రూ.6 వేల డిస్కౌంట్.. 50MP సెల్ఫీ కెమెరా, క్వాడ్ కర్వడ్ డిస్‌ప్లే, 90W ఛార్జింగ్ సపోర్టు సహా..!
Vivo V50e Smartphone : ప్రముఖ స్మార్ట్‌ఫోన్ ల తయారీ సంస్థ వివో ఈ సంవత్సరం అనేక మోడల్స్‌ను లాంచ్ చేసింది. అయితే V50 సిరీస్ లో భాగంగా వివో V50e స్మార్ట్‌ఫోన్‌ను విడుదల చేసింది. ఈ ఫోన్ క్వాడ్ కర్వడ్ డిస్‌ప్లే, 4 సంవత్సరాల వరకు అప్‌డేట్స్, 50MP సెల్ఫీ కెమెరాను కలిగి ఉంది. IP68 + IP69 రేటింగ్‌తో డస్ట్, వాటర్ రెసిస్టెంట్ గా ఉంది. ప్రస్తుతం ఈ ఫోన్ ను భారీ డిస్కౌంట్ ధరకు కొనుగోలు చేయవచ్చు.
ఫ్లిప్‌కార్ట్ బిగ్ బ్యాంగ్ దీపావళి 2025 సేల్ :
వివో V50e స్మార్ట్‌ఫోన్ విడుదల సమయంలో 8GB ర్యామ్ + 128GB స్టోరేజీ ధర రూ.28,999, 8GB ర్యామ్ + 256GB స్టోరేజీ వేరియంట్ ధర రూ.30,999 గా ఉంది. ప్రస్తుతం ఫ్లిప్‌కార్ట్ బిగ్ బ్యాంగ్ దీపావళి 2025 సేల్‌లో (Flipkart Big Bang Diwali Sale 2025) భాగంగా భారీ డిస్కౌంట్ ధరకు సొంతం చేసుకోవచ్చు.

గరిష్ఠంగా రూ.6 వేల డిస్కౌంట్ :
ప్రస్తుతం ఫ్లిప్‌కార్ట్‌లో ఈ ఫోన్ బేస్ వేరియంట్‌ను రూ.23,898 (పెర్ల్ వైట్), టాప్ ఎండ్ వేరియంట్ ను రూ.24880 (పెర్ల్ వైట్) ధరకు కొనుగోలు చేయవచ్చు. అంటే 8GB/128GB పై సుమారు రూ.4 వేలు, 8GB/256GB వేరియంట్ పై రూ.6 వేల వరకు తగ్గింపును పొందవచ్చు. SBI బ్యాంకు కార్డులపై 10 శాతం అదనపు డిస్కౌంట్‌ను పొందవచ్చు.
వివో ఫోన్ స్పెసిఫికేషన్లు, ఫీచర్లు :
వివో V50e స్మార్ట్‌ఫోన్ 6.77 అంగుళాల FHD+ క్వాడ్ కర్వడ్ అమోలెడ్ డిస్‌ప్లేతో అందుబాటులో ఉంది. ఈ డిస్‌ప్లే 120Hz రీఫ్రెష్ రేట్, 1800 నిట్స్ పీక్ బ్రైట్‌నెస్, 300Hz టచ్ శాంప్లింగ్ రేట్ ను కలిగి ఉంది. ఈ డిస్‌ప్లే డైమండ్ షీల్డ్ గ్లాస్ ప్రొటెక్షన్ ను పొందుతుంది.
ఈ ఫోన్ డిస్‌ప్లే HDR10+ సపోర్టు చేస్తుంది. మరియు SGS Low బ్లూ లైట్ సర్టిఫికేషన్‌ను కూడా కలిగి ఉంది. ఈ హ్యాండ్‌సెట్ IP68 + IP69 రేటింగ్‌తో డస్ట్, వాటర్ రెసిస్టెంట్ గా ఉంది. సెక్యూరిటీ కోసం ఇన్-డిస్‌ప్లే ఫింగర్ ప్రింట్ సెన్సార్‌ను కలిగి ఉంది.
4 సంవత్సరాల వరకు అప్‌డేట్స్ :
ఈ ఫోన్ 4nm మీడియాటెక్ డైమెన్సిటీ 7300 SoC చిప్‌సెట్, ఆండ్రాయిడ్ 15 ఆధారిత FuntouchOS 15 తో పనిచేస్తోంది. 3 ఆండ్రాయిడ్ OS అప్‌డేట్స్, 4 సంవత్సరాల వరకు సెక్యూరిటీ అప్‌డేట్స్‌ను పొందుతుంది. 90W వైర్ ఫాస్ట్ ఛార్జింగ్ సపోర్టుతో 5600mAh బ్యాటరీతో పనిచేస్తోంది.
50MP + 50MP కెమెరాలు :
కెమెరా విభాగం పరంగా OIS సపోర్టుతో 50MP సోనీ IMX882 కెమెరా, 8MP అల్ట్రావైడ్ యాంగిల్ కెమెరా మరియు 50MP సెల్ఫీ కెమెరాను కలిగి ఉంది. కనెక్టివిటీ పరంగా 5G, 4G LTE, Wi-Fi, బ్లూటూత్, GPS, OTG, USB-C ఛార్జింగ్ పోర్టును కలిగి ఉంది.


Click it and Unblock the Notifications








