Home
Mobile

50MP సెల్ఫీ కెమెరా, 90W ఫాస్ట్‌ ఛార్జింగ్‌, 6.77 అంగుళాల క్వాడ్‌ కర్వడ్‌ అమోలెడ్‌ డిస్‌ప్లే వివో 5G ఫోన్‌ సేల్

ప్రముఖ స్మార్ట్‌ఫోన్‌ల తయారీ సంస్థ వివో నుంచి ఈ నెల రెండు వారంలో వివో V50e స్మార్ట్‌ఫోన్ లాంచ్‌ అయింది. వివో V50 మోడల్‌ ఇప్పటికే అందుబాటులో ఉండగా.. కాస్త తక్కువ ధరలో ఈ కొత్త మోడల్‌ అందుబాటులోకి వచ్చింది. ఈ V50e హ్యాండ్‌సెట్‌ను ప్రస్తుతం కొనుగోలు చేయవచ్చు. వివో ఇండియా ఇ-స్టోర్‌తోపాటు అమెజాన్‌, ఫ్లిప్‌కార్ట్‌ ద్వారా కొనుగోలు చేయవచ్చు. తొలి సేల్‌లో (Vivo V50e Smartphone Sale) భాగంగా డిస్కౌంట్‌లను అందిస్తోంది.

వివో V50e స్మార్ట్‌ఫోన్‌ ధర, సేల్ వివరాలు :
భారత్‌ మార్కెట్‌లో వివో V50e స్మార్ట్‌ఫోన్‌ రెండు స్టోరేజీ వేరియంట్స్‌లో అందుబాటులో ఉంది. 8GB ర్యామ్ + 128GB స్టోరేజీ ధర రూ.28,999, 8GB ర్యామ్ + 256GB స్టోరేజీ వేరియంట్‌ ధర రూ.30,999 గా ఉంది. వివో అధికారిక స్టోర్‌, అమెజాన్‌లో HDFC, ICICI, SBI క్రెడిట్‌ కార్డులపై కొనుగోలు చేస్తే రూ.15000 డిస్కౌంట్‌ను పొందవచ్చు.

Vivo V50e Smartphone sale

అదే EMI లో కొనుగోలు చేస్తే గరిష్ఠంగా రూ.3100 డిస్కౌంట్‌ను పొందవచ్చు. వివో అధికారిక వైబ్‌సైట్‌ ఆధారంగా ఈ ఆఫర్‌ ఏప్రిల్‌ 23 వ తేదీ వరకు అందుబాటులో ఉంటుంది. ఫ్లిప్‌కార్ట్‌లో ఫ్లిప్‌కార్ట్‌ యాక్సెస్‌ బ్యాంకు కార్డు ద్వారా 5 శాతం క్యాష్‌బ్యాక్‌ను పొందవచ్చు. ఈ ఫోన్‌ పెర్ల్‌ వైట్‌, Sapphire బ్లూ కలర్‌ వేరియంట్స్‌లో లభిస్తుంది.

వివో V50e స్మార్ట్‌ఫోన్ పూర్తి వివరాలు :
వివో V50e స్మార్ట్‌ఫోన్‌ 120Hz రీఫ్రెష్‌ రేట్‌తో 6.77 అంగుళాల FHD+ క్వా్డ్‌ కర్వడ్‌ అమోలెడ్‌ డిస్‌ప్లేను కలిగి ఉంది. ఈ డిస్‌ప్లే 1800 నిట్స్‌ గరిష్ఠ బ్రైట్‌నెస్, 300Hz టచ్‌ శాంప్లింగ్‌ రేట్‌, 2160Hz PWM డిమ్మింగ్‌ రేట్‌ను కలిగి ఉంది. HDR10+ సపోర్టుతోపాటు SGS Low బ్లూ లైట్‌ సర్టిఫికేషన్‌తో అందుబాటులోకి వచ్చింది.

చిప్‌సెట్‌, OS వివరాలు :
ఈ వివో మిడ్‌ రేంజ్‌ స్మార్ట్‌ఫోన్‌ 4nm మీడియాటెక్‌ డైమెన్సిటీ 7300 SoC చిప్‌సెట్‌ను కలిగి ఉంది. ఈ చిప్‌సెట్‌ 8GB LPDDR4X ర్యామ్, 256GB UFS 2.2 స్టోరేజీని సపోర్టు చేస్తుంది. మరియు ఆండ్రాయిడ్ 15 ఆధారిత Funtouch OS 15 తో పనిచేస్తుంది. 3 సంవత్సరాల ఆండ్రాయిడ్ OS అప్‌డేట్స్‌, 4 సంవత్సరాల వరకు సెక్యూరిటీ అప్‌డేట్స్‌ను పొందుతుంది.

50MP సెల్ఫీ కెమెరా :
కెమెరా విభాగం పరంగా ఈ హ్యాండ్‌సెట్‌ వెనుక వైపు డ్యూయల్‌ కెమెరాలను కలిగి ఉంది. 50MP సోనీ IMX882 OIS కెమెరా, 8MP అల్ట్రావైడ్‌ యాంగిల్‌ కెమెరాతో అందుబాటులోకి వచ్చింది. సెల్ఫీ, వీడియో కాల్స్‌ కోసం 50MP కెమెరాను అమర్చారు. కెమెరాల పరంగా మంచి అనుభూతిని ఇస్తుంది.

90W వైర్‌ ఫాస్ట్‌ ఛార్జింగ్ :
ఈ స్మా్ర్ట్‌ఫోన్‌ 90W వైర్‌ ఫాస్ట్‌ ఛార్జింగ్‌ సపోర్టుతో 5600mAh బ్యాటరీతో పనిచేస్తోంది. దీంతోపాటు IP68 + IP69 రేటింగ్‌తో డస్ట్‌ మరియు వాటర్‌ రెసిస్టెంట్‌గా ఉంది. ఇన్‌ డిస్‌ప్లే ఫింగర్ ప్రింట్‌ సెన్సార్‌ను అమర్చారు. ఈ ఫోన్‌ డైమండ్‌ షీల్డ్‌ గ్లాస్ ప్రొటెక్షన్‌ ను కలిగి ఉంది. కనెక్టివిటీ పరంగా 5G, 4G LTE, బ్లూటూత్‌, వైఫై, GPS, OTG, USB-C ఛార్జింగ్ పోర్టును కలిగి ఉంది.

More from GizBot

Best Mobiles in India

English summary
Vivo V50e Smartphone with 50MP selfie camera and 90W fast charging support sale today in india
Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
X