మంచి కెమెరాలు, భారీ బ్యాటరీ, వాటర్ ప్రూఫ్ ఫోన్ కోసం చూస్తున్నారా.. మరో రెండు రోజుల్లో సేల్ ప్రారంభం..!
ప్రముఖ స్మార్ట్‌ఫోన్‌ల తయారీ సంస్థ వివో నుంచి గత వారం వివో V60 5G స్మార్ట్‌ఫోన్ అందుబాటులోకి వచ్చింది. ఈ ఫోన్ ఈ సంవత్సరం తొలిరోజుల్లో లాంచ్ అయిన వివో V50 ఫోన్‌కు తర్వాత తరం వెర్షన్‌గా ఉంది. వివో V60 స్మార్ట్‌ఫోన్ కెమెరాలు, డిజైన్, బ్యాటరీ పరంగా మెరుగైన పనితీరును అందిస్తుంది. ఈ ఫోన్ సేల్ ఆగస్టు 19 నుంచి ప్రారంభం కానుంది. ఈ ఫోన్ స్పెసిఫికేషన్‌లు, ఫీచర్ల వివరాలు.
వివో V60 స్మార్ట్‌ఫోన్ ను వివో ఇండియా ఇ-స్టోర్, ఆఫ్‌లైన్ స్టోర్స్, ఫ్లిప్‌కార్ట్ ద్వారా (Vivo V60 5G Smartphone Sale) కొనుగోలు చేయవచ్చు. ప్రస్తుతం ముందస్తు బుకింగ్ చేసుకొనేందుకు అవకాశం ఉంది. ఈ ఫోన్ 8GB ర్యామ్ + 128GB స్టోరేజీ ధర రూ.36999 గా ఉంది.

ధర వివరాలు :
మరియు 8GB ర్యామ్ + 256GB స్టోరేజీ ధర రూ.38999, 12GB ర్యామ్ + 256GB స్టోరేజీ ధర రూ.40999, 16GB ర్యామ్ + 512GB స్టోరేజీ ధర రూ.45999 గా ఉంది. మిడ్‌రేంజ్‌లో మంచి కెమెరాలు, డిజైన్, భారీ బ్యాటరీ, మెరుగైన పనితీరు కలిగిన ఫోన్ కోసం చూస్తున్నవారికి మంచి ఆప్షన్ అయ్యే అవకాశం ఉంది.
మంచి వాటర్ ప్రూఫ్ ఫోన్ :
వివో V60 5G స్మార్ట్‌ఫోన్ 6.77 అంగుళాల (1080 x 2392 పిక్సల్స్) క్వాడ్ కర్వడ్ అమోలెడ్ డిస్‌ప్లేను కలిగి ఉంది. ఈ డిస్‌ప్లే ఆకట్టుకుంటుంది. మరియు 120Hz రీఫ్రెష్ రేట్, 5000 నిట్స్ పీక్ బ్రైట్‌నెస్‌ను కలిగి ఉంది. IP68 + IP69 రేటింగ్‌తో డస్ట్ మరియు వాటర్ రెసిస్టెంట్‌గా ఉంది. పొరపాటున నీటిలో పడినా డ్యామేజీ కాదు.

6 సంవత్సరాల అప్‌డేట్స్ :
ఈ వివో మిడ్‌రేంజ్ 5G స్మార్ట్‌ఫోన్ స్నాప్‌డ్రాగన్ 7 జెన్ 4 SoC చిప్‌సెట్‌ను కలిగి ఉంది. ఆండ్రాయిడ్ 15 ఆధారిత Funtouch OS 15 పైన పనిచేస్తుంది. నాలుగు ఆండ్రాయిడ్ OS అప్‌డేట్స్, 6 సంవత్సరాల వరకు సెక్యూరిటీ అప్‌డేట్స్‌ను పొందుతుంది.
మంచి కెమెరాలు :
కెమెరా విభాగం పరంగా అద్భుతంగా పనిచేస్తుంది. ఈ ఫోన్ Zeiss భాగస్వామ్యాన్ని కలిగి ఉంది. ఇందులో 50MP సోనీ IMX766 ప్రైమరీ కెమెరా (OIS), 50MP సోనీ IMX882 టెలిఫోటో, 8MP అల్ట్రావైడ్ యాంగిల్ లెన్స్‌లను కలిగి ఉంది. 50MP సెల్ఫీ కెమెరాతో అందుబాటులో ఉంది. ఈ ఫోన్ కెమెరాలతో 4K వీడియో రికార్డింగ్ చేయవచ్చు.

భారీ బ్యాటరీ :
ఈ వివో స్మార్ట్‌ఫోన్ 90W ఫాస్ట్ ఛార్జింగ్ సపోర్టుతో 6500mAh బ్యాటరీని కలిగి ఉంది. ఫలితంగా హెవీ యూజర్లకు ఆకట్టుకుంటుంది. మరియు ఏఐ ఆధారిత స్పామ్ బ్లాక్ టూల్, AI Image Expander, AI Smart Call Assistant ఫీచర్లను కలిగి ఉంది.
కనెక్టివిటీ పరంగా 5G, 4G, బ్లూటూత్ 5.4, WiFi, NFC, GPS, USB-C ఛార్జింగ్ పోర్టును కలిగి ఉంది. సెక్యూరిటీ కోసం ఇన్ డిస్‌ప్లే ఫింగర్ ప్రింట్ సెన్సర్‌ను కలిగి ఉంది. ఈ ఫోన్ ఆస్పీషియస్ గోల్డ్, మిస్ట్ గ్రే, మూన్‌లిట్ బ్లూ కలర్ వేరియంట్స్‌లో లభిస్తుంది.


Click it and Unblock the Notifications








