అండర్‌వాటర్ ఫోటోగ్రఫీ, 90W ఫాస్ట్ ఛార్జింగ్, డైమండ్ షీల్డ్ గ్లాస్, 50MP సెల్ఫీ కెమెరా ఫోన్.. నేడే విడుదల
వివో నుంచి ఇవాళ భారత్ మార్కెట్లోకి వివో V50e స్మార్ట్‌ఫోన్ (Vivo V50e Smartphone) విడుదల కానుంది. మధ్యాహ్నం 12 గంటలకు లాంచ్ కానుంది. ఇప్పటికే ఈ హ్యాండ్‌సెట్‌కు సంబంధించిన అనేక వివరాలు వెల్లడయ్యాయి. డిజైన్, చిప్‌సెట్, కెమెరా, బ్యాటరీ స్పెసిఫికేషన్లు వెల్లడయ్యాయి. ఈ ఫోన్ కర్వడ్ ఫ్రేమ్, గ్లాస్ బ్యాక్‌తో స్లిమ్ డిజైన్‌ను కలిగి ఉంటుంది.
వివో V50e స్మార్ట్‌ఫోన్ IP68 + IP69 రేటింగ్‌తో డస్ట్ మరియు వాటర్ రెసిస్టెంట్‌గా విడుదల కానుందని సంస్థ తెలిపింది. మరియు ఈ ఫోన్ డైమండ్ షీల్డ్ గ్లాస్ ప్రొటెక్షన్‌తో లాంచ్ కానుంది. ఫలితంగా స్క్రాచ్, డ్రాప్ రెసిస్టెన్స్‌తో అందుబాటులో ఉంది. ఈ ఫోన్ 120Hz రీఫ్రెష్ రేట్‌తో క్వాడ్ కర్వడ్ అమోలెడ్ డిస్‌ప్లేను కలిగి ఉండే అవకాశం ఉందని తెలుస్తోంది.

వివో V50e స్మార్ట్‌ఫోన్ మీడియాటెక్ డైమెన్సిటీ 7300 చిప్‌సెట్ తో పనిచేస్తుంది. మరియు ఆండ్రాయిడ్ 15 ఆధారిత ఫీచర్లను కలిగి ఉంటుందని తెలుస్తోంది. ఈ హ్యాండ్‌సెట్ 90W ఫాస్ట్ ఛార్జింగ్ సపోర్టుతో 5600mAh బ్యాటరీని కలిగి ఉంటుంది. ఫలితంగా తక్కువ సమయంలోనే పూర్తి ఛార్జింగ్ కావడంతోపాటు ఎక్కువ బ్యాటరీ లైఫ్‌ను అందిస్తుందని తెలుస్తోంది.
కెమెరాలు :
కెమెరా విభాగం పరంగా వివో హ్యాండ్‌సెట్ వెనుక వైపు డ్యూయల్ కెమెరాలను కలిగి ఉంటుంది. OIS (ఆప్టికల్ ఇమేజ్ స్టెబిలైజేషన్) 50MP సోనీ IMX882 ప్రైమరీ కెమెరా, మరియు 8MP అల్ట్రావైడ్ లెన్స్‌ను అమర్చి ఉంటుంది. దీంతోపాటు ముందువైపు ఐ ఆటోఫోకస్ సామర్థ్యంతో 50MP సెల్ఫీ కెమెరాను కలిగి ఉంటుంది.
ఈ కెమెరాల ద్వారా 4K నాణ్యతతో వీడియో రికార్డింగ్ చేయవచ్చు. ఈ ఫోన్ అండర్ వాటర్ ఫోటోగ్రఫీ మోడ్‌ను సపోర్టు చేస్తుంది. ఈ ఫీచర్ వినియోగదారులను ఆకట్టుకొనే అవకాశం ఉంది. ఈ హ్యాండ్‌సెట్ ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ (AI) ఆధారిత ఫీచర్లను కలిగి ఉంటుంది. మేజిక్ ఎరేజర్, నోట్ అసిస్ట్, ట్రాన్స్‌క్రిప్ట్ అసిస్ట్, మరియు సర్కిల్ టూ సెర్చ్ వంటి ఫీచర్‌తో లాంచ్ కానుంది.
ఈ ఫోన్ బ్లూ కలర్ వేరియంట్ శాండ్ టెక్చర్డ్ ఫినిష్‌ను కలిగి ఉంది. గత వివో సిరీస్ మోడల్స్ తరహాలోనే Pendulum స్టైల్ రియర్ కెమెరా మాడ్యూల్ కలిగి ఉంటుంది. ఇవాళ మధ్యాహ్నం 12 గంటలకు విడుదల కానుంది. ఈ హ్యాండ్‌సెట్ డ్యూయల్ టోన్ పర్పుల్, వైట్ ఫినిష్ మరియు సఫైర్ బ్లూ కలర్ వేరియంట్స్‌లో లభిస్తుంది.
వివో ఇండియా :
వివో V50e స్మార్ట్‌ఫోన్ భారత్ మార్కెట్‌లో ప్రారంభ ధర రూ.30 వేల కంటే తక్కువ ధరలో అందుబాటులోకి వచ్చే అవకాశం ఉంది. ఈ ఫోన్ వివో ఇండియా, అమెజాన్ ద్వారా సేల్ ప్రారంభం కానుంది. Aura లైట్ ను కూడా కలిగి ఉంటుంది.
వివో V50 స్మార్ట్‌ఫోన్ 6.77 అంగుళాల క్వాడ్ కర్వడ్ అమోలెడ్ డిస్‌ప్లేను కలిగి ఉంది. ఈ ఫోన్ 50MP + 50MP వెనుక కెమెరాలతోపాటు 50MP సెల్ఫీ కెమెరాను కలిగి ఉంది. క్వాల్‌కామ్ స్నాప్‌డ్రాగన్ 7 జెన్ 3 SoC చిప్‌సెట్‌ను కలిగి ఉంది.ఆండ్రాయిడ్ 15 ఆధారిత Funtouch OS 15 ను కలిగి ఉంది.
90W వైర్ ఫాస్ట్ ఛార్జింగ్ సపోర్టుతో 6000mAh బ్యాటరీతో పనిచేస్తోంది. 8GB ర్యామ్ + 128GB స్టోరేజీ ధర రూ.34,999, 8GB ర్యామ్ + 256GB స్టోరేజీ రూ.36,999, 12GB ర్యామ్ + 512GB స్టోరేజీ ధర రూ.40,999 గా ఉంది.


Click it and Unblock the Notifications








