Home
Mobile

మూడు 50MP కెమెరాలు, 6000mAh బ్యాటరీ, AI ఫీచర్‌లతో Vivo V50 స్మార్ట్‌ఫోన్‌.. వచ్చే వారంలో విడుదల..!

ప్రముఖ స్మార్ట్‌ఫోన్‌ల తయారీ సంస్థ వివో నుంచి భారత్ మార్కెట్‌లోకి (Vivo India) వచ్చే వారంలో కొత్త V సిరీస్‌ స్మార్ట్‌ఫోన్‌ లాంచ్‌ కానుంది. వివో V50 సిరీస్‌ (Vivo V50 Smartphone) పేరుతో ఈ హ్యాండ్‌సెట్‌ లాంచ్‌ కానుంది. ఈ సిరీస్‌లో భాగంగా వివో V50, V50 ప్రో స్మార్ట్‌ఫోన్‌లు విడుదలయ్యే అవకాశం ఉంది. ఇప్పటికే ఈ హ్యాండ్‌సెట్‌కు సంబంధించిన విడుదల తేదీ సహా అనేక వివరాలు వెల్లడయ్యాయి. దీంతోపాటు డిజైన్ వివరాలు కూడా అందుబాటులోకి వచ్చాయి.

ఎప్పుడు విడుదల కానుంది? :
వివో V50 సిరీస్‌ ఫిబ్రవరి 17 వ తేదీ మధ్యాహ్నం 12 గంటలకు విడుదల కానుంది. కెమెరా విభాగానికి అధిక ప్రాధాన్యత ఇచ్చే వివో.. త్వరలో లాంచ్‌ కానున్న V50 సిరీస్‌లోనూ నాణ్యమైన కెమెరాలను అందిస్తోంది. ఇందుకోసం ZEISS లెన్స్‌లను వినియోగిస్తోంది. దీంతోపాటు ఇప్పటికే డిజైన్ కూడా విడుదల అయింది. దీని ఆధారంగా వెనుక వైపు డ్యూయల్‌ కెమెరాలను కలిగి ఉంటుంది.

Vivo V50 Smartphone confirmed

మూడు కలర్‌ వేరియంట్స్‌ :
వివో V50 స్మార్ట్‌ఫోన్ వివో ఇండియా ఇ-స్టోర్‌ తోపాటు అమెజాన్‌, ఫ్లిప్‌కార్ట్‌ లోనూ కొనుగోలు చేయవచ్చు. ఇప్పటికే విడుదల అయిన టీజర్‌ల ఆధారంగా ఈ హ్యాండ్‌సెట్‌ రోజ్‌ రెడ్‌, స్టార్రీ బ్లూ, టైటానియం గ్రే వంటి మూడు రంగుల్లో లభిస్తుంది.

కెమెరా వివరాలు :
వెనుక వైపు Aura LED రింగ్‌ను కూడా కలిగి ఉంటుంది. ప్రస్తుతం అందుబాటులో ఉన్న వివరాల ఆధారంగా OIS (ఆప్టికల్‌ ఇమేజ్‌ స్టెబిలైజేషన్‌) సపోర్టుతో 50MP ప్రైమరీ కెమెరా, 50MP అల్ట్రావైడ్‌ కెమెరాలను కలిగి ఉంటుంది. దీంతోపాటు ముందు వైపు సెల్ఫీ, వీడియో కాల్స్ కోసం 50MP కెమెరాను అమర్చి ఉంటుంది.

Vivo V50 Smartphone confirmed

ఈ కెమెరాలు మల్టీపోకల్‌ ప్రొర్ట్రెయిట్‌, క్లాసిక్‌ ప్రొర్ట్రెయిట్‌, ల్యాండ్‌స్కేప్‌ ప్రొర్ట్రెయిట్‌ సహా బొకే ఫీచర్‌లను కలిగి ఉంటాయి. వీటితోపాటు సినిమాటిక్‌ స్ట్రైల్‌, సోనార్‌ స్ట్రైల్‌ ఫీచర్లను కలిగి ఉంది. 90W ఫాస్ట్‌ ఛార్జింగ్‌ సపోర్టుత 6000mAh బ్యాటరీతో పనిచేస్తుంది. దీంతోపాటు ఈ ఫోన్‌ IP68 + IP69 రేటింగ్‌తో కూడిన వాటర్‌ మరియు డస్ట్‌ రెసిస్టెంట్‌ గా ఉంది.

AI ఫీచర్‌లు :
ఈ వివో V50 స్మార్ట్‌ఫోన్‌ అనేక ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్‌ (AI) ఫీచర్‌లను కలిగి ఉంటుందని సంస్థ వెల్లడించింది. సర్కిల్‌ టూ సెర్చ్, లైవ్‌ కాల్‌ ట్రాన్సిలేషన్‌, ట్రాన్స్‌క్రిప్ట్‌ అసిస్ట్‌లు ఉన్నాయి. దీంతోపాటు లైట్‌ పొర్ట్రెయిట్‌ 2.0, ఎరేజ్‌ 2.0 వంటి ఎడిటింగ్‌ ఫీచర్‌లను కలిగి ఉంటాయి.

వివో V50 స్మార్ట్‌ఫోన్ క్వాడ్‌ కర్వడ్‌ డిస్‌ప్లేను కలిగి ఉంటుందని తెలిపింది. 7.39 mm థిక్‌నెస్‌తో అందుబాటులో ఉంటుంది. దీంతోపాటు 60 నెలల వరకు మెరుగైన పనితీరును కనబరుస్తుందని తెలిపింది. అయితే డిజైన్ పరంగా ఈ హ్యాండ్‌సెట్ ఆకట్టుకొనే అవకాశం ఉంది.

వివో కొత్త స్మార్ట్‌ఫోన్‌ స్నాప్‌డ్రాగన్ 7 జెన్‌ 3 SoC చిప్‌సెట్‌ తో పనిచేస్తుంది. దీంతోపాటు ఆండ్రాయిడ్ 15 ఆధారిత FuntouchOS 15 ను కలిగి ఉంది. దీంతోపాటు ఈ హ్యాండ్‌సెట్‌ 12GB ర్యామ్ + 512GB స్టోరేజీ వేరియంట్‌లో అందుబాటులోకి వచ్చే అవకాశం ఉంది.

ఇప్పటి వరకు విడుదల అయిన టీజర్‌ల ఆధారంగా ఈ ఫోన్‌ డిజైన్‌ సహా కలర్‌ వేరియంట్‌లు ఆకట్టుకుంటున్నాయి. దీంతోపాటు మెరుగైన కెమెరాలు సహా శక్తివంతమైన చిప్‌సెట్‌తో లభించనుంది. ఈ ఫోన్‌ ఈనెల 17 వ తేదీన లాంచ్ కానుంది. విడుదల తేదీ దగ్గరపడుతున్న కొద్దీ మరిన్ని వివరాలు వెల్లడయ్యే అవకాశం ఉంది.

More from GizBot

Best Mobiles in India

English summary
Vivo V50 Smartphone confirmed specs and features ahead of launch on 17th February 2025
Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
X