Home
Mobile

6500mAh భారీ బ్యాటరీ, 6.77 అంగుళాల FHD+ డిస్‌ప్లేతో Vivo 5G స్మార్ట్‌ఫోన్ విడుదల..!

వివో ఇటీవల కాలంలో వివిధ ధర సెగ్మెంట్స్‌లో స్మార్ట్‌ఫోన్‌లను లాంచ్‌ చేసింది. భారత్‌ మార్కెట్‌లో V50 స్మార్ట్‌ఫోన్‌ మిడ్‌ రేంజ్‌లో విడుదల అయింది. వివో T4x 5G స్మార్ట్‌ఫోన్‌ రూ.15000 కంటే తక్కువ ధరకు అందుబాటులోకి వచ్చింది. V50 ఫోన్‌ 6000mAh బ్యాటరీ, T4x హ్యాండ్‌సెట్‌ 6500mAh బ్యాటరీని కలిగి ఉంది. అయితే గ్లోబల్‌ మార్కెట్లో తాజాగా వివో V50 లైట్ 5G స్మార్ట్‌ఫోన్‌ (Vivo V50 Lite 5G Smartphone) లాంచ్ అయింది. ఈ హ్యాండ్‌సెట్‌ 50MP కెమెరాతోపాటు 6500mAh బ్యాటరీని కలిగి ఉంది.

వివో V50 లైట్‌ 5G స్మార్ట్‌ఫోన్‌ స్పెసిఫికేషన్‌లు, ఫీచర్‌లు :
ఈ స్మార్ట్‌ఫోన్‌ 6.77 అంగుళాల ఫుల్ HD+ (1080*2392 పిక్సల్స్‌) 2.5D pOLED డిస్‌ప్లేతో లాంచ్‌ అయింది. ఈ డిస్‌ప్లే 120Hz రీఫ్రెష్‌ రేట్‌, 1800 నిట్స్‌ గరిష్ఠ బ్రైట్‌నెస్‌ను కలిగి ఉంది. ఎక్కువ సమయం వినియోగించినా కళ్లకు హాని కలగకుండా ఉండేందుకు వీలుగా SGS Low Blue లైట్‌ సర్టిఫికేషన్‌లను కలిగి ఉంది.

Vivo V50 Lite 5G Smartphone

ఈ హ్యాండ్‌సెట్‌ ఆక్టా కోర్‌ మీడియాటెక్‌ డైమెన్సిటీ 6300 SoC చిప్‌సెట్‌తో పనిచేస్తుంది. ఈ చిప్‌సెట్‌ 12GB LPDDR4X ర్యామ్‌, 512GB UFS 2.2 స్టోరేజీతో జతచేసి ఉంటుంది. ఆండ్రాయిడ్ 15 ఆధారిత FuntouchOS 15 ను కలిగి ఉంది.

కెమెరా విభాగం పరంగా ఈ హ్యాండ్‌సెట్‌ వెనుక వైపు డ్యూయల్‌ కెమెరాలను కలిగి ఉంది. 50MP సోనీ IMX882 ప్రైమరీ కెమెరా, 8MP అల్ట్రావైడ్‌ కెమెరాను కలిగి ఉంది. సెల్ఫీ, వీడియో కాల్స్‌ కోసం 32MP సెల్ఫీ కెమెరాను కలిగి ఉంది. 90W వైర్‌ ఫాస్ట్‌ ఛార్జింగ్‌ సపోర్టుతో 6500mAh బ్యాటరీతో పనిచేస్తోంది.

కనెక్టివిటీ పరంగా ఈ హ్యాండ్‌సెట్‌ 5G, 4G, బ్లూటూత్‌ 5.4, డ్యూయల్‌ బ్యాండ్‌ వైఫై, GPS, NFC, OTG, USB-C ఛార్జింగ్‌ పోర్టును కలిగి ఉంది. ఈ ఫోన్‌ IP65 రేటింగ్‌తో డస్ట్ మరియు వాటర్‌ రెసిస్టెంట్‌గా ఉంది. మిలిటరీ గ్రేడ్‌ డ్రాప్‌ రెసిస్టెన్స్‌ను కలిగి ఉంది.

