Vivo కొత్త స్మార్ట్‌ఫోన్ V5s లాంచ్ అయ్యింది, ధర రూ.18,990

గురువారం ఢిల్లీలో ఏర్పాటు చేసిన ప్రత్యేక లాంచ్ ఈవెంట్‌లో భాగంగా వివో తన కొత్త స్మార్ట్‌ఫోన్ Vivo V5sను విడుదల చేసింది. వివో వీ5 స్మార్ట్‌ఫోన్‌కు అప్‌డేటెడ్ వర్షన్‌గా విడుదలైన ఈ ఫోన్ ధర రూ.18,990.

Read More : రెడ్మీ నోట్ 4కు చెక్, 5000 mAh బ్యాటరీతో Moto E4...

గిజ్‌బాట్ మరిన్ని అప్‌డేట్స్ ఇక్కడే

ఫోన్ డిస్‌ప్లే ఇంకా డిజైనింగ్..

వివో వీ5ఎస్ స్మార్ట్‌ఫోన్ 5.5 అంగుళాల హైడెఫినిషన్ డిస్‌ప్లేను కలిగి ఉంటుంది. 2.5డి కర్వుడ్ కార్నింగ్ గొరిల్లా గ్లాస్ డిస్‌ప్లేకు అదనపు ప్రొటెక్షన్‌గా నిలుస్తుంది. మెటల్ యునిబాడీ డిజైన్ ఆకట్టుకుంటుంది. ఫోన్ వెనుక భాగంలో కనిపించే U-Type లైనింగ్ డివైస్ లుక్‌ను మరింత ఆకర్షణీయంగా మార్చేసింది. వివో వీ5ఎస్ స్మార్ట్‌ఫోన్‌లో నిక్షిప్తం చేసిన ఫింగర్ ప్రింట్ స్కానర్ వాటర్‌ప్రూఫ్ ప్రొటెక్షన్‌ను కలిగి ఉండటం విశేషం. కేవలం 154 గ్రాముల బరువును మాత్రమే కలిగి ఉండే ఈ ఫోన్ 153.8 x 75.5 x 7.55మిల్లీ మీటర్ల చట్టుకొలతతో మరింత నాజూకుగా కనిపిస్తుంది.

ఫోన్ హార్డ్‌వేర్ స్పెసిఫికేషన్స్

వివో వీ5ఎస్ స్మార్ట్‌ఫోన్‌, 1.5GHz ఆక్టా కోర్ 64 బిట్ మీడియాటెక్ ఎంటీ6750 ప్రాసెసర్ పై రన్ అవుతుంది. ఈ ప్రాసెసర్‌కు అనుసంధాంచిన Mali T860 GPU గ్రాఫిక్ విభాగాన్ని
చూసుకుంటుంది. ఇక ర్యామ్ విషయానికి వస్తే వివో వీ5ఎస్ స్మార్ట్‌ఫోన్‌ 4జీబి ర్యామ్‌ను కలిగి ఉంటుంది. 64జీబి ఇంటర్నల్ స్టోరేజ్, మైక్రోఎస్డీ స్లాట్ ద్వారా స్టోరేజ్ కెపాసిటీని 128జీబి వరకు విస్తరించుకునే అవకాశం, 3000mAh బ్యాటరీ.

సాఫ్ట్‌వేర్ విషయానికి వచ్చేసరికి

ఇక సాఫ్ట్‌వేర్ విషయానికి వచ్చేసరికి వివో వీ5ఎస్, ఆండ్రాయిడ్ 6.0 మార్ష్‌మల్లో ఆపరేటింగ్ సిస్టం ఆధారంగా డిజైన్ చేసిన Funtouch OS 3.0 స్కిన్‌తో బూట్ అవుతుంది.

కెమెరా స్పెసిఫికేషన్స్...

వివో వీ5ఎస్ స్మార్ట్‌ఫోన్‌,20 మెగా పిక్సల్ ఫ్రంట్ ఫేసింగ్ కెమెరాతో వస్తోంది. ఈ కెమెరాలో పొందుపరిచిన ‘Moonlight Glow' ఫీచర్ ద్వారా పర్‌ఫెక్ట్ సెల్ఫీలను చిత్రీకరించుకోవచ్చని కంపెనీ చెబుతోంది. ఎల్ఈడి ఫ్లాష్, సోనీ ఐఎమ్ఎక్స్376 సెన్సార్, ఎఫ్2.0 అపెర్చుర్, ఫేస్ బ్యూటీ 6.0, గ్రూప్ సెల్ఫీ మోడ్ వంటి ప్రత్యేకతలు కూడా ఈ కెమెరాలో ఉన్నాయి. ఇక ప్రైమరీ కెమెరా విషయానికొస్తే,ఫోన్ వెనుక భాగంలో 13 మెగా పిక్సల్ సెన్సార్‌ను అమర్చటం జరిగింది.

కనెక్టువిటీ ఫీచర్లు..

డ్యుయల్ సిమ్ సపోర్ట్ (జీఎస్ఎమ్+జీఎస్ఎమ్), వై-ఫై, జీపీఎస్, బ్లుటూత్, యూఎస్బీ ఆన్ ద గో, ఎఫ్ఎమ్ రేడియో, 3జీ, 4జీ (బ్యాండ్ 40) ఎల్టీఈ నెట్‌వర్క్ సపోర్ట్, సెన్సార్స్ (కంపాస్ మాగ్నెటో‌మీటర్, ప్రాక్సిమిటీ సెన్సార్, యాక్సిలరోమీటర్, యాంబియంట్ లైట్ సెన్సార్).

ప్రీ-ఇన్‌స్టాల్డ్ యాప్స్

వివో వీ5ఎస్ స్మార్ట్‌ఫోన్‌లో ముందుగానే ఇన్‌స్టాల్ చేసి ఉంచిన యాప్స్ వివరాలు (ఫేస్‌బుక్, గూగుల్ డ్యుయో, వాట్సాప్, లైన్, వైబర్, వుయ్ చాట్, గూగుల్ సర్వీస్ యాప్స్, యూసీ బ్రౌజర్, అమెజాన్, డెటిక్‌కామ్ ఇంకా యాప్ క్లోన్ ఫీచర్.

ధర ఇంకా అందుబాటు

మార్కెట్లో వివో వీ5ఎస్ ధర రూ.18,990. రెండు కలర్ వేరియంట్‌లలో ఈ ఫోన్ అందుబాటులో ఉంటుంది. వాటి వివరాలు క్రౌన్ గోల్డ్ ఇంకా మాటీ బ్లాక్.
ఈ ఫోన్‌‌లకు సంబంధించి ప్రీ-బుకింగ్స్ ఇప్పటికే ప్రారంభమయ్యాయి. మొదటి సేల్ మే6న జరుగుతుంది.

గిజ్‌బాట్ మరిన్ని అప్‌డేట్స్ ఇక్కడే

English summary
Vivo V5s launched with 20-megapixel selfie camera in India at Rs 18,990. Read More in Telugu Gizbot..
Opinion Poll

Social Counting

ఇన్స్టెంట్ న్యూస్ అప్డేట్స్ రోజుంతా పొందండి - Telugu Gizbot