50MP సెల్ఫీ కెమెరా, 5600mAh బ్యాటరీ, 6.7 అంగుళాల FHD+ డిస్‌ప్లే ఫోన్ విడుదల.. ఇవాళ్టి నుంచే ప్రీ బుకింగ్..!
ఈ సంవత్సరం ఫిబ్రవరిలో వివో V50 మోడల్ లాంచ్ కాగా, ఇవాళ భారత్ మార్కెట్‌లో వివో V50e స్మార్ట్‌ఫోన్ (Vivo V50e Smartphone Launched) విడుదల అయింది. ఈ హ్యాండ్‌సెట్ IP68+ IP69 రేటింగ్‌తో డస్ట్ మరియు వాటర్ రెసిస్టెంట్‌గా ఉంది. మరియు 90W వైర్ ఫాస్ట్ ఛార్జింగ్ సపోర్టును కలిగి ఉంది. ఈ ఫోన్ 50MP సెల్ఫీ కెమెరాతో అందుబాటులోకి వచ్చింది. ఈ ఫోన్‌ను ఇవాళ్టి నుంచే ముందస్తు బుకింగ్ చేసుకొనేందుకు అవకాశం కల్పిస్తున్నట్లు వివో తెలిపింది. ఈ వివో హ్యాండ్‌సెట్ స్పెసిఫికేషన్‌లు, ఫీచర్‌ల పూర్తి వివరాలు.
వివో V50e స్మార్ట్‌ఫోన్ ఫీచర్‌లు, స్పెసిఫికేషన్‌ల వివరాలు :
వివో V50e స్మార్ట్‌ఫోన్ ఆండ్రాయిడ్ 15 ఆధారిత FuntouchOS 15 (Skin) పైన పనిచేస్తుంది. మరియు 4nm ఆక్టా కోర్ మీడియాటెక్ డైమెన్సిటీ 7300 SoC ప్రాసెసర్‌ను కలిగి ఉంది. ఈ ప్రాసెసర్ గరిష్ఠంగా 8GB LPDDR4X ర్యామ్, 256GB UFS 2.2 స్టోరేజీని సపోర్టు చేస్తుంది.

ఈ ఫోన్ 8GB ర్యామ్ + 128GB స్టోరేజీ, 8GB ర్యామ్ + 256GB స్టోరేజీ వేరియంట్స్‌లో లాంచ్ అయింది. ఈ ఫోన్ 3 సంవత్సరాల ఆండ్రాయిడ్ OS అప్‌డేట్స్, 4 సంవత్సరాల వరకు సెక్యూరిటీ అప్‌డేట్స్ అందిస్తామని వివో హామీ ఇచ్చింది.
డిస్‌ప్లే వివరాలు :
ఈ వివో ఫోన్ 6.77 అంగుళాల ఫుల్ HD+ (1080*2392 పిక్సల్స్) క్వా్డ్ కర్వడ్ అమోలెడ్ డిస్‌ప్లేతో లాంచ్ అయింది. ఈ డిస్‌ప్లే 120Hz రీఫ్రెష్ రేట్, 1800 నిట్స్ పీక్ బ్రైట్‌నెస్, 300Hz టచ్ శాంప్లింగ్ రేట్, 2160Hz PWM డిమ్మింగ్ రేట్‌ను కలిగి ఉంది.

ఈ హ్యాండ్‌సెట్ డైమండ్ షీల్డ్ గ్లాస్ ప్రొటెక్షన్ తో అందుబాటులోకి వచ్చింది. ఈ వివో కొత్త ఫోన్ డిస్‌ప్లే HDR10+ సపోర్టు చేస్తుంది. మరియు ఎక్కువ సమయం వినియోగించినా కళ్లకు హానికలగకుండా ఉండేందుకు SGS Low Blue Light సర్టిఫికేషన్‌ను కలిగి ఉంది.
కెమెరా వివరాలు :
కెమెరా విభాగం పరంగా ఈ ఫోన్ డ్యూయల్ కెమెరాలను కలిగి ఉంది. f/1.79 అపేచర్, ఆప్టికల్ ఇమేజ్ స్టెబిలైజేషన్ (OIS) సపోర్టుతో 50MP సోనీ IMX882 ప్రైమరీ కెమెరా, f/2.2 అపేచర్‌తో 8MP అల్ట్రావై్ యాంగిల్ కెమెరాను కలిగి ఉంది.
ఈ ఫోన్‌కు సెల్ఫీ, వీడియో కాల్స్ కోసం 50MP సెల్ఫీ కెమెరాను అమర్చారు. దీంతోపాటు వెనుక వైపు Aura లైట్ ఫీచర్ కూడా కలిగి ఉంది. బ్యాటరీ లైఫ్, ఛార్జింగ్ పరంగా ఈ హ్యాండ్‌సెట్ 5600mAh బ్యాటరీతో పనిచేస్తుంది. మరియు 90W వైర్ ఫాస్ట్ ఛార్జింగ్ ను సపోర్టు చేస్తుంది.
కనెక్టివిటీ పరంగా 5G, 4G LTE, బ్లూటూత్, వైఫై, GPS, OTG, USB-C ఛార్జింగ్ పోర్టును కలిగి ఉంది. ఈ ఫోన్ IP68 + IP69 రేటింగ్‌తో డస్ట్ మరియు వాటర్ రెసిస్టెంట్‌గా ఉంది. భద్రత కోసం ఇన్ డిస్‌ప్లే ఫింగర్ ప్రింట్ సెన్సార్‌ను కలిగి ఉంది. ఈ ఫోన్ బరువు 186 గ్రాములుగా ఉంది.
Check out the new vivo V50e. Luxury never looked better and now you can own it with exclusive offers.
— vivo India (@Vivo_India) April 10, 2025
Prebook Now https://t.co/iiBfuyz1EB#vivoV50e #PortraitSoPro pic.twitter.com/cPFlx37DLA
వివో V50e స్మార్ట్‌ఫోన్ ధర, సేల్ వివరాలు :
వివో V50e స్మార్ట్‌ఫోన్ 8GB ర్యామ్ + 128GB స్టోరేజీ వేరియంట్ ధర రూ.28999, 8GB ర్యామ్ + 256GB స్టోరేజీ వేరియంట్ ధర రూ.30999 గా ఉంది. ఈ హ్యాండ్‌సెట్ పెర్ల్ వైట్, Sapphire బ్లూ రంగుల్లో లభిస్తుంది.
ఈ ఫోన్‌ను ఇవాళ్టి నుంచి ముందస్తు బుకింగ్ చేసుకోవచ్చు. మరియు ఏప్రిల్ 17 వ తేదీ నుంచి సేల్ ప్రారంభం కానుంది. వివో ఇండియా ఇ-స్టోర్, ప్రముఖ ఇ-కామర్స్ ప్లాట్‌ఫాంలు అమెజాన్, ఫ్లిప్‌కార్ట్ ద్వారా కొనుగోలు చేయవచ్చు.


Click it and Unblock the Notifications








