Home
Mobile

వివో V50 వచ్చేస్తోంది... 90W ఛార్జింగ్, 6000mAh బ్యాటరీ, ఇంకా మరెన్నో ఫీచర్లు.. ధరెంతంటే..

Vivo V50: వివో కంపెనీ ఫోన్లకు మనదేశంలో విపరీతమైన క్రేజ్ ఉంది. ఇటీవల కాలంలో భారతీయులు ఎప్పుడెప్పుడా అని ఎదురుచూస్తున్న మొబైల్స్‌లో వివో V50 ఒకటి. ఇది ఎట్టకేలకు ఫిబ్రవరి 17న ఇండియాలో లాంచ్ కానుంది. మునుపటి వివో V40తో పోలిస్తే ఈ కొత్త ఫోన్ చాలా అప్‌గ్రేడ్స్‌తో వస్తోంది. ముఖ్యంగా బ్యాటరీ సామర్థ్యం, కెమెరా క్వాలిటీ, డిస్‌ప్లే అన్నీ కూడా ఆకట్టుకునేలా ఉండబోతున్నాయి. ఈ ఫోన్ విశేషాలు తెలుసుకుందాం.

ఇది వన్‌ప్లస్ 12R, ఐకూ నియో 9 Pro లాంటి ఫోన్లకు పోటీ ఇవ్వనుంది. అదీ కూడా రూ.40,000లోపే. లీకుల ప్రకారం, వివో V50 6.7-అంగుళాల AMOLED డిస్‌ప్లే, 120Hz రిఫ్రెష్ రేట్‌తో వస్తుంది. క్వాల్‌కమ్ స్నాప్‌డ్రాగన్‌ 7 జెన్ 3 ప్రాసెసర్‌తో ఈ ఫోన్ పనిచేస్తుంది. 12GB RAM, 256GB స్టోరేజ్ వరకు ఉండొచ్చు.

Vivo V50 Price LEAKED  Is This the 90W Charging  6000mAh Battery Beast You ve Been Waiting For

* కెమెరాలు

వివో కంపెనీ జైస్‌తో చేతులు కలిపింది. అంటే కెమెరాలు మాత్రం ప్రొఫెషనల్ లెవెల్లో ఉంటాయని చెప్పొచ్చు. వెనుకవైపు 50MP మెయిన్ కెమెరా, 50MP అల్ట్రా-వైడ్ కెమెరాతో డ్యూయల్ కెమెరా సెటప్ ఉంటుందట. సెల్ఫీ కెమెరా 50MP ఉండొచ్చని టాక్. అంతేకాదు, AI టెక్నాలజీతో ఫోటోలను మరింత బాగా ప్రాసెస్ చేసే ఫీచర్లు కూడా ఉండొచ్చు.

వివో V50 ఏకంగా 6,000mAh బ్యాటరీతో వస్తోంది. 90W ఫాస్ట్ ఛార్జింగ్ సపోర్ట్ చేస్తుంది. వివో V40 లో 5,500mAh బ్యాటరీ, 80W ఛార్జింగ్ ఉండేది. దానికంటే ఇది చాలా అప్‌గ్రేడ్. ఈ ఫోన్ నీళ్లు, దుమ్ము నుంచి కూడా సేఫ్‌గా ఉంటుందట. IP68, IP69 రేటింగ్స్ ఉన్నాయి. ఈ రేటింగ్స్ కాస్ట్లీ ఫోన్లలోనే కనిపిస్తాయి.

* డిజైన్

వివో V50 చూడటానికి V40 సిరీస్ లాగే ఉంటుంది. మూడు కలర్ ఆప్షన్స్‌లో వస్తుంది. కర్వ్డ్ డిస్‌ప్లేతో ప్రీమియం లుక్ ఉంటుంది. అయితే, ఈసారి వివో V50 ప్రో మోడల్ రిలీజ్ చేసే ఆలోచనలో లేనట్లు తెలుస్తోంది. ఎందుకంటే V50 Pro గురించి ఎలాంటి లీకులు రాలేదు.

* ధర

ధర గురించి ఇంకా అఫీషియల్‌గా చెప్పలేదు కానీ లీకుల ప్రకారం, 8GB RAM, 128GB స్టోరేజ్ బేస్ మోడల్ ధర రూ.34,999 ఉండొచ్చు. 8GB RAM + 256GB వేరియంట్ ధర రూ.36,999, టాప్ ఎండ్ మోడల్ 12GB RAM, 256GB స్టోరేజ్‌తో వస్తే దాని ధర రూ.40,999 వరకు ఉండొచ్చు.

ఇంకో లీక్ ప్రకారం స్టార్టింగ్ ధర రూ.37,999 ఉండొచ్చని అంటున్నారు. ఏది ఏమైనా ఫైనల్ ధర మాత్రం రూ 40,000 లోపే ఉంటుందని టాక్. బ్యాంక్ ఆఫర్లు కూడా ఉంటే ధర ఇంకా తగ్గే ఛాన్స్ ఉంది. వివో V50 కోసం ప్రీ-రిజర్వేషన్లు ఫిబ్రవరి 16 నుంచి స్టార్ట్ అవుతాయని అంటున్నారు.

లీకైన పోస్టర్ ప్రకారం, ఫోన్ ప్రీ-బుక్ చేసుకున్న వాళ్లకు 1-ఇయర్ ఎక్స్‌టెండెడ్ వారంటీ, 1-ఇయర్ స్క్రీన్ డ్యామేజ్ ప్రొటెక్షన్ (V-Shield) డిస్కౌంట్ ధరకు ఇస్తారట. కానీ ఈ ఆఫర్ల గురించి కంపెనీ ఇంకా అఫీషియల్‌గా చెప్పలేదు. ఫీచర్లు చూస్తుంటే, వివో V50 మాత్రం మిడ్-రేంజ్ ప్రీమియం సెగ్మెంట్‌లో గట్టి పోటీ ఇచ్చేలా ఉంది.

More from GizBot

Best Mobiles in India

English summary
Vivo V50 launching Feb 17 in India with 90W charging, 6000mAh battery, Snapdragon 7 Gen 3, Zeiss cameras. Leaked price starts Rs 34,999, competing with OnePlus 12R.
Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
X