Home
Mobile

50MP + 50MP కెమెరాలు, క్వాడ్‌ కర్వడ్ అమోలెడ్ డిస్‌ప్లే 5G స్మార్ట్‌ఫోన్‌పై భారీ డిస్కౌంట్‌..!

వివో భారత్‌ మార్కెట్‌లో ఈ సంవత్సరం అనేక స్మార్ట్‌ఫోన్‌లను లాంచ్ చేసింది. T, V సిరీస్‌ నుంచి అనేక మోడల్స్‌ను అందుబాటులోకి తీసుకొచ్చింది. వివో నుంచి రేపు (అక్టోబర్‌ 7) వివో V60e స్మార్ట్‌ఫోన్‌ లాంచ్‌ కానుంది. ఈ ఫోన్ 200MP కెమెరా, 6500mAh భారీ బ్యాటరీతో పనిచేస్తుంది. అయితే ఈ సంవత్సరం ఏప్రిల్‌ నెలలో విడుదల అయిన వివో V50e స్మార్ట్‌ఫోన్‌ను ప్రస్తుతం డిస్కౌంట్ ధరతో అందుబాటులో ఉంది. ఈ ఫోన్‌ క్వాడ్‌ కర్వడ్‌ అమోలెడ్ డిస్‌ప్లే, 50MP సెల్ఫీ కెమెరా, 4 సంవత్సరాల వరకు అప్‌డేట్స్‌ను పొందవచ్చు.

రూ.2 వేల డిస్కౌంట్‌తోపాటు :
భారత్‌ మార్కెట్‌లో వివో V50e స్మార్ట్‌ఫోన్‌ (Vivo V50e Smartphone) విడుదల సమయంలో 8GB ర్యామ్ + 128GB స్టోరేజీ ధర రూ.28,999, 8GB ర్యామ్ + 256GB స్టోరేజీ ధర రూ.30,999 గా ఉంది. ప్రస్తుతం వివో అధికారిక వెబ్‌సైట్‌, అమెజాన్‌లో తగ్గింపు ధరకు అందుబాటులో ఉంది. దీంతోపాటు బ్యాంకు కార్డులపై డిస్కౌంట్‌ను పొందవచ్చు.

vivo V50e Smartphone pricecut in india

రూ.2700 అదనపు తగ్గింపు :
ప్రస్తుతం వివో అధికారిక వెబ్‌సైట్‌లో ఈ ఫోన్‌లు రూ.26999, రూ.28999 గా ఉంది. అంటే విడుదల ధరతో పోలిస్తే రూ.2 వేలు తగ్గింపు ధరకు అందుబాటులో ఉంది. అయితే వివో వెబ్‌సైట్‌లో ఎంపిక చేసిన బ్యాంకు కార్డులపై గరిష్ఠంగా రూ.2700 వరకు తగ్గింపును పొందవచ్చు. అంటే మొత్తంగా రూ.4700 వరకు డిస్కౌంట్‌ను పొందవచ్చు. అమెజాన్‌లో కూడా బ్యాంకు ఆఫర్‌ ఉంది.

వివో V50e స్మార్ట్‌ఫోన్ 4nm మీడియాటెక్‌ డైమెన్సిటీ 7300 SoC ప్రాసెసర్‌ను కలిగి ఉంది. ఈ ప్రాసెసర్‌ 8GB LPDDR4X ర్యామ్, 256GB UFS 2.2 స్టోరేజీతో జతచేసి ఉంది. ఆండ్రాయిడ్ 15 ఆధారిత FuntouchOS 15 పైన పనిచేస్తోంది.

క్వాడ్ కర్వడ్ అమోలెడ్ డిస్‌ప్లే, డైమండ్ షీల్డ్‌ గ్లాస్‌ ప్రొటెక్షన్ :
ఈ హ్యాండ్‌సెట్ 6.77 అంగుళాల FHD+ క్వాడ్‌ కర్వడ్‌ అమోలెడ్‌ డిస్‌ప్లేను కలిగి ఉంది. 120Hz రీఫ్రెష్‌ రేట్‌, 1800 నిట్స్‌ పీక్‌ బ్రైట్‌నెస్, 300Hz టచ్‌ శాంప్లింగ్‌ రేట్‌ను కలిగి ఉంది. ఈ ఫోన్ డైమండ్‌ షీల్డ్‌ గ్లాస్ ప్రొటెక్షన్‌ పొందుతోంది. ఈ ఫోన్ పెర్ల్‌ వైట్‌, Sapphire బ్లూ కలర్‌ వేరియంట్స్‌లో అందుబాటులో ఉంది.

vivo V50e Smartphone pricecut in india

50MP + 50MP కెమెరాలు :
కెమెరా విభాగం పరంగా ఈ ఫోన్ ఆప్టికల్‌ ఇమేజ్‌ స్టెబిలైజేషన్‌ (OIS) సపోర్టుతో 50MP సోనీ IMX882 కెమెరా, 8MP అల్ట్రావైడ్‌ యాంగిల్‌ లెన్స్‌ను కలిగి ఉంది. దీంతోపాటు 50MP సెల్ఫీ కెమెరాను కలిగి ఉంది. ఈ ఫోన్‌ 90W వైర్‌ ఫాస్ట్‌ ఛార్జింగ్‌ సపోర్టుతో 5600mAh బ్యాటరీని కలిగి ఉంది.

Take a Poll

ఈ వివో స్మార్ట్‌ఫోన్‌ సెక్యూరిటీ కోసం ఇన్‌డిస్‌ప్లే ఫింగర్‌ ప్రింట్‌ సెన్సర్‌ను కలిగి ఉంది. ఈ హ్యాండ్‌సెట్‌ IP68 + IP69 రేటింగ్‌తో డస్ట్‌, వాటర్‌ రెసిస్టెంట్‌గా ఉంది. ఈ ఫోన్‌ 3 ఆండ్రాయిడ్ OS అప్‌డేట్స్‌, 4 సంవత్సరాల వరకు సెక్యూరిటీ అప్‌డేట్స్‌ను పొందుతుంది.

More from GizBot

Best Mobiles in India

English summary
vivo V50e Smartphone with 50MP selfie camera now available with discount price
Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
X