వివో V50 ఇండియాలో లాంచ్.. 6000mAh బ్యాటరీ, 50MP కెమెరా.. ఇతర ఫీచర్లు, ధర వివరాలు ఇవే..
Vivo V50 Launched: వివో V సిరీస్‌లో సరికొత్త ఫోన్ వచ్చేసింది. వివో V40కి సక్సెసర్‌గా, V50 స్మార్ట్‌ఫోన్ ఇండియాలో లాంచ్ అయింది. ఈ కొత్త ఫోన్‌లో స్టైలిష్ డిజైన్‌తో పాటు పవర్‌ఫుల్ బ్యాటరీ, అదిరిపోయే కెమెరాలు, ఇంకా లేటెస్ట్ AI ఫీచర్లు ఉన్నాయి. IP68, IP69 రేటింగ్‌లతో వస్తోంది ఈ ఫోన్. వన్‌ప్లస్ 12R, ఐకూ నియో 9 ప్రో లాంటి ఫోన్లకు పోటీ ఇవ్వడానికి వివో V50 రెడీ అయిపోయింది.
* ధర ఎంతంటే..
వివో V50 బేస్ మోడల్ (8GB RAM + 128GB స్టోరేజ్) ధర రూ.34,999 నుంచి మొదలవుతుంది. ఒకవేళ మీకు ఎక్కువ స్టోరేజ్ కావాలంటే, 256GB వేరియంట్ రూ.36,999 కి, టాప్-ఎండ్ మోడల్ (12GB RAM + 512GB స్టోరేజ్) రూ.40,999కి లభిస్తుంది.

అంతే కాదు, కొన్ని బ్యాంక్ కార్డ్స్‌తో కొంటే 10% వరకు డిస్కౌంట్ కూడా పొందొచ్చు. కలర్స్ విషయానికొస్తే - రోజ్ రెడ్, టైటానియం గ్రే, అలాగే స్టార్రీ నైట్ రంగుల్లో ఈ ఫోన్ లభిస్తుంది. ఫిబ్రవరి 25 నుంచి అమ్మకాలు మొదలవుతాయి, ఆసక్తి ఉన్న కొనుగోలుదారులు ఇప్పుడే దీనికోసం ప్రీ-బుకింగ్ చేసుకోవచ్చు.
* డిస్‌ప్లే & పర్ఫార్మెన్స్
వివో V50 లో 6.78- అంగుళాల క్వాడ్-కర్వ్డ్ AMOLED డిస్‌ప్లే ఉంది. 120Hz రిఫ్రెష్ రేట్‌తో స్క్రీన్ చాలా స్మూత్‌గా ఉంటుంది. సూర్యరశ్మిలో కూడా స్క్రీన్ క్లియర్‌గా కనిపించేలా 4,500 నిట్స్ పీక్ బ్రైట్‌నెస్‌తో వస్తోంది. నావిగేషన్ చెక్ చేసుకునే డెలివరీ బాయ్స్‌తో పాటు ట్రావెలర్స్‌కి కూడా ఇది సరిగ్గా సూట్ అవుతుంది.
పర్ఫార్మెన్స్ విషయానికొస్తే, స్నాప్‌డ్రాగన్ 7 జెన్ 3 ప్రాసెసర్‌తో చాలా ఫాస్ట్‌గా పని చేస్తుంది. ఆండ్రాయిడ్ 15 బేస్డ్ ఫన్‌టచ్ OS 15తో వస్తుంది. 12GB వరకు LPDDR4X RAM, 512GB వరకు UFS 2.2 స్టోరేజ్ ఇందులో ఉన్నాయి. ఈ ధరలో UFS 3.1 వంటి మరింత ఫాస్ట్ స్టోరేజ్ ఉంటే ఇంకా బాగుండేది.
* బ్యాటరీ, ఛార్జింగ్
వివో 50లో బ్యాటరీ కెపాసిటీ చూస్తే ఆశ్చర్యపోవాల్సిందే ఇందులో ఏకంగా 6,000mAh బ్యాటరీ ఇచ్చారు. V40లో 5,500mAh బ్యాటరీ ఉండేది, దానికంటే ఇది చాలా పెద్దది. ఇది 90W ఫాస్ట్ ఛార్జింగ్‌కు సపోర్ట్ చేస్తుంది. గ్లాస్ బ్యాక్ డిజైన్‌తో, కేవలం 7.39mm మందం, 199g బరువుతో చాలా స్లిమ్‌గా, లైట్‌వెయిట్‌గా ఉంటుంది ఈ ఫోన్.
* కెమెరా
వివో V50 డ్యూయల్ రియర్ కెమెరా సెటప్‌తో వస్తోంది. రెండు కెమెరాలు కూడా 50MP సెన్సార్లతో ఉన్నాయి. మెగాపిక్సెల్స్ పాత ఫోన్‌లాగే ఉన్నా, ఫొటో క్వాలిటీ మాత్రం చాలా బాగుంటుందని వివో చెబుతోంది. ముందువైపు కూడా 50MP సెల్ఫీ కెమెరా ఉంది. కెమెరా సిస్టమ్‌కి Zeiss టెక్నాలజీ సపోర్ట్ ఉండటంతో ఫొటోలు షార్ప్‌గా, కలర్‌ఫుల్‌గా వస్తాయి.
* కనెక్టివిటీ, AI ఫీచర్లు
కనెక్టివిటీ కోసం బ్లూటూత్ 5.4, USB 2.0, GPS, OTG వంటి ఫీచర్లు ఉన్నాయి, కానీ NFC మాత్రం లేదు. Vivo V50 లో కొత్తగా AI ఫీచర్లు కూడా చాలా ఇచ్చారు. సర్కిల్ టు సెర్చ్, AI ట్రాన్‌స్క్రిప్ట్ , AI లైవ్ కాల్ ట్రాన్స్‌లేషన్ లాంటి ఫీచర్లతో ఈ ఫోన్ మరింత స్మార్ట్‌గా పనిచేస్తుంది.


Click it and Unblock the Notifications








