Home
Mobile

వివో నుంచి మరో 5G స్మార్ట్‌ఫోన్‌.. స్పెసిఫికేషన్‌లు, ఫీచర్‌లు, విడుదల, ధర వివరాలు..!

వివో నుంచి గత నెలలో వివో V50 స్మార్ట్‌ఫోన్‌ లాంచ్‌ అయింది. ప్రస్తుతం కొనుగోలు చేసేందుకు అందుబాటులో ఉంది. ఈ హ్యాండ్‌సెట్‌ ఆకట్టుకొనే డిజైన్‌ సహా మెరుగైన కెమెరాలను కలిగి ఉంది. దీంతోపాటు ఎక్కువ రోజులపాటు మన్నిక వచ్చేలా రూపొందించారు. ఈ హ్యాండ్‌సెట్‌ రూ.35,000 ధరలో అందుబాటులో ఉంది. ఈ ఫోన్‌ ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్‌ ఫీచర్‌లతోపాటు క్వాడ్‌ కర్వడ్‌ డిస్‌ప్లేను కలిగి ఉంది.

ఇటీవలే బడ్జెట్‌ రేంజ్‌ ఫోన్ :
దీంతోపాటు వివో నుంచి రూ.15 వేల ధరలో వివో T4x 5G స్మార్ట్‌ఫోన్ లాంచ్‌ అయింది. ఈ ఫోన్ ఏకంగా 6500mAh బ్యాటరీని కలిగి ఉంది. 5౦MP ప్రైమరీ కెమెరాతోపాటు మీడియాటెక్‌ డైమెన్సిటీ 7300 SoC చిప్‌సెట్ తో అందుబాటులో ఉంది. ఈ ఫోన్‌ ప్రారంభ ధర రూ.12,999 గా ఉంది.

Vivo V50e Smartphone

వివో నుంచి త్వరలో మరో హ్యాండ్‌సెట్‌ లాంచ్‌ కానుంది. వివో V50e పేరుతో (Vivo V50e Smartphone) విడుదల కానుందని తెలుస్తోంది. ఇప్పటికే ఈ మోడల్‌ గీక్‌బెంచ్‌లో కనిపించింది. దీని ఆధారంగా ఈ హ్యాండ్‌సెట్ కు సంబంధించిన కొన్ని వివరాలు వెల్లడయ్యాయి. ఈ ఫోన్ ఏప్రిల్ నెలలో విడుదల అయ్యే అవకాశం ఉంది.

వివో V50e ఫోన్ అంచనా వివరాలు :
ప్రస్తుతం అందుబాటులో ఉన్న వివరాల ఆధారంగా వివో V50e హ్యాండ్‌సెట్‌ 120Hz రీఫ్రెష్‌ రేట్‌తో 6.77 అంగుళాల 1.5k క్వాడ్‌ కర్వడ్‌ అమోలెడ్‌ డిస్‌ప్లేను కలిగి ఉంటుందని తెలుస్తోంది. ఆండ్రాయిడ్ 15 ఆధారిత OS తోపాటు మీడియాటెక్‌ డైమెన్సిటీ 7300 SoC ప్రాసెసర్‌తో లాంచ్ అయ్యే అవకాశం ఉంది. గరిష్ఠంగా 256GB స్టోరేజీతో లాంచ్‌ కానుందని తెలుస్తోంది.

కెమెరా విభాగం పరంగా డ్యూయల్‌ కెమెరాలను కలిగి ఉంటుందని తెలుస్తోంది. 50MP సోనీ IMX882 చిప్‌సెట్‌తోపాటు 8MP అల్ట్రావైడ్‌ కెమెరాతో అందుబాటులోకి వచ్చే అవకాశం ఉంది. మరియు ముందువైపు 50MP సెల్ఫీ కెమెరాను అమర్చి ఉండే అవకాశం ఉంది.

ఈ హ్యాండ్‌సెట్ 90W వైర్‌ ఫాస్ట్‌ ఛార్జింగ్ సపోర్టుతో 5600mAh బ్యాటరీతో లాంచ్‌ అయ్యే అవకాశం ఉంది. ఈ హ్యాండ్‌సెట్‌ IP69 రేటింగ్‌తో డస్ట్‌ మరియు వాటర్ రెసిస్టెంట్‌గా విడుదలయ్యే అవకాశం ఉంది. మరియు భద్రత కోసం ఇన్‌డిస్‌ప్లే ఫింగర్ ప్రింట్‌ సెన్సార్‌ను కలిగి ఉంటుందని భావిస్తున్నారు.

ఈ హ్యాండ్‌సెట్‌ రూ.25,000 నుంచి రూ.30,000 ధరను కలిగి ఉండే అవకాశం ఉంది. ఈ ఫోన్‌ ఏప్రిల్‌లో భారత్‌ మార్కెట్‌లో విడుదలయ్యే అవకాశం ఉంది. ప్రస్తుతం అందుబాటులో ఉన్న వివో V50 స్మార్ట్‌ఫోన్‌ కంటే ఈ కొత్త ఫోన్ మెరుగైన ఫీచర్‌లను కలిగి ఉండే అవకాశం ఉంది. స్మార్ట్‌ప్రిక్స్‌ ద్వారా ఈ వివరాలు వెల్లడయ్యాయి.

ఈ ఫోన్‌ 50MP + 50MP వెనుక కెమెరాలతోపాటు 50MP సెల్ఫీ కెమెరాను కలిగి ఉంది. 8GB ర్యామ్ + 128GB స్టోరేజీ వేరియంట్ ధర రూ.34,999, 8GB ర్యామ్ + 256GB స్టోరేజీ రూ.36,999, 12GB ర్యామ్ + 512GB స్టోరేజీ వేరియంట్‌ ధర రూ.40,999 గా ఉంది.

More from GizBot

Best Mobiles in India

English summary
Vivo V50e Smartphone may launch in india soon here are the Expected specifications and launch date
Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
X