వివో V50 లైట్ 5G స్మార్ట్‌ఫోన్‌ గ్లోబల్‌ మార్కెట్‌లో 12GB ర్యామ్‌ + 512GB స్టోరేజీ వేరియంట్ ధర EUR 399 (భారత కరెన్సీ ప్రకారం సుమారు రూ.37,200) గా ఉంది. టైటానియం గోల్డ్‌, సిల్క్‌ గ్రీన్‌, ఫ్యాంటసీ పర్పుల్‌, ఫాంటమ్‌ బ్లాక్‌ రంగుల్లో లభిస్తుంది. అయితే ఈ స్మార్ట్‌ఫోన్‌ భారత్‌ మార్కెట్‌లో అందుబాటులోకి వస్తుందా లేదా అనే దానిపై వివో ఎటువంటి ప్రకటన చేయలేదు.

భారత్‌ మార్కెట్‌లో త్వరలో వివో V50e స్మార్ట్‌ఫోన్ లాంచ్ కానుంది. ఇప్పటికే ఈ హ్యాండ్‌సెట్ BIS సర్టిఫికేషన్‌ వెబ్‌సైట్‌లో కనిపించింది. గీక్‌బెంచ్‌ లోనూ లిస్టింగ్‌ అయింది. ఏప్రిల్‌ నెలలో విడుదలయ్యే అవకాశం ఉందని తెలుస్తోంది. ఇటీవల వచ్చిన లీక్స్‌ ఆధారంగా వివో V50 తరహా డిజైన్‌ను కలిగి ఉండే అవకాశం ఉంది.

ప్రస్తుతం అందుబాటులో ఉన్న వివరాల ఆధారంగా ఈ ఫోన్‌ మీడియాటెక్‌ డైమెన్సిటీ 7300 SoC చిప్‌సెట్‌, ఆండ్రాయిడ్ 15 ఆధారిత OS పైన పనిచేస్తుంది. వివో V50e హ్యాండ్‌సెట్‌ 6.77 అంగుళాల క్వాడ్‌ కర్వడ్‌ అమోలెడ్‌ డిస్‌ప్లేను కలిగి ఉంటుందని తెలుస్తోంది.

కెమెరా విభాగం పరంగా 50MP సోనీ IMX882 ప్రైమరీ కెమెరా, 8MP అల్ట్రావైడ్‌ కెమెరాతో లాంచ్‌ అయ్యే అవకాశం ఉంది. మరియు 50MP సెల్ఫీ కెమెరాను కలిగి ఉంటుందని భావిస్తున్నారు. ఈ ఫోన్ 90W ఛార్జింగ్ సపోర్టుతో 5600mAh బ్యాటరీతో పనిచేస్తుందని తెలుస్తోంది. ఈ స్మార్ట్‌ఫోన్ రూ.25,000 నుంచి రూ.30,000 మధ్య ధరను కలిగి ఉండే అవకాశం ఉంది.

FAQs
వేసవి కాలం స్మా్ర్ట్‌ఫోన్‌ పనితీరుపై ప్రభావం చూపుతుందా?

కచ్చితంగా చూపుతుంది. సూర్యకాంతి నేరుగా తగిలే చోట ఫోన్‌ పెడితే, ఫోన్ త్వరగా వేడెక్కుతుంది. కొన్నిసార్లు అంతర్గత విభాగాలు డ్యామేజీ అయ్యే అవకాశం ఉంది.

ఎలాంటి ఉష్ణోగ్రతలో స్మార్ట్‌ఫోన్ పనితీరు దెబ్బతింటుంది?

అధిక ఉష్ణోగ్రత, అత్యంత తక్కువ ఉష్ణోగ్రతలో ఫోన్‌ సాధారణ పనితీరు కనబరచలేదు.

నీటిలో పనిచేసే ఫోన్‌లు ప్రస్తుతం ఉన్నాయా?

IP68, IP69 రేటింగ్‌ కలిగిన ఫోన్‌లు 30 నిమిషాల వరకు డ్యామేజీ కాకుండా ఉంటాయి.

GizBot Technology

More from GizBot

Best Mobiles in India

English summary
Vivo V50 Lite 5G Smartphone launched in global market with 6500mAh large battery
Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
X