ స్మార్ట్‌ఫోన్‌ స్టాండర్డ్ వేరియంట్ డిజైన్‌ను కలిగి ఉంది. ఈ ఫోన్ 120Hz రీఫ్రెష్‌ రేట్‌తో 6.77 అంగుళాల FHD+ అమోలెడ్‌ డిస్‌ప్లేను కలిగి ఉంది. ఈ డిస్‌ప్లే 4500 నిట్స్‌ గరిష్ఠ బ్రైట్‌నెస్‌ను కలిగి ఉంది. మరియు HDR10+ ను సపోర్టు చేస్తుంది. మరియు ఈ డిస్‌ప్లే డైమండ్‌ షీల్డ్‌ గ్లాస్‌ ప్రొటెక్షన్‌ను పొందుతుంది.

Vivo V50 Elite Smartphone launched in india and sale is live on amazon  Flipkart

స్నాప్‌డ్రాగన్ 7 జెన్‌ 3 చిప్‌సెట్‌ :
వివో V50 ఇలైట్‌ ఎడిషన్‌ స్మార్ట్‌ఫోన్ క్వాల్‌కాం స్నాప్‌డ్రాగన్ 7 జెన్‌ 3 చిప్‌సెట్‌ తో పనిచేస్తుంది. మరియు Adreno 720 GPU ను కూడా కలిగి ఉంది. ఈ చిప్‌సెట్‌ గరిష్ఠంగా 12GB ర్యామ్, 512GB స్టోరేజీతో జతచేసి ఉంటుంది. ఈ ఫోన్ ఆండ్రాయిడ్‌ 15 ఆధారిత Funtouch OS 15 పైన పనిచేస్తుంది.

6000mAh బ్యాటరీ :
ఈ ఫోన్ 3 సంవత్సరాల ఆండ్రాయిడ్ OS అప్‌డేట్స్‌, 4 సంవత్సరాల సెక్యూరిటీ అప్‌డేట్స్‌ను పొందుతుంది. వివో V50 ఇలైట్‌ ఎడిషన్‌ స్మార్ట్‌ఫోన్‌ 90W వైర్‌ ఛార్జింగ్‌ సపోర్టుతో 6000mAh బ్యాటరీతో పనిచేస్తుంది. పవర్‌ మేనేజ్‌మెంట్‌ కోసం ఈ ఫోన్‌ బ్లూవోల్ట్‌ టెక్నాలజీని ఉపయోగించింది.

ఈ హ్యాండ్‌సెట్‌ Zeiss భాగస్వామ్యంతో వెనుక వైపు డ్యూయల్‌ కెమెరాలను కలిగి ఉంది. ఇందులో ఆప్టికల్‌ ఇమేజ్‌ స్టెబిలైజేషన్‌ (OIS) సపోర్టుతో 50MP ప్రైమరీ కెమెరా, 50MP అల్ట్రావైడ్ యాంగిల్‌ కెమెరాలను కలిగి ఉంది. సెల్ఫీ, వీడియో కాల్స్‌ కోసం ఈ ఫోన్‌ ముందువైపు 50MP కెమెరాను కలిగి ఉంది.

ప్రత్యేక ఫీచర్‌లు :
ఈ ఫోన్ మల్టీ ఫోకల్‌ పొర్ట్రెయిట్స్‌ మరియు వెడ్డింగ్ స్టైల్‌ పొర్ట్రెయిట్‌ స్టూడియోను కలిగి ఉంది. AI 3D స్టూడియో లైటింగ్‌ 2.0 ఫీచర్‌ను కూడా కలిగి ఉంది. దీంతోపాటు ఈ ఫోన్‌ అనేక ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్‌ ఫీచర్‌లను కలిగి ఉన్నాయి.

ఇందులో సర్కిల్ టూ సెర్చ్‌, AI Eraser, AI సూపర్‌ లింక్‌, AI స్క్రీన్‌ ట్రాన్స్‌లేషన్‌, లైవ్‌ కాల్‌ ట్రాన్స్‌లేషన్‌, AI ట్రాన్స్‌క్రిప్ట్‌ అసిస్ట్‌ ఉన్నాయి. ఈ వివో ఫోన్‌ IP68 + IP69 రేటింగ్‌తో డస్ట్ మరియు వాటర్ రెసిస్టెంట్‌గా ఉంది.

వివో V50 ఇలైట్‌ ఎడిషన్‌ ధర, సేల్‌ వివరాలు :
ఈ వివో స్మార్ట్‌ఫోన్‌ 12GB ర్యామ్ + 512GB స్టోరేజీ వేరియంట్ ధర రూ.41,999 గా ఉంది. ఈ ఫోన్‌తోపాటు వివో TWS 3e డార్క్ ఇండిగో ఇయర్‌బడ్స్‌, ఛార్జర్‌ను కూడా అందిస్తోంది.

ఈ స్మార్ట్‌ఫోన్‌ సేల్‌ ఇవాళ్టి నుంచే ప్రారంభం అయింది. అమెజాన్, ఫ్లిప్‌కార్ట్‌, ఇతర రిటైల్‌ స్టోర్స్‌ ద్వారా కొనుగోలు చేయవచ్చు. HDFC, SBI, యాక్సెస్‌ బ్యాంకు కార్డులతో రూ.3000 డిస్కౌంట్‌ను పొందవచ్చు. ఈ ఫోన్ రోజ్‌ రెడ్‌ కలర్‌ వేరియంట్‌లో మాత్రమే అందుబాటులోకి వచ్చింది.

More from GizBot

Best Mobiles in India

English summary
Vivo V50 Elite Smartphone launched in india and sale is live on amazon, Flipkart
Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
X