మూడు 50MP కెమెరాలు, 6000mAh బ్యాటరీ, అద్భుతమైన డిజైన్‌తో Vivo V50 స్మార్ట్‌ఫోన్.. రేపే విడుదల!
వివో నుంచి భారత్ మార్కెట్ లోకి రేపు (ఫిబ్రవరి 17) మధ్యాహ్నం 12 గంటలకు వివో V50 స్మార్ట్‌ఫోన్ (Vivo V50 Smartphone Launch) విడుదల కానుంది. వివో స్టోర్, ప్రముఖ ఇ-కామర్స్ ప్లాట్‌ఫాం ఫ్లిప్‌కార్ట్ ద్వారా సేల్ ప్రారంభం కానుంది. ఇప్పటికే ఈ హ్యాండ్‌సెట్ డిజైన్, డిస్‌ప్లే, కెమెరా, బ్యాటరీ, చిప్‌సెట్, OS సహా అనేక వివరాలు వెల్లడయ్యాయి. అయితే ఈ హ్యాండ్‌సెట్ డిజైన్ ఆకట్టుకుంటోంది. దీంతోపాటు ఈ హ్యాండ్‌సెట్ మెరుగైన డస్ట్, వాటర్ రెసిస్టెంట్ గా లాంచ్ కానుందని తెలుస్తోంది. దీంతోపాటు అనేక ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ ఫీచర్‌లను కలిగి ఉంటుందని తెలుస్తోంది.
ZEISS కెమెరాలతో :
ఈ స్మార్ట్‌ఫోన్‌లో కెమెరా విభాగానికి అత్యంత ప్రాధాన్యత ఇచ్చారు. ఇందుకోసం ZEISS తో భాగస్వామ్యం కుదుర్చుకుంది. ఈ హ్యాండ్‌సెట్ వెనుక వైపు డ్యూయల్ కెమెరాలను కలిగి ఉంది. OIS (ఆప్టికల్ ఇమేజ్ స్టెబిలైజేషన్) 50MP ZEISS ప్రైమరీ కెమెరాను కలిగి ఉంటుంది.

4K వీడియో రికార్డింగ్ :
దీంతోపాటు 119 డిగ్రీల ఫీల్డ్ వ్యూ, 4K వీడియో రికార్డింగ్, ఆటోఫోకస్ సామర్థ్యంలో 50MP అల్ట్రావైడ్ యాంగిల్ కెమెరాను కలిగి ఉంటుంది. మరియు సెల్ఫీ, వీడియో కాల్స్ కోసం 50MP సెల్ఫీ కెమెరాను కలిగి ఉంటుంది. మల్టీపోకల్ ప్రొర్ట్రెయిట్, క్లాసిక్ ప్రొర్ట్రెయిట్, ల్యాండ్‌స్కేప్ ప్రొర్ట్రెయిట్. సినిమాటిక్ స్ట్రైల్, సోనార్ స్ట్రైల్ ఫీచర్లను కలిగి ఉంటుంది.
క్వాడ్ కర్వడ్ డిస్‌ప్లే :
వివో ల్యాండింగ్ పేజీ ఆధారంగా ఈ ఫోన్ అల్ట్రా స్లిమ్ క్వాడ్ కర్వడ్ డిస్‌ప్లే, 41 డిగ్రీ గోల్డెన్ కర్వేచర్ డిజైన్‌ను కలిగి ఉంటుంది. ప్రస్తుతం అందుబాటులో ఉన్న వివరాల ఆధారంగా 120Hz రీఫ్రెష్ రేట్‌తో 6.67 అంగుళాల FHD+ అమోలెడ్ డిస్‌ప్లేను కలిగి ఉంటుందని తెలుస్తోంది. ఈ డిస్‌ప్లే అత్యంత మెరుగైన అనుభూతిని అందిస్తుందని తెలుస్తోంది.

చిప్‌సెట్, OS వివరాలు :
ఈ ఫోన్ స్నాప్‌డ్రాగన్ 7 జెన్ 3 చిప్‌సెట్‌ను కలిగి ఉంటుంది. దీంతోపాటు ఆండ్రాయిడ్ 15 ఆధారిత Funtouch OS 15 ను కలిగి ఉంటుంది. దీంతోపాటు ఈ ఫోన్ అత్యంత మెరుగైన డ్రాప్ రెసిస్టెన్స్‌ను కలిగి ఉంటుంది. డైమండ్ షీల్డ్ గ్లాస్‌ను కలిగి ఉండనుందని తెలుస్తోంది.
స్మార్ట్ AI ఫీచర్‌లు :
వివో V50 హ్యాండ్‌సెట్ స్మార్ట్ AI ఫీచర్‌లను కలిగి ఉంటాయి. సర్కిల్ టూ సెర్చ్, లైవ్ కాల్ ట్రాన్సిలేషన్, ట్రాన్స్‌క్రిప్ట్ అసిస్ట్ వంటి ఫీచర్‌లు సహా లైట్ పొర్ట్రెయిట్ 2.0, ఎరేజ్ 2.0 వంటి ఎడిటింగ్ ఫీచర్‌లతో భారత్‌లో అందుబాటులోకి రానుంది. ఈ ఫోన్ 60 నెలలపాటు వినియోగించిన అనంతరం కూడా మెరుగైన పనితీరును కనబరుస్తుందని వివో చెబుతోంది.
భారీ బ్యాటరీ :
ఈ వివో ఫోన్ 90W ఫాస్ట్ ఛార్జింగ్ సపోర్టుతో 6000mAh బ్యాటరీతో పనిచేస్తుంది. భద్రత కోసం ఇన్‌డిస్‌ప్లే ఫింగర్ ప్రింట్ సెన్సార్‌ను కలిగి ఉంటుంది. ఈ ఫోన్ IP68 + IP69 రేటింగ్‌తో కూడిన వాటర్ మరియు డస్ట్ రెసిస్టెంట్‌గా ఉంది. ఈ హ్యాండ్‌సెట్ ధర సుమారుగా రూ.35000 రేంజ్‌లో ఉండే అవకాశం ఉంది.
ఈ వివో V50 స్మార్ట్‌ఫోన్ రేపు మధ్యాహ్నం 12 గంటలకు విడుదల కానుంది. విడుదల సమయంలోనే ధర సహా సేల్, బ్యాంక్ డిస్కౌంట్ ఆఫర్ లను ప్రకటన చేయనుంది. మిడ్ రేంజ్ లోనే ఈ హ్యాండ్‌సెట్ లాంచ్ కానుందని తెలుస్తోంది. అయితే ఈ హ్యాండ్‌సెట్ ఎన్ని స్టోరేజీ వేరియంట్స్ లో విడుదల కానుందనే సమాచారం వెల్లడి కాలేదు.


Click it and Unblock the Notifications