50MP సోనీ కెమెరా, క్వాడ్ కర్వడ్ డిస్‌ప్లే, AI ఫీచర్‌లతో వివో ఫోన్.. విడుదల తేదీ వెల్లడి..!
వివో V సిరీస్ నుంచి ఇటీవల V50 స్మార్ట్‌ఫోన్ లాంచ్ అయింది. ఈ సిరీస్‌లో భాగంగా వివో V50e స్మార్ట్‌ఫోన్ (Vivo V50e Smartphone Launch Date) కూడా విడుదల కానుంది. ఇప్పటికే ఈ హ్యాండ్‌సెట్‌కు సంబంధించిన అనేక వివరాలు వెల్లడయ్యాయి. అయితే తాజాగా ఈ హ్యాండ్‌సెట్ విడుదల తేదీ వెల్లడయింది. గత సంవత్సరం విడుదల అయిన వివో V40e స్మార్ట్‌ఫోన్‌కు తర్వాత తరం వెర్షన్‌గా విడుదల కానుందని తెలుస్తోంది.
ఎప్పుడు విడుదల కానుంది? :
వివో V50e స్మార్ట్‌ఫోన్ భారత్ మార్కెట్‌లో ఏప్రిల్ 10 వ తేదీ మధ్యాహ్నం 12 గంటల విడుదల కానుంది. వివో ఇండియా తమ అధికారిక X ప్లాట్‌ఫాం ద్వారా ఈ వివరాలనుు వెల్లడించింది. దీంతోపాటు వివో ఈ హ్యాండ్‌సెట్‌కు సంబంధించి లైవ్ పేజీని కూడా కలిగి ఉంది.

వాటర్ ప్రూఫ్ :
ఈ ఫోన్ వివో ఇండియా ఇ-స్టోర్ తోపాటు ప్రముఖ ఇ-కామర్స్ ప్లాట్‌ఫాం ఫ్లిప్‌కార్ట్ ద్వారా కొనుగోలు చేసేందుకు అందుబాటులో ఉంటుంది. ఈ వివో హ్యాండ్‌సెట్ IP68, IP69 రేటింగ్‌తో మెరుగైన డస్ట్ మరియు వాటర్ రెసిస్టెంట్‌గా అందుబాటులోకి వస్తుంది. ఈ వివో కొత్త హ్యాండ్‌సెట్ పెర్ల్ వైట్, సఫైర్ బ్లూ కలర్ వేరియంట్స్‌లో లభిస్తుంది.
క్వాడ్ కర్వడ్ డిస్‌ప్లే :
వివో v50e స్మార్ట్‌ఫోన్ 7.3mm థిక్‌నెస్‌తో 120Hz రీఫ్రెష్ రేట్‌తో క్వాడ్ కర్వడ్ డిస్‌ప్లే ను కలిగి ఉంటుంది. ప్రస్తుతం అందుబాటులో ఉన్న లీక్స్ ఆధారంగా 6.77 అంగుళాల డిస్‌ప్లేతో లాంచ్ అయ్యే అవకాశం ఉంది. ఇప్పటికే డిజైన్ ఆకట్టుకుంది.

ఫ్లిప్‌కార్ట్ మైక్రోసైట్ ఆధారంగా వివో V50e స్మార్ట్‌ఫోన్ వెనుక వైపు డ్యూయల్ కెమెరాలను కలిగి ఉంటుంది. OIS (ఆప్టికల్ ఇమేజ్ స్టెబిలైజేషన్) సపోర్టుతో 50MP సోనీ IMX882 ప్రైమరీ కెమెరా, 116 డిగ్రీల ఫీల్డ్ వ్యూతో మరో అల్ట్రావైడ్ యాంగిల్ లెన్స్‌ను కలిగి ఉంటుంది. సర్కులర్ Aura లైట్ ఫీచర్‌ను కూడా ఉంటుంది. ఈ ఫోన్ 50MP సెల్ఫీ కెమెరాతో అందుబాటులోకి వస్తుంది.
ఈ ఫోన్ AI నోట్ అసిస్ట్, AI Image Expander, AI ట్రాన్స్‌క్రిప్ట్ అసిస్ట్, సర్కిల్ టూ సెర్చ్ వంటి ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ ఆధారిత ఫీచర్‌లను కలిగి ఉంటుంది. లీక్స్ ఆధారంగా వివో v50e హ్యాండ్‌సెట్ మీడియాటెక్ డైమెన్సిటీ 7300 SoC చిప్‌సెట్, ఆండ్రాయిడ్ 15 ఆధారిత Funtouch OS 15 తో పనిచేసే అవకాశం ఉంది.
ఈ ఫోన్ ధరపై కచ్చితమైన అంచనాలు వెల్లడి కాకపోయినా.. లీక్స్ ఆధారంగా ఈ ఫోన్ ధర రూ.25,000 నుంచి రూ.30,000 మధ్య ఉండే అవకాశం ఉంది. మరియు భద్రత కోసం ఇన్ డిస్‌ప్లే ఫింగర్ ప్రింట్ సెన్సార్‌ను కలిగి ఉంటుందని సమాచారం.
వివో V50 స్మార్ట్‌ఫోన్ :
భారత్ మార్కెట్‌లో ప్రస్తుతం అందుబాటులో ఉన్న వివో V50 స్మార్ట్‌ఫోన్ ఆకట్టుకొనే డిజైన్, కలర్ వేరియంట్స్‌తో 6.77 అంగుళాల క్వాడ్ కర్వడ్ అమోలెడ్ డిస్‌ప్లేను కలిగి ఉంది. ఈ ఫోన్ 50MP ప్రైమరీ + 50MP వెనుక కెమెరాలను కలిగి ఉంది. దీంతోపాటు సెల్ఫీ, వీడియో కాల్స్ కోసం 50MP సెల్ఫీ కెమెరా అమర్చారు.
ఈ ఫోన్ క్వాల్‌కామ్ స్నాప్‌డ్రాగన్ 7 జెన్ 3 SoC చిప్‌సెట్, ఆండ్రాయిడ్ 15 ఆధారిత Funtouch OS 15 తో పనిచేస్తోంది. 90W వైర్ ఫాస్ట్ ఛార్జింగ్ సపోర్టుతో 6000mAh బ్యాటరీని కలిగి ఉంది. 8GB ర్యామ్ + 128GB స్టోరేజీ ధర రూ.34,999, 8GB ర్యామ్ + 256GB స్టోరేజీ రూ.36,999, 12GB ర్యామ్ + 512GB స్టోరేజీ ధర రూ.40,999 గా ఉంది.


Click it and Unblock the Notifications