6000mAh బ్యాటరీ, మూడు 50MP ZEISS కెమెరాలతో వివో స్మార్ట్‌ఫోన్.. ఎప్పుడు విడుదల కానుంది..?
ప్రముఖ స్మార్ట్‌ఫోన్ ల తయారీ సంస్థ వివో (Vivo India) నుంచి త్వరలో V సిరీస్ ఫోన్ లు విడుదల కానుంది. వివో V50 సిరీస్ త్వరలో లాంచ్ కానుంది. ఈ హ్యాండ్‌సెట్‌కు సంబంధించిన అనేక లీక్స్ వచ్చాయి. ఈ ఫోన్ డిస్‌ప్లే, కెమెరా, బ్యాటరీ, OS వివరాలు లీక్ అయ్యాయి. అయితే ఈ హ్యాండ్‌సెట్ డిజైన్ ఆకట్టుకొనే అవకాశం ఉంది. దీంతోపాటు డిస్‌ప్లే, కెమెరాలు కూడా ఆకట్టుకుంటాయని తెలుస్తోంది. ఈ హ్యాండ్‌సెట్ ఈ నెలలోనే భారత్ మార్కెట్‌లో విడుదల కానుందని తెలుస్తోంది. ల్యాండింగ్ పేజీ ఆధారంగా ఈ హ్యాండ్‌సెట్ అనేక వివరాలు వెల్లడయ్యాయి.
వివో V50 స్మార్ట్‌ఫోన్ (Vivo V50 Smartphone) డిస్‌ప్లేలో ప్రధానంగా మార్పులు ఉంటాయని తెలుస్తోంది. డ్యూయల్ కర్వడ్ ఎడ్జ్ డిస్‌ప్లేకు బదులుగా.. క్వాడ్ కర్వడ్ డిస్‌ప్లేను కలిగి ఉంటుంది. ఈ డిస్‌ప్లే మెరుగైన అనుభూతిని అందిస్తుందని సంస్థ చెబుతోంది. దీంతోపాటు ఈ హ్యాండ్‌సెడ్ రెడ్ రోజ్, టైటానియం గ్రే, స్టార్రీ బ్లూ రంగుల్లో అందుబాటులో ఉండనుంది.

మూడు 50MP కెమెరాలు :
ఈ ఫోన్ కీహోల్ తరహా కెమెరాను మాడ్యుల్ ను కలిగి ఉంటుందని తెలుస్తోంది. ZEISS ఆధారిత 50MP ప్రైమరీ కెమెరాతోపాటు 50MP అల్ట్రావైడ్ లెన్స్ ను కలిగి ఉంటాయి. మరియు వెనుక వైపు Aura లైట్‌ను కలిగి ఉంటుంది. అయితే గత మోడల్ కంటే కాస్త పెద్దదిగా ఉంటుందని తెలుస్తోంది. దీంతోపాటు ముందువైపు 50MP సెల్ఫీ కెమెరాను అమర్చి ఉంటుంది.
కెమెరా ఫీచర్లు :
ఈ కెమెరాలు మల్టీపోకల్ ప్రొర్ట్రెయిట్ అందుబాటులో ఉంది. ల్యాండ్‌స్కేప్ ప్రొర్ట్రెయిట్, క్లాసిక్ ప్రొర్ట్రెయిట్ సహా మరిన్ని ఫీచర్‌లను కలిగి ఉన్నాయి. దీంతోపాటు బొకే ఫీచర్ లు కూడా ఉన్నాయి. సినిమాటిక్ స్ట్రైల్, సోనార్ స్ట్రైల్ సహా మరిన్ని పీచర్‌లున్నాయి. నైట్ ప్రొర్ట్రెయిట్ కోసం AI స్టూడియో లైట్ పొర్ట్రెయిట్ 2.0 ను సపోర్టు చేస్తుంది.

భారీ బ్యాటరీ :
దీంతోపాటు భారీ బ్యాటరీతో విడుదల కానుంది. ల్యాండింగ్ పేజీ ఆధారంగా 6000mAh బ్యాటరీతో పనిచేస్తుంది. అయితే భారీ బ్యాటరీ కలిగినా.. స్లిమ్ డిజైన్ ను కలిగి ఉంటుంది. ఈ వివో స్మార్ట్‌ఫోన్ IP68 మరియు IP69 రేటింగ్ తో డస్ట్ మరియు వాటర్ రెసిస్టెంట్ గా ఉంటుంది.
ఎక్కువ రోజులపాటు మన్నిక వచ్చేలా :
ఈ హ్యాండ్‌సెట్ 60 నెలల వరకు మెరుగైన పనితీరును అందిస్తుందని తెలుస్తోంది. దీంతోపాటు ఈ హ్యాండ్‌సెట్ అనేక ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ ఫీచర్‌లను కలిగి ఉంటుంది. దీంతోపాటు ఈ హ్యాండ్‌సెట్ ఆండ్రాయిడ్ 15 ఆధారిత Funtouch OS 15 తో పనిచేస్తుంది. క్వాల్‌కాం స్నాప్‌డ్రాగన్ 7 జెన్ 3 SoC చిప్‌సెట్‌తో పనిచేస్తుందని తెలుస్తోంది.

ఎప్పుడు లాంచ్ కానుంది?
అయితే వివో V50 స్మార్ట్‌ఫోన్ ఎప్పుడు విడుదల కానుందనే వివరాలను సంస్థ వెల్లడించలేదు. అయితే తాజా లీక్స్ ఆధారంగా భారత్ మార్కెట్ లో ఫిబ్రవరి 18 వ తేదీన లాంచ్ కానుందని తెలుస్తోంది. ఈ హ్యాండ్‌సెట్ మిగిలిన ీ స్పెసిఫికేషన్ లు, ఫీచర్ ల సమాచారం సహా సేల్ వివరాలు తెలియాల్సి ఉంది.
వివో ల్యాండింగ్ పేజీ ఆధారంగా ఈ హ్యాండ్‌సెట్ డిజైన్ అత్యంత ఆకట్టుకొనే విధంగా ఉంది. దీంతోపాటు కెమెరా విభాగానికి అత్యంత ప్రాధాన్యత ఇచ్చినట్లు తెలుస్తోంది. అనేక కెమెరా ఫీచర్‌లను కలిగి ఉంది. అయితే ఛార్జింగ్ వేగం తెలియాల్సి ఉంది. అయితే డిస్‌ప్లేకు సంబంధించిన మరిన్ని వివరాలు తెలియాల్సి ఉంది.


Click it and Unblock the Notifications








