Home
Mobile

క్వాడ్‌ కర్వడ్ డిస్‌ప్లే, 90W ఫాస్ట్‌ ఛార్జింగ్‌, 50MP సెల్ఫీ కెమెరా 5G ఫోన్‌పై డిస్కౌంట్‌..!

ప్రముఖ స్మార్ట్‌ఫోన్‌ల తయారీ సంస్థ వివో భారత్‌ మార్కెట్‌లో ఈ సంవత్సరం అనేక మోడల్స్‌ను లాంచ్‌ చేసింది. ఇందులో V సిరీస్ మోడల్స్‌ విడుదల అయ్యాయి. ఈ సంవత్సరం తొలిభాగంలో వివో V50e స్మార్ట్‌ఫోన్‌ (Vivo V50e Smartphone) అందుబాటులోకి వస్తుంది. ఈ ఫోన్‌ క్వాడ్‌ కర్వడ్‌ డిస్‌ప్లే, డైమండ్ షీల్డ్‌ ప్రొటెక్షన్‌ను పొందుతుంది. 50MP సెల్ఫీ కెమెరాతోపాటు IP68, IP69 రేటింగ్ ను కలిగి ఉంది. ఈ ఫోన్‌ పూర్తి స్పెసిఫికేషన్‌లు, ఫీచర్లు, సేల్‌ వివరాలు.

వివో V50e స్మార్ట్‌ఫోన్ డిస్కౌంట్‌ ఆఫర్‌ :
ఈ హ్యాండ్‌సెట్ విడుదల సమయంలో 8GB ర్యామ్ + 128GB స్టోరేజీ ధర రూ.28,999, 8GB ర్యామ్ + 256GB స్టోరేజీ ధర రూ.30,999 గా ఉంది. ప్రస్తుతం అమెజాన్‌లో రూ.4 వేల కంటే ఎక్కువ డిస్కౌంట్ ధరకు కొనుగోలు చేయవచ్చు.

Vivo V50e Smartphone

రెండు కలర్‌ వేరియంట్స్ :
అమెజాన్‌లో ఈ ఫోన్ ప్రస్తుతం ధర రూ.24,999, రూ.25,799 గా ఉంది. దీంతోపాటు ఎంపిక చేసిన బ్యాంకు కార్డులపై అదనంగా రూ.2000 డిస్కౌంట్‌ను పొందవచ్చు. ఈ ఫోన్‌ Sapphire బ్లూ, పెర్ల్‌ వైట్‌ కలర్ వేరియంట్స్‌లో లభిస్తుంది.

క్వాడ్‌ కర్వడ్‌ అమోలెడ్‌ డిస్‌ప్లే :
ఈ హ్యాండ్‌సెట్‌ 120Hz రీఫ్రెష్‌ రేట్‌తో 6.77 అంగుళాల FHD+ క్వాడ్‌ కర్వడ్‌ అమోలెడ్‌ డిస్‌ప్లేను కలిగి ఉంది. ఈ డిస్‌ప్లే 1800 నిట్స్‌ గరిష్ఠ బ్రైట్‌నెస్, 300Hz టచ్‌ శాంప్లింగ్‌ రేట్‌ను కలిగి ఉంది. ఈ డిస్‌ప్లే HDR10+, SGS Low Blue Light సర్టిఫికేషన్‌ను కలిగి ఉంది.

డైమండ్‌ షీల్డ్‌ గ్లాస్ ప్రొటెక్షన్‌ :
ఈ వివో స్మార్ట్‌ఫోన్‌ డైమండ్‌ షీల్డ్‌ గ్లాస్ ప్రొటెక్షన్‌ ను కలిగి ఉంది. దీంతోపాటు ఈ ఫోన్‌ IP68 + IP69 రేటింగ్‌ తో డస్ట్ మరియు వాటర్‌ రెసిస్టెంట్‌గా ఉంది. ఈ ఫోన్‌ ఇన్‌డిస్‌ప్లే ఫింగర్‌ ప్రింట్‌ సెన్సర్‌ను కలిగి ఉంది.

4 సంవత్సరాల వరకు అప్‌డేట్స్‌ :
వివో స్మార్ట్‌ఫోన్‌ 4nm ఆక్టా కోర్‌ మీడియాటెక్‌ డైమెన్సిటీ 7300 SoC చిప్‌సెట్‌ ను కలిగి ఉంది. ఈ చిప్ 8GB LPDDR4X ర్యామ్, 256GB UFS 2.2 స్టోరేజీని సపోర్టు చేస్తుంది. ఆండ్రాయిడ్ 15 ఆధారిత FuntouchOS 15 పైన పనిచేస్తోంది. ఈ ఫోన్ 3 ఆండ్రాయిడ్ OS అప్‌డేట్స్‌, 4 సంవత్సరాల వరకు సెక్యూరిటీ అప్‌డేట్స్‌ పొందుతుంది.

50MP సెల్ఫీ కెమెరా :
కెమెరా విభాగం పరంగా వెనుక వైపు OIS (ఆప్టికల్‌ ఇమేజ్‌ స్టెబిలైజేషన్) సపోర్టుతో 50MP సోనీ IMX882 ప్రైమరీ కెమెరా ఉంది. దీంతోపాటు 8MP అల్ట్రావైడ్ యాంగిల్‌ లెన్స్‌ ఉన్నాయి. ముందు వైపు 50MP సెల్ఫీ కెమెరాను అమర్చారు. ఈ ఫోన్ వెనుకవైపు Aura లైట్‌ కూడా ఉంది.

ఫాస్ట్‌ ఛార్జింగ్ :
వివో V50e స్మార్ట్‌ఫోన్‌ 90W వైర్‌ ఫాస్ట్‌ ఛార్జింగ్ సపోర్టుతో 5600mAh బ్యాటరీతో పనిచేస్తుంది. కనెక్టివిటీ పరంగా ఈ ఫోన్ 5G, 4G LTE, Wi-Fi, బ్లూటూత్‌, GPS, OTG, USB-C ఛార్జింగ్ పోర్టును కలిగి ఉంది.

More from GizBot

Best Mobiles in India

English summary
Vivo V50e Smartphone with Quad Curved display, 50MP Selfie Camera gets discount on amazon
Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
X