50MP +50MP +50MP కెమెరాల Vivo ఫోన్‌పై రూ.2000 తగ్గింపు.. 6000mAh బ్యాటరీ, క్వాడ్ కర్వడ్ అమోలెడ్ డిస్‌ప్లే!
Vivo V50 Smartphone Price Cut : ప్రముఖ స్మార్ట్‌ఫోన్ ల తయారీ సంస్థ వివో నుంచి ఇవాళ వివో V60 స్మార్ట్‌ఫోన్ లాంచ్ అయింది. మిడ్ రేంజ్ ధరలో ఈ ఫోన్ అందుబాటులోకి వచ్చింది. 50MP టెలిఫోటో లెన్స్‌తోపాటు 6500mAh బ్యాటరీని కలిగి ఉంది. అయితే ఈ సంవత్సరం ఫిబ్రవరి నెలలో విడుదల అయిన వివో V50 హ్యాండ్‌సెట్ ధరను తగ్గించింది. దీంతోపాటు బ్యాంకు కార్డులపై మరింత డిస్కౌంట్‌ను పొందవచ్చు.
రూ.2000 డిస్కౌంట్ :
వివో V50 స్మార్ట్‌ఫోన్ విడుదల సమయంలో 8GB ర్యామ్ + 128GB స్టోరేజీ ధర రూ.34,999, 8GB ర్యామ్ + 256GB స్టోరేజీ రూ.36,999, 12GB ర్యామ్ + 512GB స్టోరేజీ ధర రూ.40,999 గా ఉంది. ప్రస్తుతం ఈ ఫోన్ ధర రూ.2000 చొప్పున తగ్గించింది.

బ్యాంకు కార్డులపై గరిష్ఠంగా రూ.3 వేల డిస్కౌంట్ :
ఫలితంగా ఫోన్ ప్రారంభ ధర రూ.32999 గా ఉంది. మరియు మిగిలిన రెండు వేరియంట్స్ ధరలు రూ.34999, రూ.38999 గా ఉంది. అమెజాన్‌లో ఎంపిక చేసిన బ్యాంకు కార్డులపై గరిష్ఠంగా రూ.3000 డిస్కౌంట్‌ను పొందవచ్చు. ఈ ఫోన్ రోజ్ రెడ్, స్టార్రీ నైట్, టైటానియం గ్రే కలర్ వేరియంట్స్ లో లభిస్తుంది.
స్నాప్‌డ్రాగన్ చిప్‌సెట్ :
వివో V50 స్మార్ట్‌ఫోన్ 6.77 అంగుళాల క్వాడ్ కర్వడ్ అమోలెడ్ డిస్‌ప్లేను కలిగి ఉంది. 120Hz రీఫ్రెష్ రేట్, 4500 నిట్స్ పీక్ బ్రైట్‌నెస్ ను కలిగి ఉంది. ఈ ఫోన్ స్నాప్‌డ్రాగన్ 7 జెన్ 3 SoC చిప్‌సెట్, ఆండ్రాయిడ్ 15 ఆధారిత Funtouch OS 15 పైన పనిచేస్తోంది.

6000mAh బ్యాటరీ :
ఈ స్మార్ట్‌ఫోన్ 3 సంవత్సరాల ఆండ్రాయిడ్ OS అప్‌డేట్స్, 4 సంవత్సరాల సెక్యూరిటీ అప్‌డేట్స్ ను పొందుతుంది. మరియు 90W వైర్ ఫాస్ట్ ఛార్జింగ్ సపోర్టుతో 6000mAh బ్యాటరీని కలిగి ఉంది. సర్కిల్ టూ సెర్చ్, లైవ్ కాల్ ట్రాన్స్‌లేషన్ వంటి అనేక ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ (AI) ఫీచర్‌లను కలిగి ఉంది.
50MP + 50MP + 50MP కెమెరాలు :
కెమెరా విభాగం పరంగా ఈ వివో ఫోన్ Zeiss భాగస్వామ్యంతో కూడిన కెమెరాలను కలిగి ఉంది. ఈ ఫోన్ వెనుక వైపు రెండు కెమెరాలను కలిగి ఉంది. ఇందులో OIS ( ఆప్టికల్ ఇమేజ్ స్టెబిలైజేషన్ ) సపోర్టుతో 50MP ప్రైమరీ కెమెరాను కలిగి ఉంది. మరియు 50MP అల్ట్రావైడ్ లెన్స్ కెమెరాతోపాటు Aura లైట్ ను కలిగి ఉంది.
సెల్ఫీ, వీడియో కాల్స్ కోసం 50MP సెల్ఫీ కెమెరాను అమర్చి ఉంది. ఈ ఫోన్ లు AI Erase 2.0, AI లైట్ పొర్ట్రెయిట్ 2.0 వంటి ఫీచర్లను కలిగి ఉంది. ఈ హ్యాండ్‌సెట్ IP68 + IP69 రేటింగ్‌తో డస్ట్ మరియు వాటర్ రెసిస్టెంట్‌గా ఉంది. సెక్యూరిటీ కోసం ఆప్టికల్ ఫింగర్ ప్రింట్ సెన్సర్ ను కలిగి ఉంది.


Click it and Unblock the Notifications








